logo
logo

యోగ యోగ యోగేశ్వరాయ స్తుతి

“ఆదియోగి విశిష్టత ఏంటంటే, మానవ చైతన్యాన్ని జాగృతం చేసేందుకు గానూ, సర్వకాలాలకీ సముచితమైన విధానాలను ఆయన అందించారు.” – సద్గురు

సద్గురు అందించిన యోగ యోగ యోగేశ్వరాయ స్తుతి, ఆదియోగి శివుడు మానవాళికి అందించిన అసమానమైన మహోపకారానికి ఒక నీరాజనం. మానవుడి మేథాశక్తి గ్రహించగల ఇంకా గ్రహించలేని ప్రతీ గుణాన్ని ఆవహించి ఉండే అనేక రూపాలు శివునికి ఉన్నాయి. వీటన్నిటిలోకి, ప్రాథమికమైనవిగా పరిగణించబడే ఐదు రూపాలు ఉన్నాయి. యోగేశ్వరాయ, భూతేశ్వరాయ, కాలేశ్వరాయ, సర్వేశ్వరాయ ఇంకా శంభో. మరింత తెలుసుకోండి...

ఈ స్తుతిని సాధన చేయడం ద్వారా వ్యవస్థలో ఉష్ణ లేదా వేడి జనించేలా చేస్తుంది ఇంకా రోగనిరోధక వ్యవస్థనుబలోపేతం చేయడానికి ఉపకరిస్తుంది.

యోగ యోగ యోగేశ్వరాయ స్తుతిని ఇక్కడ వినండి:

స్తుతి గేయం తెలుగులో:

యోగ యోగ యోగేశ్వరాయ
భూత భూత భూతేశ్వరాయ
కాల కాల కాలేశ్వరాయ
శివ శివ సర్వేశ్వరాయ
శంభో శంభో మహాదేవాయ

తెలుగు అనువాదం:

భౌతికతను అధిగమించిన యోగేశ్వరునికి
పంచ భూతాలకు అధిపతియైన భూతేశ్వరునికి
కాలానికి అధిపతి ఇంకా కాల చక్రాలకు అతీతమైన కాలేశ్వరునికి
సర్వాంతర్యామి, సమస్తానికీ మూలం అయిన సర్వేశ్వరునికి
సర్వోన్నతుడు, మహాదేవుడు అయిన శంభునికి నీరాజనాలు

    Share

Related Tags

శివ స్తోత్రాలు

Get latest blogs on Shiva

Related Content

Shiva Tandava Stotram Lyrics in Telugu | శివతాండవ స్తోత్రానికి మూలం