మహాశివరాత్రి
ఈశా యోగా కేంద్రం
భారతదేశంలో పరమ పవిత్రంగా జరుపుకునే ఉత్సవాల్లో మహాశివరాత్రి అతి పెద్దది, ప్రముఖమైనది. సంవత్సరంలోకెల్లా వచ్చే అత్యంత చీకటి రాత్రిని – యోగ సంప్రదాయానికి మూలమైన ఆది గురువు లేదా మొదటి గురువైన శివుని అనుగ్రహం పొందే రోజుగా భావిస్తారు. ఈ రాత్రి ఏర్పడే గ్రహ స్థితులు కారణం చేత, మానవ వ్యవస్థలో సహజంగానే శక్తి ఊర్ధ్వముఖంగా కదులుతుంది. ఈ నాటి రాత్రి వెన్నుముక నిటారుగా ఉంచి, జాగరణ చేయడం మన భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకి ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ సంవత్సరం మహాశివరాత్రిలో పాల్గొనటానికి టికెట్ తప్పనిసరి, అలాగే ఈ కార్యక్రమం ఎక్కువగా ధ్యానానికి సంబధించినది. ముంచెత్తే ఆధ్యాత్మిక అనుభవం కోసం సీటు బుక్ చేసుకోండి.
2022
వేడుకల విశేషాలు
మహాశివరాత్రి అనేది, సద్గురుచే గాఢమైన ధ్యానాలు ఇంకా ప్రఖ్యాత కళాకారులచే అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో రాత్రంతా సాగే ఉత్సవం. ఈ సంవత్సరం ఈ వేడుకల్లో ఆన్లైన్లో పాల్గొనండి.
గాఢమైన గైడెడ్ ధ్యానాలు
(సద్గురుతో)
రాత్రంతా ప్రత్యేక సంగీత ప్రదర్శనలు
(ప్రముఖ కళాకారులతో)
మార్షల్ ఆర్ట్స్ ఇంకా సాంప్రదాయ ప్రదర్శనలు
(ఈశా సంస్కృతి విద్యార్థులు)
ఆదియోగి దివ్య దర్శనం
(యోగా మూలాలను వర్ణించే అద్భుతమైన లైట్ & సౌండ్ షో)
మాహాశివరాత్రి
అందించే లాభాలుప్రకృతి అందించే శక్తిని మన శ్రేయస్సు కోసం ఉపయోగించుకునే అరుదైన అవకాశాన్ని మహాశివరాత్రి మనకు ప్రసాదిస్తోంది. ఈశా యోగా కేంద్రంలో రాత్రంతా ఉత్సాహభరితంగా జరిగే వేడుకలు శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడానికి అనువైన వాతావరణానికి తెరతీస్తాయి.
పాల్గొనండి
వివిధ మార్గాల్లోస్వయంగా పాల్గొనండి
ఈశా యోగా కేంద్రంలోప్రత్యక్ష ప్రసారం
isha.sadhguru.org వెబ్ సైట్ ద్వారాటీవీ
ప్రముఖ టీవీ ఛానల్ లలో వీక్షించండిమహాశివరాత్రి రోజున సద్గురుచే ప్రత్యేకంగా శక్తివంతం చేయబడిన రుద్రాక్షలను అందరికీ ఉచితంగా అందిస్తున్నాము. శివుని అనుగ్రహాన్ని మీ ఇంటికి తీసుకురండి.