logo
logo

ఎందుకని శివునికి బిల్వపత్రం అంటే ఇష్టం?

సుప్రసిద్ధమైన బిల్వాష్టకం, బిల్వపత్రాల గొప్పదనాన్ని విస్తారంగా పోగొడుతుంది. బిల్వపత్రానికి అంతటి...

ఎందుకని శివునికి బిల్వపత్రం అంటే ఇష్టం?


సుప్రసిద్ధమైన బిల్వాష్టకం, బిల్వపత్రాల గొప్పదనాన్ని విస్తారంగా పోగొడుతుంది. బిల్వపత్రానికి అంతటి గౌరవం ఎందుకు? సాధారణంగా, ఈ చెట్టు కొన్ని శతాబ్దాలగా పవిత్రమైనదిగా పరిగణింపబడుతూ వచ్చిందని, బిల్వ పత్రాలు లేనిదే శివునికి అర్పించే అర్పణలు సంపూర్ణం కావని మనకి తెలుసు. ఈ పత్రాలకు అనేక రకాల ఉపమానాలు ఆపాదించబడతాయి: ఈ త్రిపత్రాలు అనేక రకాల త్రిత్వాలను సూచిస్తాయి అంటారు - సృష్టి, స్థితి, ఇంకా లయ; లేదా సాత్వికం, రాజసం ఇంకా తామసం అనే త్రిగుణాలను; లేదా శివుని యొక్క సారాన్ని ప్రతిబింబించే ఆది శబ్దమైన ఓంకారం లోని మూడక్షరాలను సూచిస్తాయంటారు. ఈ మూడు పత్రాలు, మహాదేవుని మూడు కళ్ళను, లేదా అతని ప్రతీకాత్మక ఆయుధం అయిన త్రిశూలాన్ని సూచిస్తాయని కూడా అంటారు.

పురాణ కధల్లో వర్ణణ ఈ మేరకు ఉంటుంది. కానీ జీవం విషయానికి వచ్చినప్పుడు, బిల్వ పత్రాన్ని అంత పవిత్రంగా ఎందుకు చూస్తారో సద్గురు తెలియచేస్తున్నారు.

సద్గురు: ఓ రకమైన ఆకుని మరో దాని కంటే పవిత్రమైనదిగా ఎందుకు చూస్తారు? ఇదొక విధమైన పక్షపాతమా? మొత్తం మీద ప్రతిదీ కూడా మట్టిలో నుండే వస్తుంది. వేపకాయ ఇంకా మామామిడి కాయ, రెండూ కూడా అదే మట్టిలో నుండి వస్తాయి, కానీ వాటి రుచులు వేరుగా ఉంటాయి, ఉంటాయా లేదా? అదే మట్టిని ఓ జీవం ఏ విధంగా పరివర్తన చేస్తుంది అనేది మరొక జీవం దాన్ని ఏ విధంగా పరివర్తన చేస్తుంది అన్న దానికి భిన్నంగా ఉంటుంది. ఓ పురుగుకీ, కీటకానికి మధ్య తేడా ఏంటి, అలాగే మీకూ ఇంకా మరో మనిషికీ మధ్య తేడా ఏంటి? పదార్థం ఒక్కటే, దాని నుంచి మనం ఏం తయారు చేస్తామన్నదే ఇక్కడ తేడా.

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్లు సాధ్యమైన అన్ని విధాల సహకారాన్నీ తీసుకోవాలని చూస్తుంటారు, ఎందుకంటే అది తెలీని ప్రదేశం. భారతీయ సంస్కృతిలో, గమనించడం ద్వారా ఇంకా ధ్యానం ద్వారా, మనకు సహకరించగల ప్రతీ దాన్నీ గుర్తించడం జరిగింది. వాళ్లు ఆఖరికి పువ్వులను పళ్ళను ఇంకా ఆకులను కూడా వదిలిపెట్టలేదు. మరి ప్రత్యేకించి బిల్వ పత్రాన్ని పవిత్రమైనదిగా ఎందుకు చూస్తారు? ఎప్పుడూ కూడా, బిల్వపత్రం శివునికి ప్రియమైనదని చెబుతారు. దానర్థం శివునికి బిల్వ పత్రం అంటే ప్రీతి అని కాదు. ఆయనకు దాని అవసరం ఏముంది? మనమది శివునికి ప్రియమైనదన్నప్పుడు, దానర్థం ఏంటంటే ఓ విధంగా మనం దేన్నయితే శివ అంటామో, ఈ బిల్వపత్రం యొక్క ప్రకంపనలు దానికి దగ్గరగా ఉన్నాయి అని అర్ధం.

ఇలాంటి ఎన్నో పదార్థాలు మనం గుర్తించాం, అలాగే వాటిని మాత్రమే సమర్పిస్తాం, ఎందుకంటే ఆ(దైవం) స్పర్శ లోనికి వచ్చేందుకు అవి మనకు మాధ్యమాలవుతాయి. మీరు శివునికి బిల్వ పత్రాలు సమర్పించినప్పుడు, దాన్ని ఆయన వద్ద ఉంచేసి వెళ్ళరు. అర్పించిన తర్వాత మీరు దాన్ని మీతో పాటు తీసుకువెళ్లాలి. దాన్ని లింగంపై ఉంచి, ఆ తర్వాత మీరు తీసుకుంటే, ఆ ప్రకంపనలను చాలా కాలం పాటు పట్టి ఉంచగల సామర్థ్యం దానికి ఉంటుంది. అది మీతో ఉంటుంది. మీరిది ప్రయత్నించి చూడొచ్చు: ఓ బిల్వపత్రాన్ని సమర్పించి, దాన్ని మీ షర్టు జేబులో పెట్టుకుని ఉంచండి. అది ఆరోగ్య పరంగా, శ్రేయస్సు పరంగా, మానసిక స్థితి పరంగా, అన్ని విధాలుగా ఎంతో మార్పు తెస్తుంది.

ఇలా పవిత్రమైన సాధనాలుగా గుర్తింపబడి, ప్రజలచే ఉపయోగించబడుతున్న పదార్దాలెన్నో ఉన్నాయి. ఇది దేవుళ్ళ గురించి కాదు, ఇది మీ గురించి, ఇంకా మీ అందుకోగలిగే సామర్ధ్యం గురించి.



    Share

Related Tags

మార్మికత

Get latest blogs on Shiva

Related Content

శివలింగాల గురించి మీకు తెలియని 12 విషయాలు