మీరు గనుక టీవీ లేదా నెట్‍లో వచ్చే ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మహాశివరాత్రి వేడుకలలో పాల్గొంటున్నట్లైతే, అక్కడ ఇచ్చే ధ్యాన సూచనలను పాటించవచ్చు.
నడిరేయి ధ్యానం
అర్ధరాత్రి సమయంలో, అక్కడ గుమిగూడిన జనసమూహాన్నంతటినీ ఎంతో శక్తివంతమైన ధ్యానంలోకి సద్గురు ప్రవేశపెడతారు. ఈ కార్యక్రమంలో అందరూ అత్యంత ఎక్కువగా ఎదురుచూసేది దీని కోసమే. నడిరేయి ధ్యానం, మీ టైమ్ జోన్‍లో వచ్చే అర్ధరాత్రి ప్రకారం చేయాలని సద్గురు చెప్పారు (అర్ధరాత్రికి 20 నిమిషాల ముందు ప్రారంభించండి)
వెబ్‍లో వచ్చే ప్రత్యక్ష ప్రసారాన్ని ఇక్కడ చూడొచ్చు.
శక్తివంతమైన మంత్రం ఉచ్చారణ
ఒక చిన్న మంత్రం కూడా జ్ఞానోదయం పొందిన గురువు సన్నిధిలో, మనల్ని పరివర్తనం చెందించే ఒక శక్తివంతమైన ప్రక్రియగా మారుతుంది. ఈ మహాశివరాత్రిన, సద్గురు చేయించే ఈ గైడెడ్ ధ్యానంలో పాల్గొనేందుకు వెబ్‍లో వచ్చే ప్రత్యక్ష ప్రసారంలో మాతో పాల్గొనండి.