logo
logo

‘నంది’ ధ్యానంలో ఉన్న ఎద్దుగా ఎలా అయింది?

‘నంది’ ధ్యానంలో ఉన్న ఎద్దుగా ఎలా అయింది?



సద్గురు, శేఖర్ కపూర్ శివుని వాహనమైన నంది యొక్క ప్రాముఖ్యత గురించి సంభాషిస్తారు

శేఖర్ కపూర్ నంది, శివుని వాహనంగా నాకు తెలుసు. నంది శివుడు బయటికి వచ్చి తనతో ఏదో చెప్తాడని ఎదురు చూస్తోందా...... ఎమిటది....? నాకు నందిని గురించి మరింత వివరించండి.

సద్గురు: శివుడు బయటికి వచ్చి ఏదో చెబుతాడు అని నంది ఎదురు చూడటం లేదు. అనంతమైన నిరీక్షణకు నంది ప్రతీక. ఎందుకంటే వేచి ఉండటం అనేది అతి గొప్ప ‘సుగుణం’గా మన భారతీయ సంస్కృతి భావిస్తుంది. ఎవరైతే అలా కూర్చుని ఎదురు చూస్తుంటారో, వారు సహజంగానే ధ్యానంలో ఉంటారు. శివుడు ఎదో రేపు బయటకు వచ్చేస్తాడని నంది ఎదురు చూడటం లేదు. ఆయన అలా ఎల్లప్పటికీ ఎదురు చూస్తూ ఉంటారు. మనలోని గ్రాహ్యత స్వభావానికి ఎదురు చూడటం అనేది ఒక ప్రతీక.

నంది శివునికి అతి సన్నిహితుడు. దానికి కారణం ఏమిటంటే ఆయన గ్రాహ్యత స్వభావ సారం. మీరు గుడిలోకి ప్రవేశించే ముందు, మీలో ఈ గుణం ఉండాలి, అలా కూర్చుని ఉండడం. మీరు ఏదో స్వర్గానికి వెళ్ళాలి అనుకోవటం లేదు. మీరు ఏదో సాధిద్దాం అనుకోవటం లేదు. మీరు లోపలికి వెళ్లి కూర్చోవాలి అంతే. అలా అక్కడ కూర్చుని ఆయన మీకేం చేబుతున్నాడంటే, మీరు గుడిలోకి వెళ్ళినప్పుడు ‘ఏదో చేద్దాం’ అనుకోవద్దు. అది, ఇది అంటూ అడగవద్దు. ‘లోపలకు వెళ్లి అలా కూర్చుండి పో’ అని చెబుతున్నారు.


శేఖర్ కపూర్:వేచి ఉండటం , ఎదో జరుగుతుందని అనుకోవడం బహుశా రెండూ రెండు వేర్వేరు విషయాలు అనుకుంటాను, అవునా?

సద్గురు: ఆయనేమీ ఏదో జరుగుతుందని ఎదురు చూడటం లేదు. అలా ఎదురుచూపు, అంతే. ఇదే ధ్యానం – ఉరికే అలా కూర్చోవడం. లోపలి వెళ్లి ఊరికే అలా కూర్చోండి. ఏదో నిద్రలో తూలుతూ కాదు, అప్రమత్తతతో.

శేఖర్ కపూర్: మరి ఆ ఎద్దు కూర్చున్నది, మనం ధ్యానం అనే స్థితిలోనా?

సద్గురు : అందరూ ధ్యానం అంటే అదేదో చేసేది అనుకుంటున్నారు. అది మనం చేసే ఒక పని కాదు. అది ఒక స్వభావం. వాటి మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం అదే. ప్రార్థనలో మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు మీరు చేస్తున్న వ్రతాలు, మీ ఆకాంక్షలు ఇంకా ఇలాంటివి ఎన్నో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ధ్యానం అంటే మీరు అస్థిత్వం చెప్పేది వినటానికి తయారుగా ఉన్నారు. సృష్టి యొక్క మూల తత్వాన్ని వినడానికి తయారుగా ఉన్నారు. మీకు చెప్పుకోడానికి ఏమీ లేదు. మీరు అలా కూర్చుని ఉన్నారు, అంతే. నంది గుణం కూడా అదే. ఆయన అలా కూర్చుని ఉన్నారు, అప్రమత్తతతో. ఇది చాలా ముఖ్యం, ఆయన అప్రమత్తతతో ఉంటారు. ఆయన కూర్చుని నిద్ర పోవటం లేదు, ఆయన చాలా పూర్తి అప్రమత్తతతో, చైతన్యవంతంగా ఉన్నారు. అంతే గాని ఆకాంక్షలతో, కోరికలతో కాదు. ధ్యానం అంటే అదే. అలా కూర్చుని ఉండిపోవడం, దేని కోసమో కాదు.

మీరు, ఏదో చేయాలనుకోకుండా, అలా కూర్చుని ఉండిపోతే, అస్తిత్వం తన పని తను చేస్తుంది. ధ్యానం అంటే అదే. వ్యక్తి తనదంటూ ఏమీ చేయటం లేదు ఆయన ఉండిపోతాడు. మీరు అలా ఉండిపోతే మీరు అస్తిత్వంలోని అతిపెద్ద అంశాన్ని గురించిన ఎరుకలో ఉంటారు. అది అప్పుడు క్రియాశీలంగా ఉంటుంది. మీరు కూడా దానిలో ఒక భాగమేనని ఎరుకలో ఉండటమే ధ్యానం. నంది ఆ ధ్యానానికి ప్రతీక. ఆయన అందరికీ ‘మీరూ నాలాగా కూర్చోండి’ అని గుర్తు చేస్తున్నారు.

శేఖర్ కపూర్: ధ్యాన లింగం దగ్గర ఉన్న నందిని దేనితో చేశారు అది ఒక లోహంతో చేసినట్లు నాకు తెలుస్తోంది. మరి అది స్టీలా?

సద్గురు: ప్రపంచంలో ఈ విధంగా ఉన్న నంది, ఇదొక్కటేనేమో. చిన్న చిన్న లోహపు పలకలతో తయారైంది. 6 నుంచి 9 అంగుళాల పలకలను అతికించి పై ఉపరితలం తయారు చేసాము. లోపల మేము నువ్వులు, పసుపు, విభూతి, కొన్ని నూనెలతో, కొన్ని రకాల మట్టితో, నింపాము. దానిని నింపడానికి మాకు 20 టన్నుల పదార్ధం పట్టింది. అవి వేశాక, దానిని మూసివేశాం. ఇలా చేయడం వల్ల నందిని ఒక రకమైన శక్తి స్థానాన్ని ప్రకాశిస్తూ ఉంటుంది.

    Share

Related Tags

శివ భక్తులు

Get latest blogs on Shiva

Related Content

శివలింగాల గురించి మీకు తెలియని 12 విషయాలు