logo
logo
adiyogi-more-than-a-man

ఆదియోగి – మొదటి యోగి, ఒక మనిషికన్నా ఎంతో ఉన్నతుడు

ఆదియోగి – మొదటి యోగి, ఒక మనిషికన్నా ఎంతో ఉన్నతుడుయోగ శాస్త్రంలో శివుని ఒక దేవునిగా చూడరు. ఆయనని ఆదియోగి, ఆది గురువుగా చూస్తారు. మానవాళికి ఆయన చేసిన సహాయం గురించి సద్గురు మాట్లాడతారు. ప్రపంచమంతా ఆదియోగి ప్రభావాన్ని గుర్తించేలా చేయ్యాల్సిన అవసరం ఉందని ఆయన మాట్లాడతారు.

శ్న:  నమస్కారం సద్గురూ, మీరు 21 అడుగుల ఆదియోగి విగ్రహాలు తయారు చేస్తున్నారని వాటిని ప్రపంచం నలుమూలలా స్థాపించాలని చూస్తున్నారని విన్నాను. దాని విశిష్టత ఏమిటి? నేను యోగ సెంటర్ లో అటువంటి విగ్రహం ఒకటి ఆదియోగి ఆలయం ముందు చూశాను.

సద్గురు: నమస్కారం సద్గురూ, మీరు 21 అడుగుల ఆదియోగి విగ్రహాలు తయారు చేస్తున్నారని వాటిని ప్రపంచం నలుమూలలా స్థాపించాలని చూస్తున్నారని విన్నాను. దాని విశిష్టత ఏమిటి? నేను యోగ సెంటర్ లో అటువంటి విగ్రహం ఒకటి ఆదియోగి ఆలయం ముందు చూశాను.
సద్గురు: ఆ విగ్రహాన్ని ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ప్రతిష్టించడం గురించి నేను ఇప్పటికే మాట్లాడాను. సప్తర్షులు ప్రపంచమంతా యోగాను ప్రచారం చేయడం గురించీ ఇప్పటికే మాట్లాడాను. మేము 8 000 నుంచి 12000 సంవత్సరాల క్రితం నాటి సమాచారం గురించి అధ్యయనం చేశాము. అప్పటికే దక్షిణ అమెరికాలో, టర్కీ, ఉత్తర ఆఫ్రికాలో లింగారాధన కూడా చేసేవారు. ఇక నాగులను పూజించడం ప్రపంచం అంతా ఉన్నది. దానిమీద పురాతత్వ శాస్త్రానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. గత రెండు వేల ఏళ్ల నుంచే, ప్రపంచంలో చాలా భాగాలలో ఇదంతా వినాశనం చేయబడింది. కానీ మొదటిలో సప్తర్షుల ప్రభావం ప్రపంచమంతా వ్యాపించింది. ఆదియోగి బోధించిన యోగ శాస్త్రం వల్ల లబ్ధి పొందని సంస్కృతంటు ఏదీ లేదు. యోగా అన్నిచోట్లా వ్యాప్తి చెందింది - ఒక మతంగానో, ఒక నమ్మకంగానో, ఒక సిద్ధాంతంగానో కాదు, పద్దతులుగా. కాల క్రమేణా, కొన్ని వక్రీకరణలు జరిగాయి. అయినా తెలిసో, తెలియకో ప్రపంచమంతా కోట్లాది ప్రజలు ఏదో విధమైన యోగ సాధన చేస్తూనే ఉన్నారు. మానవ చరిత్రలో, ప్రజల మీద ఏ రకమైన నిర్బంధనలూ లేకుండా ప్రపంచంలో నిలిచిపోయిన ఒకే ఒక్క విషయం ‘యోగా’నే.
ఆదియోగి అందించిన ఈ శాస్త్రం నుంచి లబ్ధిపొందని సంస్కృతి అంటూ లేదు. మానవ చైతన్యానికి అంతటి గొప్ప ఉపకారం చేసిన సంస్కృతికి, ఆ వ్యక్తికి గుర్తింపు లేకుండా చేసే ప్రయత్నాలు జరిగాయి.

