About
Wisdom
FILTERS:
SORT BY:
మీరు అంతర్గతంగా పరిణితి చెందితే, మీలో గర్వం ఉండదు, పక్షపాతం ఉండదు. మీరు నిర్మలమైన, పరిపూర్ణమైన వివేకంతో పనులు చేస్తారు.
ప్రతిదీ శూన్యం నుంచే వస్తుంది, తిరిగి శూన్యంలోకే వెళుతుంది. శూన్యమే ఈ ఉనికికి ఆధారం.
ఒకసారి మీకూ మీ శరీరానికీ, అలాగే మీకూ మీ మనసుకీ మధ్య కొంచెం దూరం ఏర్పడితే, అది భౌతికాతీతమైన దాన్ని అనుభూతి చెందే అవకాశాన్ని కలిగిస్తుంది.
మీ ఆలోచనా ప్రక్రియ లేక మనోభావ ప్రక్రియ ఏదైనా సరే, అది కేవలం మీలో జరిగే ముచ్చట్లే, అది మీకే పరిమితమైనది. బాగుంటే దానిని ఆస్వాదించండి, అంతేగాని అదే నిజమనుకోకండి.
మీ చైతన్యపు స్వభావం, మీ శరీరంలోని ప్రతి కణంలో, మీ జీవితంలోని ప్రతిక్షణం వ్యక్తమవుతుంటుంది.
జీవం ప్రకాశించాలంటే, అది అన్నింటితో మమేకమవ్వాలి. జీవం ఆ విధంగానే తయారుచేయబడింది.
సుఖమనేది ఒక స్థాయి ఆహ్లాదమైతే, ఆనందమనేది మరో స్థాయి. సుఖం మధురంగా ఉంటుంది, కానీ అది మిమ్మల్ని బానిసను చేస్తుంది. ఆనందం అద్భుతంగా ఉంటుంది, అన్నిటినీ మించి అది విముక్తినిస్తుంది.
మీ తల్లిదండ్రులు మీకు మానవ దేహాన్ని ఇచ్చారు. వారే మిమ్మల్ని పెంచాలనుకుంటున్నారా లేక మీరొక పరిపూర్ణ జీవంగా ఎదగాలనుకుంటున్నారా అన్నది మీ ఎంపిక.
ఈ మానవ శరీరం, భూమి మీద ఉన్న అత్యంత అధునాతనమైన యంత్రం. దీనిని ఎలా వాడాలో తెలిపే సూచనల పుస్తకాన్ని మీరు చదివారా?