అష్టకం అంటే సంస్కృతంలోఛందోబద్ధంగా రచించబడిన ఎనిమిది చరణాలు లేదా పద్యాలు. సాధారణంగా ఈ పద్య నిర్మాణంయతి-ప్రాసలతో కూడి ఉంటుంది.
అష్టకం అంటే సంస్కృతంలోఛందోబద్ధంగా రచించబడిన ఎనిమిది చరణాలు లేదా పద్యాలు. సాధారణంగా ఈ పద్య నిర్మాణం యతి-ప్రాసలతో కూడి ఉంటుంది. ఆదియోగి అయిన శివుడికి అంకితం చేయబడిన ఈ కీర్తనా సమాహారాన్ని ఆస్వాదించండి.
చంద్రశేఖరాష్టకం మార్కండేయ మునిచే రచించబడింది అని ప్రతీతి. మార్కండేయునికి పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడు, మృత్యు దేవుడి( కాల యముడు) బారి నుండి శివుడిచే రక్షింపబడతాడు. ఈ శ్లోకాల ద్వారా మార్కండేయుడు శివుడిని చంద్రశేఖరునిగా (చంద్రరేఖను(నెలవంక) తలపై ధరించినవాడు) స్తుతిస్తూ శరణువేడుతాడు. “ఆ చంద్రశేఖరుడు నా చెంత ఉన్నప్పుడు, యముడు మాత్రం నన్నేమి చేయగలడు?” అని తన శివభక్తినిచాటుకుంటాడు.
మానవ జీవితంలో ఒక గురువును కలిగి ఉండ డం అన్నదానికి, భారతదేశ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఆపాదించబడింది. ఈ సాంస్కృతిక సిద్ధాంతాన్నేగురు అష్టకం ఉదహరిస్తుంది.ఆది శంకరులు ఈ అష్టకం ద్వారా, మానవులు తమ జీవితంలో గొప్పవి అని భావించే వివిధ అంశాలైన కీర్తి, పదవి, ధనం, అందం, తెలివి, ప్రతిభ, సంపదలు, అద్భుతమైన కుటుంబం ఇలా ఒక జాబితాని పేర్కొంటూ, తరువాత “గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండిఏమి లాభం?” అని వాటన్నిటినీ ఆయన కొట్టి పారేస్తాడు.
శరీరం సురూపం తథా వా కళత్రం
యశఃశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం
గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం
తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్
కళత్రం ధనం పుత్ర పౌత్రాధి సర్వం
గృహం బాంధవా సర్వ మేతాధి జాతం,
గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం
తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్
షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య
కవిత్వాది గద్యం, సుపదయం కరోతి
గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం
తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్
విదేశేషు మాన్యః, స్వదేశేషు ధన్యః
సదాచార వృత్తేషు మత్తో న చాన్యః
గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం
తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్
క్షమా మండలే భూప భూపాల వృందై
సదా సేవితం యస్య పాదారవిందం
గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం
తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్
యశో మే గతమ్ దీక్షు దాన ప్రతాప
జగద్వస్తు సర్వమ్ కరే యః ప్రసాదత్
గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం
తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్
న భోగే, న యోగే, న వా వాజి రాజౌ
న కాంతా ముఖే నైవ విత్తేషు చిత్తమ్
గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం
తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్
అరణ్యే న వాసస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యె
గురోరంఘ్రి పద్మే మనస్చేన లగ్నం
తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్
గురోరష్టకమ్ యః పఠేత్ పుణ్యదేహి
యతిర్ భూపతిర్, బ్రహ్మచారీ చ గేహీ
లబేత్ వాంఛితార్థమ్ పదమ్ బ్రహ్మ సజ్ఞమ్
గురోరుక్త వాక్యే, మనో యస్య లగ్నమ్
చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికీ, గొప్ప కీర్తి, మేరుపర్వతమంత డబ్బు ఉన్నప్పటికీ గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండిఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
భార్య, సంపద, పుత్రులు, మనుమలు, మంచి ఇల్లు, బంధువులు ఉండి, గొప్ప కుటుంబములో పుట్టినప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండిఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
నీవు ఆరు అంగములలోను, నాలుగు వేదములలోను పారంగతుడవైనా కాని,గద్య, పద్య రచనలో ప్రజ్ఞావంతుడైన గాని, గురువు పాదాల వద్ద నిలపలేనిమనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
నిన్ను విదేశములో గొప్పగా, స్వదేశములో ధనవంతునిగా, సదాచార వృత్తిగలిగి జీవించువాడవని పొగడబడినా, గురువు పాదాల వద్ద నిలపలేనిమనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
నీవు ఒక దేశానికి రాజువైనా, ఎందరో రాజులు, రారాజులు నీ గొప్పతనానికీ, పాండిత్యానికీ మెచ్చి పాదాలు సేవించినను, గురువు పాదాల వద్ద నిలపలేని మనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
దానగుణం వలన నీ కీర్తి అన్ని దిశల వ్యాపించినా, ప్రపంచం మొత్తం నీ పక్షాన ఉన్నప్పటికీ,గురువు పాదాల వద్ద నిలపలేనిమనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
భోగము, యోగము, అగ్నిహోమము, స్త్రీ సుఖము, ధనము నందు నీవు శ్రద్ధచూపనప్పటికీ, గురువు పాదాల వద్ద నిలపలేనిమనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
నీ మనస్సు అడవిలో ఉన్నాఇంటిలోఉన్నా, ,,ఏదైనా బాధ్యతను నిర్వహిస్తున్నా, లేక గొప్ప ఆలోచనలలో మునిగినా ,గురువు పాదాల వద్ద నిలపలేనిమనస్సు ఉండి ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం?
వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్ర వైఢూర్యాలు ఉన్నా, ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండే సహధర్మ చారిణి తోడుగా ఉన్నా, గురువు పాదాలపై నీ మనస్సు నిలపలేకపోతే ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం? ఈ గురు అష్టకమును ఎవరు పారాయణం చేస్తారో, గురువు మాటను సావధానులై వినెదరో, గురువును శ్రద్ధతో సేవించెదరో, వారు సన్యాసైనా, రాజైనా, సజ్జనులైనా, బ్రహ్మచారు లైనా, గ్రుహస్తులైనా ఎలాంటి వారైనా వారు కోరినవి వారికి లభించి పరబ్రహ్మను చేరుకుందురు.
ఈ అష్టకం “పార్వతీ పతి/పార్వతీ ప్రాణనాథుడు” అయిన శివుని కీర్తిస్తూ చేసే స్తుతి. మునులచే, వేదాలచే కీర్తించబడువాడు, కోరిన వరాలనొసగే దేవుడు/వేల్పు, భూత ప్రేతాల మధ్య ఒకడిగా ఉండేవాడుగానూ, అతి సుందర మూర్తి గానూ వైరుధ్యభరితమైన వర్ణనలు కలిగిన వాడు,సృష్టిలోని సకల గుణాలూ మూర్తీభవించిన వాడు, సమస్తమూ తనయందు కలిగి, అంతటినీ అక్కున చేర్చుకున్న జీవ కారుణ్య మూర్తి అయిన శివునికి గల వివిధ రూపాలను ఇది వివరిస్తుంది.
కాశీపుర నాథుడు అయిన శివుని ప్రచండ స్వరూమైన కాలభైరవుని స్తుతిస్తూ ఈ అష్టకం ఉంటుంది. సద్గురు కాశీలో, భైరవీ యాతన ప్రక్రియ- అంటే, అనేక జన్మల కర్మను, ఒక్క క్షణానికి కుదించే ఒక తీక్షణమైనప్రక్రియను గురించి మాట్లాడుతూ, “శివుని భీషణమైన రూపం కాలభైరవుడు. మీరు కాశీకి వస్తే, మీకు ముక్తి కలగడం ఖాయం.మీరు అప్పటివరకూ ఎంత అథమమైన జీవితాన్ని గడిపారన్న దానితో నిమిత్తం లేదు.” అని వివరించారు.
