logo
logo

శివుని నటరాజ స్వరూపం : The Cosmic Dancer

భారతదేశంలో మన దేవుళ్ళు నాట్యమాడి తీరాల్సిందే. నాట్యమాడ లేకపోతే అసలు వాళ్ళు దేవుళ్లే కాదు! ఇలా ఎందుకంటే…

సద్గురు: భారతదేశంలో మన దేవుళ్ళు నాట్యమాడి తీరాల్సిందే. నాట్యమాడ లేకపోతే అసలు వాళ్ళు దేవుళ్లే కాదు! ఇలా ఎందుకంటే, ఈ సృష్టి ప్రక్రియకు మనం ఇవ్వగల అతి దగ్గర ఉపమానం ఏంటంటే, అదొక నాట్యం వంటిదని చెప్పొచ్చు. ఈ రోజుల్లో, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా, ఈ సృష్టి నాట్యమాడుతునట్టుగా కనబడుతుందంటూ అలాంటి పదాలనే వాడుతున్నారు. మనం నృత్యాన్ని పైపైన గమనించినప్పుడు, ఆ కదలికల మధ్య పెద్దగా సమన్వయం ఏమీ లేదు అన్నట్టు అనిపిస్తుంది. కానీ మనం కనుక తగినంత లోతుగా పరిశీలిస్తే, ఆ కదలికల వెనకాల ఓ గొప్ప వ్యవస్థ ఉందని తెలుస్తుంది.

ఉదాహరణకి మనం భారతీయ శాస్త్రీయ నృత్యం తీసుకుంటే, ఆ నృత్యంలో వాళ్ళు కాళ్ళు చేతులని యాదృచ్ఛికంగా ఎలా పడితే అలా కదుపుతున్నారనిపిస్తుంది. పైపైన చూసినప్పుడు అందులో పెద్ద విషయం ఏమీ లేదనిపిస్తుంది. కానీ తగినంత లోతుగా పరిశీలిస్తే, వారి కదలికల మధ్య ఓ లోతైన సమన్వయం ఉంటుంది. ఆ సమన్వయం గనుక లేకపోతే, ఆ నృత్యం అంత మనోరంజకంగా ఉండదు. ఈ విధంగా, కాళ్లు చేతులను ఎలా పడితే అలా కదుపుతున్నట్టు చేస్తూనే, వారు వర్ణించాలనుకున్న దాని గురించి పూర్తి సమన్వయాన్ని కలిగుండటం అనేది ఎన్నో ఏళ్ల శిక్షణ ఇంకా సాధనతోనే వస్తుంది. నృత్యంలో ఉండే ఆ జ్యామితి సౌందర్యం, చూసేవారికి ఆ కథ గురించి గానీ ఆ నాట్యం గురించి గానీ ఏమీ తెలీకపోయినా, అది వారిని ఓ విధంగా ప్రభావితం చేస్తుంది. సంగీతం విషయంలో కూడా మరో రకంగా ఇదే జరుగుతుంది.

భౌతిక శాస్త్రవేత్తలు కూడా ఇదే అంటున్నారు, ఈ సృష్టి చూడటానికి పూర్తిగా యాదృచ్చికంగా ఇంకా యధాలాపంగా జరిగే విషయంలా కనబడుతుంది, కానీ లోతుగా పరిశీలించినప్పుడు అన్నింటి మధ్యా ఓ విధమైన సమన్వయం ఉందని తెలుస్తుందంటున్నారు. అన్నింటికీ మధ్య ఒక విధమైన సమన్వయం ఎదో ఉంది, కానీ అదేంటో వాళ్లిప్పటికీ కనుక్కోలేక పోతున్నారు. యోగా విషయంలో కూడా, వ్యక్తిగత జీవమైన మనకీ ఇంకా అతిపెద్ద అభివ్యక్తీకరణ అయిన ఈ సృష్టికీ మధ్య ఓ సమన్వయం ఉన్న ఏకైక కారణంగానే, యోగా అనేది సాధ్యపడుతుంది. ఆ సమన్వయం గనుక ఉండి ఉండకపోతే, మీరు ఐక్యం అవ్వలేరు. సమన్వయమే లేకపోతే, అసలు ఐక్యం అవ్వడమనే సంభావ్యత ఉండేదే కాదు.

