యక్ష – సంగీత నృత్యాల సమ్మేళనం

2021 మార్చి 8-10 వరకు (మహాశివరాత్రికి ముందు) ఈశా యోగా కేంద్రంలో

వేల సంవత్సరాలుగా వికసించిన భారత దేశపు వివిధ కళా రూపాలు ఈ దేశపు విభిన్న సంస్కృతిని ప్రతిబింబించటమే కాకుండా, ఆధ్యాత్మిక స్ఫూర్తికి మూలంగా కూడా నిలిచాయి. తరతరాలుగా ఈ దేశాన్నిసుసంపన్నం చేసిన ఈ కళలు, మన జీవితాలలో నుండి ఎంతో వేగంగా కనుమరుగై పోతున్నాయి. మన దేశపు వివిధ కళారూపాల ప్రత్యేకతను, స్వచ్ఛతను, వైవిధ్యాన్ని కాపాడి, ప్రోత్సహించే ప్రయత్నంలో ఈశా ఫౌండేషన్ ప్రతియేటా 3 రోజుల భారత శాస్త్రీయ సంగీత, నృత్య ఉత్సవం ‘యక్ష’ను ప్రముఖ కళాకారులచే నిర్వహిస్తుంది. ‘యక్ష’ అన్న పేరుకు భారత పురాణాలలోని దివ్య యక్షులే స్ఫూర్తి. ఉద్దండ కళాకారుల ప్రదర్శనకు, కళా పిపాసులు ఆ పురాతన ప్రదర్శన కళను చూసి ప్రశంసించటానికి ‘యక్ష’ కార్యక్రమం ఒక ఉమ్మడి వేదికను అందిస్తుంది.

ప్రత్యక్ష వెబ్‌స్ట్రీమ్‌లో చేరండి

భారతదేశపు ఈ మహత్తరమైన ప్రాచీన సంస్కృతి వారసత్వంలో మీరు పూర్తిగా లీనమై, ఒక గాఢమైన అధ్బుత అనుభవం చెందటానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

detail-seperator-icon

ప్రదర్శనలు

యక్ష అనేది ఈశా ఫౌండేషన్ చేత నిర్వహించబడుతున్న ఒక అద్భుతమైన సంగీత, నృత్య కళల మనో రంజక వేడుక. ఫిబ్రవరి లేదా మార్చ్ మాసాల్లో గొప్ప కళాకారులు ప్రదర్శనలతో నిర్వహించబడే యక్షలో వేలాది ప్రేక్షకులు పాల్గొంటారు.

 

మార్చ్ 1

శ్రీమతి కలాపిని కొంకలి

హిందుస్తానీ గాత్ర సంగీతం

స్వచ్ఛమైన, శ్రావ్యమైన, సమృద్ధమైన గాత్రంతో, కలాపిని కొంకలి యువతరంలో అత్యుత్తమమైన సాంప్రదాయ హిందూస్థానీ గాయనిగా సర్వత్రా గుర్తింపబడ్డారు. సుప్రసిద్ధ హిందూస్థానీ గాయకులు, పండిట్ కుమార గంధర్వ కుమార్తెగా, శిష్యురాలిగా, కలాపిని తండ్రి సృజనాత్మకత, కళా పరిజ్ఞానం వారసత్వంగా సంతరించుకున్నారు. వారసత్వంగా వచ్చిన కళా పరిజ్ఞానాన్ని తన అవగాహనతో పటిష్టం చేసుకుంటూ, తనదైన కల్పనతో గత దశాబ్ద కాలంలో సున్నితత్వం, ప్రగాఢత గల్గిన కళాకారిణిగా పరిణితి చెందారు. ఆవిడ ప్రదర్శనలు సృజనాత్మకతతోనూ, వివిధ సంగీత బాణీలలో ఆమెకున్న నైపుణ్యంతోనూ, తొణికిసలాడతాయి.

 

మార్చ్ 2

శ్రీమతి రంజని & శ్రీమతి గాయత్రి

కర్ణాటక గాత్రం

ఉన్నత శ్రేణి రసజ్ఞులకేగాని, సామాన్య శ్రోతలకు అందుబాటులోలేని పరిథిలో కూడా ఈ రంజని, గాయత్రి సోదరీమణులు ప్రేక్షకులను రంజింపజేసే మార్గాన్ని, వారిని సంతృప్తి పరచే విధానాన్ని కనుగొన్నారు. కర్ణాటక గాత్ర విద్వాంసులలో ఉన్నత శ్రేణికి చెందిన వీరు సాంప్రదాయాలను పరిరక్షిస్తూనే, మరిన్ని కొత్తపోకడలను సృష్టిస్తున్నారు. వారు వాషింగ్టన్ లోని కెన్నడీ సెంటర్, ఇటలీలోని రవెన్న మ్యూజిక్ ఫెస్టివల్, వార్సా(పోలెండ్) లోని క్రాస్ కల్చర్ ఫెస్టివల్, ఢాకాలోని బెంగాల్ మ్యూజిక్ ఫెస్టివల్, సింగపూర్ లోని ఎస్ప్లాండ్ ధియోటర్ వంటి ఎంతో విశిష్టమైన వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చారు.

 

మార్చ్ ౩

యక్ష ఉత్సవంలో చివరి రోజంతా వివిధ భారతీయ కళా ప్రదర్శనలు ఉంటాయి.

లీల శాంసన్ & స్పంద డాన్స్ కంపెనీ
నది

లీల సామ్సన్ భరత నాట్యంలో గొప్ప నర్తకి, వ్యాఖ్యాత కూడా. ఆమె సోలో ప్రదర్శనలను ఇవ్వడమే కాకుండా, స్పంద డాన్స్ కంపెనీతో భారతదేశంలోనూ ఇంకా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇస్తుంటారు. ఆమె 1982 లో ‘సంస్కృతి’ పురస్కారాన్ని, 1990 లో ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని, 1997 లో ‘నృత్య చూడామణి’ పురస్కారాన్ని, 2000 లో ‘సంగీత నాటక అకాడెమీ’ పురస్కారాన్ని ఇంకా 2015 లో చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ ద్వారా ‘నాట్య కళా ఆచార్య’ పురస్కారాన్ని అందుకున్నారు

ఈశా సంస్కృతి వారి ప్రదర్శన
ఫకీర ఖేత ఖాన్ ఇంకా వారి బృందంచే రాజస్థాన్ జానపద నృత్య ప్రదర్శన

సారీస్
ట్రెడిషన్ అండ్ బియాండ్” పుస్తక రచయిత ఆర్ టి ఎ కపూర్ చిస్తిచే నిర్వహింపబడే, ‘చీరను 108 రకాలుగా ధరించడం’ అనే వర్క్ షాప్ లో పాల్గొనండి.

detail-seperator-icon

యక్ష 2021 లో పాల్గొనండి

భారతదేశంలోని ఈశా యోగా కేంద్రం వద్ద
6:30 pm -8:30 pm (6.20 pm కల్లా ఆశీనులు కండి)
మరిన్ని వివరాలు కోసం సంప్రదించండి:
Ph: 83000 83111 or ఈ-మెయిల్: info@mahashivarathri.org