గొంతు మీద కత్తి పెట్టి, ‘యోగా చెయ్యి, లేకపోతే చంపేస్తాను’ అని ప్రపంచంలో ఎవరూ అనలేదు. దానిని ప్రచారం చేయడానికి ఏ విధమైన బలమూ ప్రయోగింప బడలేదు. అయినా యోగా, 15 నుంచి 20 వేల సంవత్సరాలు సజీవంగానే ఉన్నది. అంతేకాదు ఈ శాస్త్రాన్ని ప్రచారం చేయడానికి ఏ ఒక్క నిర్ణయాధికారీ లేడు. కేవలం ఈ ప్రక్రియ ప్రభావవంతమైనది కాబట్టి నిలిచిపోయింది. ఈ ప్రక్రియకు ఒడుదొడుకులు వచ్చాయి, కానీ అది తట్టుకుంది. మళ్లీ ఇప్పుడు అది ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతున్నది. అయినా ఇప్పుడు కూడా ఈ యోగా ఎక్కడ మొదలైంది? అన్న మాట మీద ప్రశ్నించే వారు కొందరు ఉన్నారు. కొందరైతే ఈనాడు బోధింపబడే యోగా యూరోప్ లో చేసే శారీరక కసరత్తు నుంచి తయారు చేయబడిందనే వారు కూడా ఉన్నారు. . మానవ చైతన్యానికి అంతటి గొప్ప ఉపకారం చేసిన సంస్కృతికి, ఆ వ్యక్తికి గుర్తింపు లేకుండా చేసే ప్రయత్నాలు జరిగాయి.

నేను చనిపోక ముందే, ఆదియోగికి తగిన గుర్తింపు వచ్చేలా చేస్తాను. 21 అడుగుల విగ్రహాలు ఆ కృషిలో భాగమే. మేము ఆదియోగి రూపురేఖల చిత్రీకరణలో రెండున్నర సంవత్సరాల కృషి చేశాము. ఈ చిత్రాన్ని మేము ఒక విగ్రహంగా తయారు చేశాము. ఈ విగ్రహాలు 111 అడుగుల వెడల్పు, 111 అడుగుల ఎత్తు ఉంటాయి. వాటితోపాటు రెండున్నర అడుగుల ఎత్తైన లింగం ప్రతిష్ట జరుగుతుంది. ఇవి శక్తివంతమైన స్థలాలు. మొట్టమొదటిది అమెరికా లోని టెన్నిసీ రాష్ట్రంలో స్థాపించ బడింది. శానోజే దగ్గర, సియాటిల్ లో ఒకటీ, టొరెంటోలో ఒకటీ, ప్రతిష్టీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము అటువంటివి అమెరికా అంతటా, రాష్ట్రానికి ఒక్కటి చొప్పున 50 విగ్రహాలు స్థాపించాలనుకుంటున్నాము.


భారతదేశంలో ఆదియోగి విగ్రహాలుఎవరైనా చొరవ తీసుకుంటే, భారతదేశంలో కూడా ఇటువంటి విగ్రహ ప్రతిష్టాపనలు జరుగుతాయి. 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని దేశం నలుమూలల ప్రతిష్టించడానికి కొందరు ముందుకు వస్తున్నారు. ఆ దిశగా కృషి చేస్తున్నారు. అరుణాచలం రాష్ట్ర ప్రభుత్వం, తమ రాష్ట్రంలో ఈ విగ్రహాన్ని స్థాపించాలని కోరింది. దేశంలో ఇక్కడే సూర్య కాంతులు ముందు చేరతాయి. సూర్యుని కాంతి ఇండియాలో ఆయన ముఖం మీద ముందుగా పడాలని నా ఆకాంక్ష. జాతి, మత, వర్ణ, కుల వివక్షత లేకుండా అందరూ ఆయన మానవ జాతికి చేసిన దోహదాన్ని గుర్తించాలి. ఒక దేవునిగా కాదు, అన్ని పరిమితులకు అతీతంగా నిలిచిన ఒక మానవునిగా గుర్తించాలి, ఆయన మానవుడు సాధించగలవన్నీ సాధించాడు, మానవుడు సాధించలేనివి కూడా సాధించాడు. మానవతకు మొట్టమొదట ఈ అవకాశాన్ని అందించింది ఆయనే. ఆయన దాని గురించి మాట్లాడటమే కాదు, అది సాధించడానికి కావలసిన విధానాలను కూడా బోధించాడు. ఆయన ముందుగానీ, ఆయన తర్వాత గానీ మానవ చైతన్యానికి అంతకన్నా గొప్ప ఉపకారం ఎవరూ చేయలేదు.

