యోగ సంప్రదాయంలో శివుడిని గురువుగా పూజిస్తారు, దేవునిగా కాదు. మనము "శివుడు" అని పరిగణించేదానికి అనేక- పార్శ్వాలున్నాయి. మీరు ఆపాదించగల అన్ని లక్షణాలు శివుడికి ఆపాదించగలరు.శివుడు అని మనము అన్నప్పుడు అతడు ఇటువంటి వ్యక్తి అని లేదా అలాంటి వ్యక్తి అని మనము అనడంలేదు.
మామూలుగా, నైతికత మీద ఆధారపడిఉన్న సంప్రదాయాలలో దైవత్వాన్ని మంచితనంతోనే పోలుస్తారు. కానీ మీరు శివుడిని చూసినప్పుడు ఇతడిని మంచివాడిగానో లేక చెడ్డవాడిగానో గుర్తించలేము.సృష్టిలో ఉన్న దంతా ఇతనిలోనూ ఉన్నది. మన సంప్రదాయంలో అలాగే చెప్పారని సద్గురు అంటున్నారు.
శివుడికి లెక్కలేనన్ని రూపాలు, ఆవిర్భావాలు ఉన్నాయి,వాటినన్నిటినీ మనము ఏడు విభాగాలుగా పొందుపర్చవచ్చు. దేవునిగా మనము భక్తితో కొలిచే ఈశ్వరుడు, ఉదారంగా మనకు తోడుండే శంభుడు, నిరాడంబరుడైన సన్యాసి భో, అమాయకంగా మనపై ప్రేమను చూపే భోళా శంకరుడు, వేదాలను మనకు బోధించే జ్ఞానమూర్తి దక్షిణామూర్తి, కళలకు ప్రతీక నటేశుడు, తీవ్రమైన, శిష్ట రక్షణ చేసే కాలభైరవుడు లేదా మహాకాలుడిగా, చంద్రుని మించిన సుందరమైన, శృంగార మూర్తి, సోమసుందరుడు, ఇవన్నీ ఏడు ప్రాధమిక రూపాలు మాత్రమే. వీటినుండి లక్షల కొద్దీ ఆవిర్భవాలకు అవకాశం ఉందని సద్గురు తెలియచేస్తున్నారు.
యోగ సంప్రదాయంలో శివుడికి ఉన్న 1008 పేర్లున్నాయి ఇవన్నీ ఈ ఏడు విస్తృత వర్గాల నుండే ఉద్భవించాయి. ఈ 1008 పేర్లలో 108 పేర్లు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి.
ఆశుతోషుడు
అన్నికోరికలను వెంటనే తీర్చేవాడు
ఆదిగురువు
మొదటి గురువు
ఆదినాథుడు
మొదటి స్వామి
ఆదియోగి
మొదటి యోగి
అజా
పుట్టుక లేనివాడు
అక్షయగుణ
అంతులేని గుణములున్నవాడు
అనఘుడు
వంక పెట్టలేనివాడు
అంతదృష్టి
అంతులేని దృష్టి కలవాడు
ఔగాధుడు
ఎల్లప్పుడూ ఆనందంలో రమించువాడు
అవ్యయప్రభు
అంతములేనివాడు
భైరవుడు
భయము దూరము చేసేవాడు
భళనేత్ర
నుదుటియందు నేత్రం కలవాడు
భోళానాథుడు
అమాయకుడు
భూతేశ్వరుడు
పంచ భూతాలపై ఆధిపత్యం ఉన్నవాడు
భూదేవుడు
భూమికి అధిపతి
భూతపాలుడు
భూతములను రక్షించువాడు
చంద్రపాలుడు
చంద్రునికి అధిపతి
చంద్రప్రకాశుడు
చంద్రుని శిఖపై ధరించినవాడు
దయాళుడు
కరుణతో నిండినవాడు
దేవాదిదేవుడు
దేవతలకే దేవుడు
ధనదీపుడు
ధనానికి అధిపతి
ధ్యానదీపుడు
ధ్యానానికి అధిపతి
ధ్యుతిధారుడు
ప్రకాశానికి అధిపతి
దిగంబరుడు
ఆకాశాన్ని తన వస్త్రంగా చేసుకున్నవాడు
దుర్జనీయుడు
తెలుసుకోవటం కష్టమైనవాడు
దుర్జయుడు
ఓటమినెరుగనివాడు
గంగాధరుడు
గంగను తనపై మోయువాడు
గిరిజాపతి
గిరిజకు పతి
గుణాగ్రహుడు
గుణాలను అంగీకరించినవాడు
గురుదేవుడు
దేవునితో సమానమైన గురువు
హరుడు
పాపములను హరించువాడు
జగదీశుడు
జగత్తుకి అధిపతి
జరాదిష్మణుడు
బాధలను తొలగించువాడు
జటి
