logo
logo
adiyogi

సరిహద్దులను తొలగించడం

యోగా అంటే మన పరిధుల్ని అంతం చేసే శాస్త్రం. మౌళిక జీవన స్థితిలో, ఒక చిన్న జీవి నుంచి మానవుడి దాకా - జీవితం అంటే పరిధులు ఏర్పరచుకోవడమే.

సరిహద్దులను తొలగించడం


యోగా అంటే మన పరిధుల్ని అంతం చేసే శాస్త్రం. మౌళిక జీవన స్థితిలో, ఒక చిన్న జీవి నుంచి మానవుడి దాకా - జీవితం అంటే పరిధులు ఏర్పరచుకోవడమే. మీరు ఒక కుక్కని చూసే ఉంటారు, అది అక్కడ ఉన్న ప్రదేశమంతా అక్కడక్కడా మూత్రం చేస్తూ ఉంటుంది. ఇది దానికి ఏదో మూత్రకోశ సంబంధమైన సమస్య ఉన్నందు వల్ల అలా చేయడంలేదు. అది దాని పరిధుల్ని ఏర్పరుచుకుంటోంది. ఇలానే ప్రతి ప్రాణి కూడా వాటి పరిధుల్ని అది ఏర్పరచుకుంటుంది. మానవుడితో సహా అందరూ ఈ పని ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటారు.


ఆశ్రమంలో మనం ఇలాంటి పరిధుల్ని నిర్ములించాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ కూడా, ప్రజలు మళ్ళీ అందులో వాళ్ళ పరిధుల్ని వారు ఏర్పరచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే వీరికి మళ్ళీ అలా గిరి గీసుకుని ఉండకపోతే అది ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఎంతోమంది కేవలం అలా జీవించలేరు. ఇదో దురదృష్టం. వారు ఎప్పుడూ ఓ గూటిలో ఉండాలని అనుకుంటారు. వాళ్లకి జైలులో ఉండడం అంటే ఇష్టం. అనంతమైన అనుభూతులకు నిలయమైన ఈ విశ్వంలో వాళ్ళు అలా జీవించలేరు.

యోగా అంటే ఒక మానవుడికి ఏ విధంగా వీలైతే ఆ విధంగా, ఈ పరిధుల్ని నిర్మూలించుకోవడానికి సహకరించడమే. అప్పుడు మీరు కేవలం అలా ఈ విశ్వంలో ఉండచ్చు.

మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఒక పరిధిని ఏర్పరుచుకున్నప్పుడు, అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. తరువాత దాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి. ఈ సరిహద్దు బాగా పెద్దదయిపోతే దాన్ని సంరక్షించడానికి ఓ సైన్యాన్ని తయారుచేయాలి. ప్రతి దేశానికి కూడా సైన్యం ఏదో ఊరకే పరిహాసానికి లేదు కదా! మనకి, అవసరమైతే దాని కోసం మరణించడానికి సిద్ధంగా ఉండాలి. సరిహద్దు ఉంది కాబట్టి, ఇవన్నీ కూడా ఒకటి తరువాత ఒకటి వస్తాయి. దాన్ని సంరక్షించుకోవాలి, లేకపోతే ఎవరో ఒకళ్ళు అందులో నుంచి చొరబడతారు. ఈ సరిహద్దు అనేది మీకు ఎంతో ముఖ్యమైనది అయినప్పుడు మీరు దాన్ని సంరక్షించుకోవాలి, దానికోసం పోరాడాలి. “యోగా” అంటే వీటన్నిటి నుంచి విముక్తి చెందడమే. మీరు ఈ సరిహద్దే తీసేస్తే మీకు వీటన్నిటి నుంచి విముక్తి దొరికినట్టే కదా! మీరు ఇక్కడ కూర్చుని ఉంటే, మీరు ఈ విశ్వంలో అలా కూర్చుని ఉండగలరు. మీకు ఓ పరిధి, ఓ హద్దు, ఓ పరిమితి ఎందుకు? ఎందుకంటే, మీకు మీది అనే స్థలం కావాలి కాబట్టి.