నటరాజు అయిన శివుడు ఇంకా భౌతికశాస్త్రం


శాస్త్రవేత్తలు గత కొన్ని సంవత్సరాలగా Constructal theory అనేదాన్ని ప్రతిపాదిస్తూ వస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మనము ఓ అణువును తీసుకున్నా, మనిషిని తీసుకున్నా, ఏనుగుని తీసుకున్నా లేదా ఈ విశ్వాన్నే తీసుకున్నా - వాటి ప్రాథమిక నమూనా ఒక్కటే. అధునాతనను బట్టి మారేది కేవలం వాటిలోని సంక్లిష్టత ఒక్కటి మాత్రమే.

దీన్నే మనం యోగాలో ఎప్పటినుండో చెబుతూనే ఉన్నాం. అండ పిండ బ్రహ్మాండాలు అంటారు. అంటే ఈ జీవం, వ్యక్తులు, ఇంకా విశ్వం అన్నీ కూడా ఒకే పదార్థంతో చేయబడ్డాయి, ఇవన్నీ అదే పదార్థం యొక్క మూడు విభిన్నమైన అభివ్యక్తీకరణలు. అవన్నీ ఓ సమన్వయంలో ఉన్నాయి. అలాగే వాటి ఉద్దేశం ఒక్కటే కావడం వల్లనే, మనం ఓ దాన్ని మరో దానిలో కలపగలుగుతున్నాం. మీరు ఓ క్యారెట్ ముక్కను తిని దాన్ని ఓ మనిషిగా చేయొచ్చు, రెండింటి రూపకల్పన ఒకటే కావడం వల్లనే ఇది సాధ్యపడుతుంది.

ఈ విశ్వం నడుస్తున్న విధానానికి మనం ఇవ్వగల అతిదగ్గరి ఉపమానం ఇంకా అతి దగ్గర వివరణ ఏంటంటే, అదొక తాండవం అనొచ్చు. ఎందుకంటే విశ్వంలో అన్ని యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టు కనపడతాయి, కానీ ప్రతి దాని వెనుక ఓ ఖచితమైన వ్యవస్థీకరణ ఇంకా సమన్వయం ఉంటుంది. కాకపోతే విషయం ఏంటంటే చాలామంది వ్యవస్థీకరణ అంటే అది మేధోపరమైనదని, ఇంకా విభజనలు చేయడమనుకుంటారు. ఉదాహరణకు ఓ చక్కటి తోటని ఇంకా ఓ అడవిని తీసుకుందాం. మనం తోట చక్కగా పద్ధతిగా ఉంటుందని, అడవిలో ఎటువంటి పద్దతి ఉండదనుకుంటాము. కానీ మీరు ఓ మూడు నెలల పాటు తోటను చూసుకోకపోతే అది పాడైపోతుంది. కానీ ఓ అడవి మీ సంరక్షణ లేకుండా కొన్ని కోట్ల ఏళ్ల వరకూ కుడా కొనసాగగలదు. అలాంటప్పుడు వీటిలో దేనికి మెరుగైన వ్యవస్థీకరణ ఉందంటారు?

చిదంబరం ఆలయంలో, నాట్యం చేసే దేవుడైన నటరాజుగా శివుని మూర్తి ఉంటుంది. నర్తకుడు నటరాజు అనేది శివుని యొక్క అత్యంత ముఖ్యమైన రూపాలలో ఒకటి. నేను స్విట్జర్లాండ్లోని CERN ను సందర్శించాను. ఈ గ్రహం మీద ఇదే అతిపెద్ద భౌతిక ప్రయోగశాల, ఇక్కడే అణువులను డీ కొట్టించి విచ్చినం చేయడం వంటివి చేస్తారు. అక్కడ ప్రవేశ ద్వారం ముందు నటరాజ విగ్రహం ఉండడాన్ని నేను గమనించాను. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు ఏదయితే చేస్తున్నారో దానికి దగ్గరగా ఇది తప్ప, మానవ సంస్కృతులలో మరేదీ లేదు.

