logo
logo

యక్ష వేడుక 2023
ఫిబ్రవరి 15, 16 & 17

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ కళాకారుల శాస్త్రీయ సంగీతం మరియు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో జరిగే ఉల్లాసభరితమైన వేడుక

యక్ష గురించి

కొన్ని వేల సంవత్సరాలుగా పరిణామం చెందిన, భారతదేశంలోని పలురకాల కళారూపాలు, ఈ గడ్డపైనున్న విభిన్న సంస్కృతులకి ప్రతిబింబం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక స్పూర్తికి మూల కారణం కూడాను.

అవి ఎన్నో తరాలపాటు ఈ దేశాన్ని సుసంపన్నం చేశాయి, కానీ నేడు అవి మన జీవితాల్లో నుంచి కనుమరుగై పోతున్నాయి. మన దేశ సాంప్రదాయ కళల ప్రత్యేకతను, స్వచ్ఛతను ఇంకా వైవిధ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో, ఈశా ఫౌండషన్ ప్రతి ఏడాది యక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది సంస్కృతి, సంగీతం ఇంకా నృత్య కళలకు సంబంధించి ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలతో సాగే మూడు రోజుల ఉత్సవం.

భారతీయ పురాణాలలోని దివ్యలోక వాసుల పేరు మీదుగా యక్ష అని పేరు పెట్టడమైనది. యక్ష అనేది సుప్రసిద్ధ కళాకారులు ప్రదర్శించేందుకు, అలాగే వారిచే ప్రదర్శింపబడే ఈ ప్రాచీన కళలను, రసజ్ఞులు చూసి మెచ్చుకునేందుకు ఒక వేదికగా నిలుస్తుంది.

2023లో ప్రదర్శనలు ఇవ్వబోయే ఆర్టిస్టులు

మొదటి రోజు - Feb 15

జయతీర్థ మేవుంది

హిందుస్తానీ శాస్త్రీయ గాయకులు

ఫిబ్రవరి 15న, కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో మూడు రోజుల పాటు సాంప్రదాయపరమైన నృత్య సంగీతాలతో జరిగే యక్షా వేడుకలో భాగంగా హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడైన జయతీర్థ మేవుంది ఆలపిస్తారు.

రెండవ రోజు - Feb 16

శశాంక్ సుబ్రహ్మణ్యం

కర్నాటిక్ ఫ్లూట్ కళాకారులు

ఈశా ఫౌండేషన్ లో ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు సాంప్రదాయపరమైన నృత్య సంగీతాలతో జరిగే యక్షా వేడుకలో భాగంగా, ఫిబ్రవరి 16న కర్నాటిక్ ఫ్లూట్ కళాకారులైన శశాంక్ సుబ్రహ్మణ్యం గారి కచేరి ఆలకించండి.

Live Today @ 7 pm

మూడవ రోజు - Feb 17

మాధవి ముద్గల్ డాన్స్ గ్రూప్

ఒడిస్సీ

ఈశా ఫౌండేషన్లో ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు సాంప్రదాయపరమైన నృత్య సంగీతాలతో జరిగే యక్షా వేడుకలో భాగంగా, చివరి రోజున మాధవి ముద్గల్ డాన్స్ గ్రూప్ ప్రదర్శించే ఒడిస్సీ నృత్య ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.

గతంలో ఆకట్టుకున్న ప్రదర్శనలు

Partners

Elite Partner

Prime Partner

Co-Partners

Support Partners