ఆదియోగి శివుడి పాటలను డౌన్లోడ్ చేసుకోండి
ఆదియోగి శివుని ఉద్దేశించి సద్గురు రచించిన ఒక పద్యం ఈ పాటకు ఆధారం. శివుని నమ్మొద్దు అన్నది దీని శబ్దార్థం.
సద్గురు శ్రీ బ్రహ్మ ఒక శతాబ్దం క్రితం ఈ నేలపై నడిచిన గొప్ప యోగి. ఆదిగురువుపై ఆయనకున్న భక్తి ప్రవాహాన్ని, పూర్తి దాసోహ భావాన్ని ఈ పాటలో వినిపించారు.
ఈ పాట మీకు మహాశివరాత్రిని తలపిస్తుంది. వింటూ ఈ గీతంతో మీరూ అడుగులువేసి తేలికగా నాట్యం చేయవచ్చు.
మూడు శక్తులు, మూడు లక్షణాలు, ముగ్గురు దైవాలు. ఈ మూడూ బయట నుండి చూస్తే వేరు వేరుగా ఉన్నా, లోతుకు వెళితే ఒక్కటిగా మీరు తెలుసుకుంటారు. ఈ మూడింటికి మధ్య ఉన్న దూరాన్ని పూడిస్తే మీకు మహదేవుడు అనుభవంలోకి వస్తాడు.
గురు పాదుకలను కీర్తించే ఈ స్తోత్రం ఎంతో శక్తివంతమైనది. ఇందులో గురు పాదుకలను అంతులేని జీవన సముద్రాన్ని దాటడానికి సహాయపడే పడవగా పోల్చారు. ఈ స్తోత్రం గురు అనుగ్రహాన్ని స్వీకరించగల గ్రహణ శక్తిని పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది.
ఆదియోగి వాద్యం ఢమరు, ఆయనే మొదటి గురువు లేక ఆది గురువు. గురు పౌర్ణిమ రోజున ఆది గురువు యోగ శాస్త్రాన్ని ఏడుగురు శిష్యులకి అందించడానికి నిశ్చయించుకున్నారు. ఆ ఏడుగురే ఈ రోజు మనము కీర్తించే సప్తఋషులు.
అదిశంకరుడి రచనకు సౌండ్స్ ఆఫ్ ఈశా ఇచ్చిన సంగీతం. సౌండ్స్ ఆఫ్ ఈశా సంగీతపరచిన కొన్ని మంత్రాలలో ఇది ఒకటి. గురు పౌర్ణిమ సత్సంగం కార్యక్రమములో మొదటిసారిగా దీన్ని అందరికీ వినిపించారు.
శివుడి భయానకమైన, అసాధారణమైన రూపానికి విరుద్ధంగా, సున్నితమైన రూపానికి సంబంధించినది ఈ మంత్రం. శంభో సున్నితమైన, అందమైన శివుని రూపానికి ప్రతీక. మీ పరిమితులని దాటడానికి మిమ్మల్ని అనుగ్రహ పాత్రులని చేయడానికి ఇది సహకరిస్తుంది.
దక్షిణాయన సందర్భంగా సౌండ్స్ అఫ్ ఈశా రచించి, సంగీతం కూర్చింది. ఆదియోగి ఆదిగురువుగా మారి, మొట్ట మొదటగా తన ఏడుగురు శిష్యులకి యోగ శాస్త్రం అందించిన చిరస్మరణీయ సమయం దక్షిణాయనం.