నటరాజ: ఆనందతాండవం


ఈ సృష్టి ఓ నృత్యం కాబట్టి మనం ఆ దైవాన్ని ఒక నృత్యకారుడు అన్నాము. అతను ఒక నృత్యకారుడు కానప్పుడు అతను ఈ నృత్యం జరిగేలా ఎలా చేయగలుగుతాడు? మనం శివుణ్ణి నటరాజు అన్నప్పుడు, మనం ఆ వ్యక్తి చేసే నృత్యం గురించి మాట్లాడటం లేదు. మీరు గమనించే ఉంటారు నటరాజ విగ్రహం చుట్టూ ఓ వృత్తం ఉంటుంది. వృత్తం అనేది ఎప్పుడూ కూడా ఈ విశ్వానికి ఓ ప్రతీక. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా కదిలినప్పుడు, ఈ సృష్టిలో పుట్టె అతి సహజమైన రూపం వృత్తం. తనకు తానుగా పుట్టేదేదైనా సరే ఓ వృత్తం అవుతుంది లేదా ఓ దీర్ఘవృత్తాభాసం (కొద్దిగా వక్రీకరించబడిన వృత్తం) అవుతుంది. ఇందుకు కారణం ఏంటంటే వృత్తం అనేది అతి తక్కువ ఘర్షణకలిగిన రూపం. ఈ గ్రహం, చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ కూడా వృత్తాలే.

ఇందువల్లే నటరాజు చుట్టూ ఉండే ఆ వృత్తం విశ్వాన్ని సూచిస్తుంది. ఆయన్ని ఎప్పుడూ ఈ విధంగానే వర్ణిస్తారు. అంటే దానర్థం ఈ విశ్వం అంతటా ఎవరో ఓ వ్యక్తి నృత్యం చేస్తున్నాడని కాదు. దానర్థం ఈ విశ్వం నృత్యం చేస్తూ ఉందని. అలాగే ఒక విధమైన మేధస్సు ఆ నృత్యం జరిగేలా చేస్తుంది. మనం వ్యక్తిగత జీవులం కాబట్టి, అలాగే మనమన్నింటినీ వేరు వేరైన వ్యక్తిగత జీవులుగా చూస్తాం కాబట్టి, మన అవగాహన కోసం మనం దాన్ని ఓ నటరాజు అనే వ్యక్తిగా చిత్రీకరించాం. శివ అనే పదానికి అక్షరాలాఅర్థం, “ఏదైతే లేదో అది” అని, లేదా “ఏదైతే పదార్థం కాదో అది” అని. అదొక పదార్థం కాదు. అదొక ఖాళీ శూన్యం, కానీ అది నృత్యం చేస్తుంది. అది నృత్యం చేస్తోంది కాబట్టే, అంతా జరుగుతోంది.

నటరాజు: శివుని అత్యంత ముఖ్యమైన రూపం


ఈ నటరాజు అనేది ప్రాథమికంగా దక్షిణ భారతదేశం నుండి, ముఖ్యంగా తమిళనాడు నుండి వస్తుంది. అది ఈ సృష్టిలోని ఉత్తేజాన్ని,ఇంకా శాశ్వత నిశ్చలత నుండి తనకు తానే సృష్టిలోకి వచ్చిన, సృష్టి అనే ఈ నాట్యాన్ని సూచిస్తుంది. మనం దేన్నయితే పరిపూర్ణ నిశ్చలత అంటామో, చిదంబరంలోని నటరాజ విగ్రహం దాన్ని సూచిస్తుంది. ఈ ఆలయంలో పొందుపరచబడినది (enshrined) అదే.

ఈ నృత్యాన్ని మీరు అవగాహన చేసుకోలేరు, ఎందుకంటే మీరెలా అర్థం చేసుకున్నా అదొక తప్పుడు నిర్ధారణకే దారి తీస్తుంది. కానీ మీరు ఈ నృత్యంలోని సౌందర్యాన్ని అనుభూతి చెందవచ్చు, లేదా మీరే ఆ నృత్యంగా అవ్వచ్చు. గమనించడం ద్వారా మీరు ఈ నృత్యంలోని సౌందర్యాన్ని అనుభూతి చెందితే, అప్పుడు మిమ్మల్ని సాధకుడంటారు. సమాజం వారిని వేరే పేర్లతో పిలవొచ్చు - ఉదాహరణకు వారిని శాస్త్రవేత్తలు అనొచ్చు - అయినా సరే వారు సాధకులే. దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు ధ్యాస పెట్టి గమనిస్తున్నారు. మీరు ఆ నృత్యంగా మారితే, మీరు ఆ దైవం అవుతారు, ఓ యోగి అవుతారు. మీకున్న ఎంపిక ఇదే.

