ప్రదర్శనలు
ప్రఖ్యాత కళాకారులు తమ సంగీతం, నృత్యం ఇంకా సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ మహాశివరాత్రిన, రాత్రంతా మిమ్మల్ని మెలకువగా ఇంకా ఉత్సాహంగా ఉంచుతారు, తద్వారా మీరు ఈ శుభకరమైన రాత్రిన ఈ అవకాశాల నుండి లబ్ది పొందవచ్చు.
ఈశా సంస్కృతి పరిచయం
పిల్లల సమగ్ర అభివృద్ధికి అంకితమైన ఒక విద్యావ్యవస్థ- ఈశా సంస్కృతి. అంకితభావం, క్రమశిక్షణ, శ్రద్ధతో కూడిన వాతావరణంలో, ప్రత్యేకమైన యోగాభ్యాసాలు, సంస్కృతం, భారతీయ శాస్త్రీయ కళలైన భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం ఇంకా కలరిపయట్టు వంటి మల్లయుద్ధ కళల ద్వారా- విద్యార్థులను శారీరకంగా, మానసికంగా ఇంకా ఆధ్యాత్మికంగా వారి పూర్తి సామర్థ్యాన్ని సాధించేలా చేస్తుంది.
సౌండ్స్ ఆఫ్ ఈశా
‘సౌండ్స్ ఆఫ్ ఈశా’ అనేది సద్గురు కృపకు సంగీత పరమైన అభివ్యక్తీకరణను ఇవ్వాలనే బలమైన కాంక్షతో స్ఫూర్తిని పొందిన ఒక శిక్షణ లేని సంగీతకారుల బృందం. ‘సౌండ్స్ ఆఫ్ ఈశా’, వైవిధ్యభరితమైన నేపథ్యాలు కలగిన వ్యక్తుల సమాహారంగా పరిపుష్టమైంది. ఈ బృందంలోని సభ్యులు ఈశా ఫౌండేషన్ లో పూర్తి స్థాయి వాలంటీర్లు. అలాగే స్ఫూర్తిదాయకమైన వారి గీతాలు, సంస్థ చేసే కృషి తాలూకు భిన్నమైన పార్శ్వాన్ని ఆవిష్కరించే వారి అభిరుచిని తెలియజేస్తాయి. ఈ గీతాలలోని సంగీతం మన మనసును సేద తీర్చడంతో పాటు మనల్ని సమ్మోహితుల్ని చేస్తుంది. మనిషి మూలంలోని అంతర్లీనమైన నిశ్శబ్దాన్ని వికసింపజేయగల సామర్థ్యంలో ఈ గీతాల యొక్క నిజమైన శక్తి ఉంది.
సందీప్ నారాయణ్
సందీప్ నారాయణ్ ఒక కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయకుడు. సాంప్రదాయ కళారూపానికి సమకాలీనతను జోడించడంలో ఆయన పేరు పొందారు. 2019లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం, 2017 లో మద్రాసు సంగీత నాటక అకాడమీ అందించిన “బెస్ట్ రాగం-తానం-పల్లవి” అవార్డులతో సహా పలు అవార్డులను ఆయన అందుకున్నారు.