విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ
గౌరిప్రియాయ రజనీశకలాధరాయ
కాలాన్తకాయ భుజగాధిపకఙ్కణాయ
గఙ్గాధరాయ గజరాజవిమర్దనాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ
భక్తిప్రియాయ భయరోగభయాపహాయ
ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ
చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ
భాలేక్షణాయ మణికుణ్డలమణ్డితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ
పఞ్చాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమండితాయ
ఆనందభూమివరదాయ తమోమయాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ
భానుప్రియాయ భవసాగరతారణాయ
కాలంతకాయ కమలాసనపూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణలక్షితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ
రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ
దారిద్ర్య దుఖాన్ని హరించేవాడు
సమస్త లోకాలకు అధిపతి
దుఖమనే మహా సాగారాన్ని తరింప జేసేవాడు
కర్ణామృతాది పేర్లు కలవాడు
చంద్రుని ఆభరణంగా ధరించినవాడు
కర్పూర కాంతి వలె ప్రకాశించేవాడు
జటాజూటాన్ని కలిగి ఉన్న శివునికి నా పాదాభివందనం
దారిద్ర్య దుఖాన్ని హరించేవాడు
పార్వతి దేవికి ప్రియమైన వాడు
శిరస్సున చంద్రుడిని ధరించినవాడు
మృత్యు దేవునికే మృత్యువు అయినవాడు
సర్పరాజునే చేతి కంకణములుగా అలంకరించుకొనేవాడు
గంగను తలపై నిలుపుకున్నవాడు
గజరాజునే అంతమొందించిన శివునికి నా పాదాభివందనం
దారిద్ర్య దుఖాన్ని హరించేవాడు
భక్తులకు అత్యంత సన్నిహితుడు
జనన మరణ భయాల వినాశకారి
ఉగ్రరూపుడు
భవ సాగరాన్ని సునాయాసంగా దాటించగల సమర్ధుడు
జ్యోతి స్వరూపుడు
తన నామ స్మరణకే నాట్యమాడే శివునికి నా పాదాభివందనం
దారిద్ర్య దుఖాన్ని హరించేవాడు
జంతు చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు
శ్మశాన బూడిదను దేహమంతా పూసుకున్నవాడు
నుదుట మూడో కన్ను కలిగిన త్రినేత్రుడు
విలువైన మణులను చెవి కుండలాలుగా ధరించినవాడు
అందెల శోభతో నయనానందాన్ని కలిగించే పాదపద్మాలు కలిగినవాడు
జటాజూటాన్ని కలిగి ఉన్న శివునికి నా పాదాభివందనం
దారిద్ర్య దుఖాన్ని హరించేవాడు
పంచ ముఖాలతో ప్రకాశించువాడు
సర్పరాజును ఆభారణముగా అలంకరించుకున్నవాడు
స్వర్ణమయ దుస్తులను ధరించేవాడు
ముల్లోకాలకు శోభను చేకూర్చేవాడు
వరాలతో ముంచెత్తేవాడు
ఆనందానికి మూలస్థానమైనవాడు
తమోగుణాన్ని అంతమొందించేవాడైన శివునికి నా పాదాభివందనం
దారిద్ర్య దుఖాన్ని హరించేవాడు
సూర్య దేవుని పట్ల ప్రేమగలవాడు
సంసార సాగరాన్ని దాటించగలవాడు
మృత్యుదేవుడినే జయించినవాడు
బ్రహ్మచే పూజింపబడేవాడు
అత్యంత మంగళకరమైన వాడైన శివునికి నా పాదాభివందనం
దారిద్ర్య దుఖాన్ని హరించేవాడు
శ్రీ రామునికి అత్యంత ప్రియమైనవాడు
శ్రీ రామునికి వరాలు ప్రసాదించినవాడు
నాగులపై పక్షపాతం చూపువాడు
నరకాన్ని నిర్మూలించేవాడు
పవిత్రులలో అత్యంత పవిత్రుడు
దేవతలచే ఆరాధింపబడు వాడైన శివునికి నా పాదాభివందనం
దారిద్ర్య దుఖాన్ని హరించేవాడు
ముక్తిని ప్రసాదించేవాడు
కర్మానుసార ఫలాలను ప్రసాదించేవాడు
గణాలకు అధిపతి, గాన ప్రియుడు
నంది వాహనుడు, ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు
మహేశ్వర నామకారుడవైన నీకు నా పాదాభివందనం