logo
logo

మహాశివరాత్రి అందించే లాభాలు

ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి ఇంకా ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి, కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ప్రాముఖ్యమైనది.

పరిణామ ప్రక్రియలో జంతువుకు జరిగిన మార్పులలో అతిపెద్ద మార్పు ఏమిటంటే సమాంతరంగా ఉన్న వెన్నుముక నిటారుగా రూపంతరం చెందడమేనని జీవశాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిణామం తరువాతే మేధ వికసించింది. కాబట్టి, మహాశివరాత్రిన సహజంగానే ఉప్పొంగే శక్తిని, ఇంకా రాత్రంతా జరుపుకునే వేడుకలో సరైన మంత్రాలు ,ధ్యానాలతో మనం దైవానికి మరో అడుగు దగ్గర కావచ్చు.

జీవితంలో ఎటువంటి సాధన లేని వారికి కూడా ఈరోజున శక్తి ఉప్పొంగుతుంది. ప్రత్యేకించి, ఏదైనా యోగ సాధనలో ఉన్నవారు , వారి శరీరాన్ని నిటారుగా ఉంచుకోవటం ,అంటే ఈ రాత్రి నిద్రించకుండా ఉండడం ఎంతో అవసరం.

ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి ఇంకా ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి, కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ప్రాముఖ్యమైనది. కుటుంబ పరిస్థితులలో ఉండేవారు, మహాశివరాత్రిని శివుని పెళ్లిరోజుగా చూస్తారు. విజయ కాంక్ష ఉన్నవారు, ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు, యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. “శివ” అనే పదానికి అర్థం ఏమిటంటే “ఏదైతే లేదో అది”. మీరే ముఖ్యం అన్న స్థితిలో కాకుండా, శివుణ్ణి మీలోకి ఆహ్వానించే స్థితిలో ఉంటే, మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో ఇంకా పూర్తి స్పష్టతతో చూసే అవకాశం ఉంటుంది.

    Share

Related Tags

ఆదియోగి

Get latest blogs on Shiva

Related Content

Shiva Panchakshara Stotram Telugu - శివపంచాక్షర స్తోత్రం