జడలుగా ఉన్న జుట్టు ఉన్నవాడు
కైలాశుడు
శాంతిని ప్రసాదించువాడు
కైలాశాధిపతి
కైలాసానికి అధిపతి
కమలాక్షణుడు
కమలములు వంటి కనులున్నవాడు
కాంతుడు
ఎప్పటికీ ప్రకాశించువాడు
కపాలి
కపాలమాలను మేడలో ధరించినవాడు
కొచ్చడైయాన్
పొడుగు జడలున్న స్వామి
లలాటాక్షుడు
లలాటముపైన కన్ను ఉన్నవాడు
లింగాధ్యక్షుడు
లింగాలకు అధిపతి
లోకంకరుడు
మూడు జగత్తులను సృష్టించినవాడు
లోకపాలకుడు
లోకాలను రక్షించువాడు
మహాబుద్ధి
గొప్ప జ్ఞానము కలవాడు
మహాదేవుడు
దైవాలలోకెల్లా గొప్పవాడు
మహాకాళుడు
కాలానికి అధిపతి
మహామాయ
మాయలలో కెల్లా గొప్పదైన మాయ
మహామృత్యుంజయుడు
మృత్యువును జయించినవాడు
మహానిధి
గొప్పనిధి
మహేశా
మహోన్నతమైన దైవం
మహేశ్వర
దేవతలకు అధిపతి
నాగభూషణ
పాములను ఆభరణాలుగా ధరించినవాడు
నటరాజు
నాట్యకళలో మహారాజు
నీలకంఠ
కంఠము నీలము రంగులో ఉన్నవాడు
నిత్యసుందరుడు
ఎల్లప్పుడూ సౌందర్యముతో ఉండువాడు
నృత్యప్రియుడు
నాట్యమును ప్రేమించువాడు
ఓంకారుడు
ఓంకార నాదమునకు మూర్తి
పాలనహరుడు
అందరిని కాపాడువాడు
పరమేశ్వరుడు
దైవాలలో అగ్రగణ్యుడు
పంచత్సరుడు
తీవ్రమైనవాడు
పరమేశ్వరుడు
దేవతలలోకెల్లా గొప్పవాడు
పరంజ్యోతి
గొప్పకాంతి
పశుపతి
జీవాల కన్నిటికి అధిపతి
పినాకిని
చేతిలో విల్లు ఉన్నవాడు
ప్రణవుడు
ఆదినాదమైన 'ఓం" శబ్దముకు మూలమైనవాడు
ప్రియభక్తుడు
భక్తులందరికీ ప్రియుడు
ప్రియదర్శనుడు
ప్రేమపూరిత దృష్టి కలవాడు
పుష్కరుడు
పోషణను ఇచ్చువాడు
పుష్పాలోచన
పుష్పములవంటి కన్నులున్నవాడు
రుద్రుడు
గర్జించువాడు
రవిలోచన
సూర్యుడిని కన్నుగా కలవాడు
సదాశివ
అతీతుడు
సనాతనుడు
శాశ్వతమైనవాడు
సర్వాచార్య
అత్యుత్తమ గురువు
సర్వశివ
శాశ్వతమైన స్వామి
సర్వతపనుడు
అందరికి గురువు
సర్వయోని
శాశ్వతమైన స్వచ్ఛత కలవాడు
సర్వేశ్వరుడు
సర్వమునకు అధిపతి
శంభో
శుభప్రదుడు
శంకర
దేవతలకందరికి అధిపతి
శాంత
స్కంద గురువు
శూలినుడు
సంతోషం అందచేసేవాడు
శ్రేష్ఠ
చంద్రునికి అధిపతి
శ్రీకంఠ
ఎల్లప్పుడూ స్వచ్ఛత ఉన్నవాడు
శృతిపక్ష
త్రిసూలం ఉన్నవాడు
స్కందగురువు
వేదాలను అందచేసినవాడు
సోమేశ్వరుడు
శుద్ధమైన శరీరం కలవాడు
సుఖద
సుఖాలను ఇచ్చువాడు
స్వయంభు
స్వయంగా సృష్టింపబడినవాడు
తేజస్విని
కాంతిని ప్రసరించువాడు
త్రిలోచన
మూడు కన్నుల వాడు
త్రిలోకపతి
మూడు లోకాలకు అధిపతి
త్రిపురారి
అసురులు సృష్టించిన మూడు లోకాలను ద్వష్టం చేసినవాడు
త్రిశూలి
త్రిశూలం చేత నున్నవాడు
ఉమాపతి
ఉమకు పతి
వాచస్పతి
వాచస్పతి వచనానికి (మాటకు) అధిపతి
వజ్రహస్త
చేతిలో వజ్రాయుధం ఉన్నవాడు
వరద
వరాలను ఇచ్చువాడు
వేదకర్త
వేదాలను సృష్టించినవాడు
వీరభద్ర
Oవిశ్వానికి రారాజు
విశాలాక్షుడు
విశాలమైన కన్నులున్నవాడు
విశ్వేశ్వరుడు
లోకాలన్నిటికి అధిపతి
విశ్వనాథుడు
లోకనాథుడు
వృషవాహనుడు
ఎద్దును వాహానము చేసుకున్నవాడు