ఈశా యోగ కేంద్రం వద్ద స్థాపించిన 112 అడుగుల ఆదియోగి విగ్రహం తర్వాత, మేము ఇంకో మూడు విగ్రహాలు ఉత్తరాఖంఢం లోని హరిద్వార్ వద్ద ఒకటి, ఒకటి కన్యాకుమారి వద్ద, మరొకటి రాజస్థాన్ లో సరిహద్దుల దగ్గర స్థాపించాలని అనుకుంటున్నాము. అంటే దేశం నలుమూలల ఎంతో పెద్ద ఆదియోగి విగ్రహాలు రాబోతున్నాయి. వాటిని ఎవరూ గుర్తించకుండా ఉండలేరు, మేము ఆదియోగి గురించి పుస్తకం కూడా ప్రచురించబోతున్నాము. ఆయనను ఒక మనిషిగానే చూడడం ఎంతో ముఖ్యం. అప్పుడే ఆ విధమైన కృషి చేసే అవకాశం ఉంటుంది.

కృష్ణుడు గాని, రాముడు గాని, జీసస్ గాని ఎవరైనా సరే, మీరు వారి వంక ఒక దేవునిలా చూశారంటే, ఇక మీరు వారి లాగే అయ్యే ప్రయత్నం చేయరు. అదే సమస్య. నేను అందరకూ చెప్పే ప్రయత్నం చేస్తున్నది ఏమిటంటే, ఆదియోగి మనిషి కన్నా చాలా ఉన్నతుడు, అయినా ఆయన మనిషే. ప్రతి మానవునకు వారి స్థాయి ఎట్లా ఉన్నా, వారికి ఏమి తెలిసినా, వారికి ఏమీ తెలియకపోయినా, వారు కొంత కృషి చేయటానికి సిద్ధంగా ఉంటే, పరిణామం చెందే అవకాశం అందరి జీవితంలోనూ ఉంది. ఇలాంటి ప్రకటనను పెద్దగా ప్రచారం చేయటానికి, యోగాన్ని స్థాపించిన వానిగా ఆయనను గుర్తించడానికి, మేము నాలుగు పెద్ద ఆది యోగి విగ్రహాలు దేశం నలుమూలల ప్రతిష్టించే ప్రయత్నాలు చేస్తున్నాము, వాటితో పాటు 21 అడుగుల విగ్రహాలు కూడా వీలైనన్ని ప్రతిష్ట చేయాలని చూస్తున్నాము.