దేవరాజసేవ్యమానపావనాఙ్ఘ్రిపఙ్కజం
వ్యాలయజ్ఞసూత్రమిన్దుశేఖరం కృపాకరమ్
నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకణ్ఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమమ్బుజాక్షమస్తశూన్యమక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
శూలటఙ్కపాశదణ్డపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాణ్డవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరమ్ సమస్తలోకవిగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞహేమకిఙ్కిణీలసత్కటిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణకేశపాశశోభితాఙ్గనిర్మలం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరఞ్జనమ్
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
అట్టహాసభిన్నపద్మజాణ్డకోశసన్తతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
భూతసఙ్ఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే
ఇంద్రుడు పూజించు పాదపద్మములు కలవాడు , పామును యజ్ఞోపవీతముగా దాల్చినవాడు , తలపై చంద్రుని అలంకరించుకున్నవాడు , దయచూపించువాడు , నారదుడు మొదలైన యోగులచే నమస్కరింపబడువాడు , దిగంబరుడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
కోటిసూర్యులవలే ప్రజ్వలించువాడు , సంసారసముద్రమును దాటించువాడు , ఉత్తముడు , నీలకంఠుడు , కోరికలు తీర్చువాడు , మూడుకన్నులు కలవాడు , యమునికేయముడైనవాడు , పద్మమువంటి కన్నులు కలవాడు , నాశము లేనివాడు , స్థిరమైనవాడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
శూలము – టంకము – పాశము – దండము అను ఆయుధములను చేతులలో ధరించినవాడు , అన్నిటికీ ఆదికారణమైనవాడు , నల్లని శరీరము కలవాడు , ఆదిదేవుడు , నాశము లేనివాడు , దోషములంటనివాడు , భయంకరమైన పరాక్రమము కలవాడు , సమర్థుడు , ఆనందంగా తాండవము చేయువాడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
భుక్తి – ముక్తులనిచ్చువాడు , ప్రశస్తమైన సుందర శరీరము కలవాడు , భక్తవత్సలుడు , స్థిరమైనవాడు , సమస్త ప్రపంచమునూ నిగ్రహించువాడు , నడుమునందు మోగుచున్న అందమైన బంగారు చిరుగంటలు ధరించినవాడైన శివ రూపమును, , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
ధర్మమును రక్షించువాడు , అధర్మమును నాశనం చేయువాడు , కర్మపాశములను విడిపించువాడు , సుఖమునిచ్చువాడు , అంతటా వ్యాపించినవాడు , బంగారు వన్నెకల కేశపాశములతో శోభిల్లు నిర్మలశరీరుడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
అందమైన పాదములందు రత్నపాదుకలను ధరించినవాడు , నిత్యుడు , అద్వితీయుడు , ఇష్టదైవము , నిరంజనుడు , యముని అహంకారముని నాశనం చేయువాడు , భయంకరమైనకోరలతో ముక్తిని ప్రసాదించువాడు, , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
బ్రహ్మాండమును ఒక్క గర్జింపుతో బద్దలు చేయువాడు , చూపుతో పాపములను తొలగించువాడు , నైపుణ్యముతో ఉగ్రముగా శాసించువాడు , అష్టసిద్ధులను ప్రసాదించువాడు , కపాలమాల ధరించినవాడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
భూతనాయకుడు , విశాలమైన కీర్తి కలిగించువాడు , కాశీలో నివసించువారి పుణ్యపాపములను శోధించువాడు , సర్వవ్యాపి , నీతిమార్గపండితుడు , పురాతనుడు , ప్రపంచరక్షకుడు , కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
మనోహరమైనది, జ్ఞ్యానమును, ముక్తిని కలిగించునది,అనేక పుణ్యములను పెంపొందించునది, శోకము, మోహము, దీనత్వము,కోపము, పాపములను నశింపచేయునది అగు కాలభైరవ అష్టకం పఠించువారు నిశ్చయముగా కాలభైరవ పాద సన్నిధిని చేరెదరు
అర్థనారీశ్వరుడు( స్త్రీత్వాన్ని తనలో సగభాగంగా చేసుకున్నవాడు), సుందరాకారుడు, ఢమ ఢమఢమరుక నాథాలంకృతుడు అయిన మహా యోగి-శివుని వివిధ రూపాలను స్తుతిస్తూసాగే గీతం (అష్టకం) ఇది.