ఈ నృత్యం ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే, దాదాపు మనం ఇక ఆ నృత్యకారుడి గురించి మర్చిపోతాము, కానీ నృత్యకారుడు లేకుండా నృత్యం ఉండదు. మన దృష్టి ఇంకా మన ధ్యాస, పై పైనే ఉంటాయి, కాబట్టె మనం ఈ నృత్యాన్ని అవగాహన చేసుకోలేము. ఈ నృత్యంలో, నృత్యకారుడిని కనుగొనాలంటే, ఓ మార్గం ఏంటంటే, మీరు ఆ నృత్యంలో ఎంతగా లీనమవ్వాలంటే ఇక మీరే ఆ నృత్యం అయిపోవాలి, మీరిక వీక్షకులు కాక మీరే ఆ నృత్యం అవ్వాలి. అప్పుడు మీరు అనుభవపూర్వకంగా ఆ నృత్యకారుడిని తెలుసుకుంటారు, మీరు ఆయనచే తాకబడతారు. కానీ మీరు గనక ఈ నృత్యకారూడిని పూర్తిగా తెలుసుకోవాలీ అనుకుంటే, ఈ నృత్యం మూలాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఈ నాటకం అంతటికీ ఆధారమైన వాడిని తెలుసుకోవాలనుకుంటే, ఓ విధంగా ఈ నృత్యానికి దూరంగా ఉంటూనే, మీరు పరిపూర్ణమైన ధ్యాస పెట్టగలగాలి. ఇవి రెండూ చూడడానికి పరస్పర వైరుధ్యాలుగా అనిపిస్తాయి. ఓ స్థాయిలో నేను మీరు ఆ నృత్యంలో మునిగిపోవాలి అంటున్నాను, మరో స్థాయిలో నేను మీరు ఆ నృత్యాన్ని అత్యంత తీక్షణతతో గమనించగలగాలీ అంటున్నాను. ఇవి పరస్పర వైరుధ్యాలు కాదు. కాకపోతే విషయం ఏంటంటే, దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, ఒక్కొక్క ముక్కని వేరువేరుగా చూసినప్పుడు ప్రతిదీ కూడా వైరుధ్యంతో ఉన్నట్టు కనిపిస్తుంది.

ఈ నృత్యంగా అవ్వండి!


తెలుసుకునేందుకు ఓ మార్గం, ఈ నృత్యంలో, ఈ నాటకంలో పూర్తిగా నిమగ్నమవ్వడం. లేదా మరో మార్గం ఏంటంటే, మిమ్మల్ని మీరు ఈ నాటకం నుండి దూరంగా ఉంచుకొని, ఈ నాటకంలో ఏమాత్రమూ నిమగ్నమవకుండా ఉండి, ఈ నాటకాన్ని పూర్తిగా గమనించగలగడం. అప్పుడు మీరు ఈ నాటకానికీ ఇంకా నాటకం ఆడుతున్న వాడికీ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ నృత్యానికీ ఇంకా ఈ నృత్యం చేస్తున్న వాడికీ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోగలుగుతారు. రెండో మార్గం ద్వారా తెలుసుకోవాలంటే, అందుకు చాలా ఎక్కువ ఎరుక, చురుకుదనం, తీక్షణత, ఇంకా శిక్షణ అవసరం. కాబట్టి దానికంటే ఈ నృత్యంలో భాగమవ్వడమనేది తేలికైన మార్గం. నెమ్మది నెమ్మదిగా ఆ లయ పెరిగేకొద్దీ, మీరు మరింత మరింత లోనికి లాగబడతారు, ఏదో ఒక రోజున ఏది మీరో, ఏది ఈ నృత్యమో, వాటి మధ్య వ్యత్యాసం మీకిక తెలీదు. ఓసారి మీరు ఈ నృత్యంలో భాగమయ్యాక, ఆ నృత్యకారుడి సాన్నిధ్యాన్ని మీరు తప్పించుకోలేరు.

    Share

Related Tags

శివ తత్వంమార్మికత

Get latest blogs on Shiva

Related Content

ఆదియోగి మధుర ఘట్టాలు: గురుదక్షిణ ఇవ్వడంలోని విశిష్టత