నిజానికి మీది అనే స్థలం ఏది లేదు. మీది అని మీరు అనుకోవచ్చు. కానీ అదంతా మీ భ్రమే. భౌతికమైన దానికి ఒక పరిమితి ఉంటుంది. అది పెద్ద సమస్య కాదు. ఇది భౌతిక తత్వంలోని లక్షణం. కానీ ఇది మీ మానసిక స్థితిలోకి కూడా వ్యాపించింది. మీ మనస్సులో, మీ బుద్ధిలో కూడా, మీరు ఒక పరిధి కావాలనుకుంటున్నారు. మీరు ఈ పరిధుల్ని సృష్టించడంలో ఎంతో శ్రమ పడ్డారు. ఈ శ్రమలో, ఈ అనంతమైనది మీలోనే ఉన్నా కూడా మీకు అందుబాటులో లేకుండా, మీ అనుభూతిలో లేకుండా పోయింది. జరిగింది అంతే..! ఎందుకంటే మీరు, మీ సమయం, మీ శక్తి , మీ తెలివితేటలు అన్నీ కూడా మీ సొంతమైన పరిధులు ఎలా నిర్మించుకోవాలా? అన్నదానికి వెచ్చిస్తున్నారు. అప్పుడు మీలోని ఈ అనంతమైనది మీ అనుభూతి నుంచి జారిపోతుంది.


మీరు మీ సరిహద్దుని నిర్మంచుకున్నారంటే, ఆ తరువాత చేయవలసిన పని దానిని పరిరక్షించుకోవడం, సరిహద్దు మరీ పెద్దదైతే దాన్ని రక్షంచడానికి ఒక పెద్ద సైన్యన్ని తయారు చేసుకోవాలి.

ఇదంతా మీరు చేసుకున్నదే. ఈ సృష్టి నుంచి విడిపడిపోవడం అన్నది మీరు చేసుకున్న కర్మే. ఇంత సజీవంగా అన్నిటిని ఇముడ్చుకుని ఉన్న ఈ విశ్వంలో మీరు ఒంటరితనాన్ని అనుభూతి చెందుతున్నారు, మేము ఆదియోగి గురించి మాట్లాడినప్పుడు ఆయన్ని ఒక యోగి అంటాము. ఎందుకంటే, ఎవరైతే ఈ పరిధులన్నింటినీ చెరిపేసి, తనలో ఎటువంటి పరిమితులు లేకుండా తయారయ్యారో వారిని మనం “యోగి” అంటాము. ఇలా చేయడంలో మొట్టమొదటివాడు కాబట్టి మనం ఆయన్ని “ఆదియోగి” అంటాము. మేము ఆయన్ని ప్రతిష్టించినప్పుడు ఆయన శక్తి ఈ విధంగానే ఉంటుంది. ప్రజలు ఇక్కడకొచ్చి కూర్చుంటే మెల్లిగా వాళ్ళు కూడా ఆ విధంగా మారడం మొదలుపెడతారు. వారి జీవితంలో ఈ పరిధుల్ని అధిగమించి అపరిమితతత్వం వైపు ప్రయాణం చేస్తారు. నిజానికి చేరుకోవలసిన లక్ష్యం అదొక్కటే. మనం ఏ పని చేసినా కూడా లక్ష్యం అదే.

మేము ఇప్పుడు ఆదియోగి ఆలయాలను తయారుచేసే ప్రక్రియలో ఉన్నాం. ఇవి ప్రపంచంలో ఎన్నో ప్రదేశాల్లో రావాలి. ప్రజలకి, ‘ఇది ఎందుకు అవసరమో’ అన్న విషయం అర్థమయ్యేలా చెప్పడం ఎంతో ముఖ్యం. మనం ‘అపరిమితంగా ఉండచ్చు’ అని మనకి గుర్తుచేసిన మొట్టమొదటి వ్యక్తి ఆది యోగి. ఈ పరిమితులు అన్నవి మనం పెట్టుకున్నవే అన్న విషయం మనకి మొట్టమొదటిగా గుర్తు చేసిన వ్యక్తి. ఇది మనకి తెలియపరచడమే కాదు, ఈయన మనకి అక్కడ చేరుకునేందుకు అద్భుతమైన విధానాలను ఇచ్చారు. జీవితం పరిణామం చెందగలదు అన్న ఆలోచన ఈయనది. ఈ పరిణామం అన్నది కేవలం భౌతిక తత్వానికే పరిమితం కానక్కర్లేదు. మీరు మీ చైతన్యంలో కూడా పరిణామం చెందొచ్చు. ఇది ఎంతో అద్భుతమైన అవకాశం. ఈయన దాన్ని మనకి అందుబాటులో ఉండేలా చేసారు. ‘యోగశాస్త్రం’ అంతా ఆయనదే. “నా కృషి అంతా కూడా ఈ మహానుభావుడు చేసిన అసమానమైన పనికి, మనకందించిన కానుకకు ఆయన గుర్తింపు పొందాలని. మానవ చైతన్యాన్ని పెంపొందించే ఈ శక్తివంతమైన కార్యంలో మీరు నాతో పాటు నిలవండి”.

    Share

Related Tags

మార్మికత

Get latest blogs on Shiva

Related Content

మహాశివరాత్రి గురించిన ఐదు ముఖ్య విషయాలు