Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
హాయిగా ఉన్నప్పుడు, మీరు ప్రశాంతతలోని శక్తిని పొందుతారు.
మీ చుట్టూ ఉండేవారికి మీ వల్ల గొప్ప ప్రయోజనం ఎలా కలుగుతుందో చూడండి- అలా చేస్తే, మీరు సహజంగానే సముచితంగా ప్రవర్తిస్తారు.
మీ బాంధవ్యాలు ఒకరి నుండి సంతోషాన్ని పిండుకునేలా కాకుండా, సంతోషాన్ని పంచుకునేలా ఉన్నప్పుడు, మీకు ఎవరితోనైనా సరే అద్భుతమైన అనుబంధం ఉంటుంది.
మీరు ఉదయం నిద్ర లేవగానే చేయవలసిన మొట్టమొదటి పని చిరునవ్వు చిందించడం. మీరు బ్రతికే ఉన్నారు! మీరు చిరునవ్వు చిందించడానికి ఈ గొప్ప వరం సరిపోదూ.
కర్మ మీకు బంధనం అయినప్పటికీ, మీరు దానిని సరిగ్గా నిర్వహిస్తే, కర్మ మీ విముక్తికి సోపానం కూడా అవుతుంది.
మీరు కలుపుకుపోయే తత్వంతో ఉంటే, జీవితం ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ఉంటే, కేవలం మీ మానసిక నాటకమే జరుగుతుంటుంది.
ఈ వినాయక చవితి నాడు, విఘ్నాలను తొలగించే వినాయకుడు, మీ ఉన్నతికీ ఇంకా ముక్తి మార్గంలో ఉన్న విఘ్నాలను తొలగించాలని కోరుకుంటున్నాను.
మీరు ఎవరు, ఏమిటి అనే దానితో సంబంధం లేకుండా, ప్రతి మనిషిలో ఒకటి ఉంటుంది, అది మీరు ప్రస్తుతం ఉన్నదాని కంటే ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంది.
మీరు కోటి అబద్ధాలు సృష్టించవచ్చు, కానీ ఉన్న సత్యం మాత్రం ఒక్కటే.