యోగ ఒకటే పరిష్కారం
ఇప్పటి నా ఈ స్థితికి కారణం, ఈ శాస్త్రం ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండటం వల్లనే. నా చిన్నప్పుడు వారు నీవు యోగా చేయాలంటే ముందు నువ్వు ‘గురు పూజ చేయాలి’ అన్న నిబంధన పెట్టినట్టయితే, నేను లేచి వెళ్ళి పోయేవాడిని. వారు నాకు ముందు ‘ఒక దీపం వెలిగించి, వంగి నమస్కారం చేయాలి’ అని చెప్పి ఉంటే నేను చేసేవాడిని కాదు. ఎటువంటి నిబంధనలూ ఏమీ లేవు, కేవలం చేయవలసిన దాని గురించి సూచనలు మాత్రమే ఉన్నాయి, అయినా అది పని చేసింది.
ఏ మతానికి చెందని ఆదియోగి అందించిన ఈ శాస్త్రం లేకుండా, నేను ప్రస్తుతమున్న స్థాయి అందుకోగలిగే వాడిని కాదు. ఆదియోగి అన్ని మతాలకూ ముందే ఉన్నాడు. యోగా ఆధునిక ప్రపంచానికి ఎంతో అవసరమైనది, ఎందుకంటే మనకున్న సమస్య అంతా ఏమిటంటే, మనం మన తెలివిలో చిక్కుకు పోయాము. నా చిన్నప్పుడు నా సమస్య కూడా ఏమిటంటే, నేను ఒక దీపం వెలిగించడానికి సిద్ధంగా లేను, అలాగే నమస్కరించడానికి, ఒక దేవాలయంలోకి వెళ్లడానికి సిద్ధంగా లేను. ఎవరైనా ఏదైనా మంత్రం చెబితే నేను అక్కడి నుంచి వెళ్లి పోయేవాడిని, ఇదంతా తెలివితేటలతో వచ్చిన సమస్యలే.

ప్రపంచమంతా ‘ఆదియోగి’ స్మరణ చేయాలని నా ఆకాంక్ష. ఆదియోగి విగ్రహ సమక్షంలోకి వచ్చిన వారెవరైనా, ఆయన అందించిన 112 విధానాలలో ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు, వారు కేవలం మూడు నిమిషాల యోగాతో ప్రారంభించవచ్చు

తెలివికి ఎంత ఎక్కువ ఆదరణ ఇవ్వబడుతుందో, అక్కడ ప్రజలు అన్ని ఎక్కువ సమస్యలకు లోనవుతారు. అటువంటి సమస్య వచ్చినప్పుడు, ఏకైక శాస్త్రీయ విధానం యోగానే. మిగతావన్నీ ప్రజలను విడదీస్తాయి. అలాంటి కాలం రావడానికి మానవాళి ఎంతో దూరంలో లేదు. ఆ సమయం రాకముందే, అన్ని చోట్లా, అందరూ ఆదియోగి గురించి వినాలని, చూడాలని నాకు ఉంది. అందరికీ యొగశాస్త్రం అందుబాటులో ఉందని తెలుసుకోవాలి. ఆయన మానవుడికి తమ సర్వోన్నత స్థాయి చేరటానికి 112 మార్గాలను ఇచ్చారు, అందుకే విగ్రహం 112 అడుగుల ఎత్తుది. మీకు దీనిని సరళం చేసి, మీరు చేయగలిగిన 112 మార్గాలు మీకు అందుబాటులో ఉంచాలని అనుకుంటున్నాము. వీటిలో మీరు కేవలం ఒకటి చేస్తే చాలు. ఇది మీ జీవితాన్ని చాలా సులువుగా పరిణామం చేస్తుంది.

ఆదియోగి ఉన్నచోటుకి వచ్చిన వారు ఎవరైనా, ఈ 112లో, ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. దానిని మూడు నిమిషాల సాధనతో మొదలెట్టవచ్చు. ఒకవేళ అది వారికి పనిచేస్తే, క్రమంగా ఆ సాధన 6, 12 లేక 24 నిమిషాలకు పెంచవచ్చు. వచ్చే దశాబ్దం లోపల, జాతి, వర్ణ, కుల, మత, భాష వివక్షత లేకుండా, మేము అందరి జీవితాలలో యోగ సాధన తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము.

మా ఈ ప్రయత్నం లో సహకరించాలకున్నవారు మాతో రండి, ఎందుకంటే ప్రజల జీవితాల్లో ఆధ్యాత్మిక తీసుకురావడం అనేది, మనం మానవజాతికి చేయగల అతి ముఖ్యమైన ఉపకారం.

    Share

Related Tags

ఆదియోగి

Get latest blogs on Shiva

Related Content

Shiva Panchakshara Stotram Telugu - శివపంచాక్షర స్తోత్రం