logo
logo
తెలుగు
తెలుగు
Sadhguru Wisdom Article | Kashi – A Tower of Light and Shiva’s Luminous City

కాశీ - ఒక కాంతి స్థంభం అలాగే శివుని కాంతి నగరం

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరం అయిన కాశిని గురించిన రహస్యాలను సద్గురు వివరిస్తున్నారు. అక్కడ నివసించడానికి ఎంచుకున్న వేలాది మంది ప్రజలను ఒక ఆధ్యాత్మిక మార్గానికి తీసుకువెళ్లే ఒక ద్వారంగా పనిచేసేలా, ఈ నగరం మొత్తాన్నీ ఒక యంత్రంలా ఎలా ప్రతిష్టించారో ఆయన వివరిస్తున్నారు.

కాశీ అసలు ఎందుకు సృస్టించబడింది?

సద్గురు:కాశీ అనే పదానికి అర్థం, ప్రకాశించేది అని, లేదా మరింత కచ్చితంగా, ఒక కాంతి స్థంభం అని. మార్క్ ట్వైన్, కాశీ కధనాలలో చెప్పిన దానికన్నా ప్రాచీనమైనది అని అన్నాడు. ఎవ్వరూ కూడా ఈ స్థలం ఎంత ప్రాచీనమైనదో లెక్కగట్టలేరు. ఏథెన్స్ గురించి కనీసం ఆలోచన కూడా చేయని సమయంలోనే, కాశీ ఉంది. ప్రజల ఆలోచనలో రోమ్ నగరం ఇంకా పుట్టక మునుపే, కాశీ ఉంది. ఈజిప్టు ఉనికిలోకి రాక మునుపే కాశీ ఉంది. అది అంత ప్రాచీనమైనది, అలాగే అది ఒక నగర రూపంలో, ఒక పరికరంగా నిర్మించబడింది. ఇది అండ పిండ బ్రహ్మండాల మధ్య, ఐక్యతను తీసుకువస్తుంది. ఈ చిన్న మనిషికి ఈ విశ్వంతో ఒకటి అయ్యి, విశ్వతత్వంతో ఒకటి అవ్వడంలోని సుఖాన్నీ, పారవశ్యాన్ని, ఇంకా అందాన్నీ తెలుసుకోగల అద్భుతమైన అవకాశం ఉంది.

ఈజిప్టు ఉనికిలోకి రాక మునుపే కాశీ ఉంది. ప్రజల ఆలోచనలో రోమ్ నగరం ఇంకా పుట్టక మునుపే, కాశీ ఉంది. ఈజిప్టు ఉనికిలోకి రాక మునుపే కాశీ ఉంది.

అటువంటి సాధనాలు ఈ దేశంలో ఎన్నో ఉంటూ వచ్చాయి, కానీ, ఇటువంటి నగరాన్ని సృష్టించడం అనేది ఒక వెర్రి ఆశయం - పైగా వారు దాన్ని కొన్ని వేల ఏళ్ళ క్రితం చేసారు. అక్కడ 72,000 మందిరాలు ఉన్నాయి, ఇది మానవ శరీరంలో ఉండే నాడుల సంఖ్య. ఈ మొత్తం ప్రక్రియ కూడా, మరింత పెద్దదైన విశ్వ శరీరాన్ని తాకడం కోసం, ఒక అతి పెద్ద మానవ శరీరాన్ని తయారు చేయడం లాంటిది . ఇందువల్లే, మీరు కాశీ వెళితే, ఇక అదే చాలు అనే ఒక సంప్రదాయం మొదలయ్యింది. మీరు ఆ చోటిని విడిచి వెళ్ళాలనుకోరు, ఎందుకంటే, మీరు విశ్వ తత్వంతో సంబంధంలో ఉన్నప్పుడు, మరెక్కడికైనా వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు?

ఈ రోజు, సైన్సు అంటే అభిప్రాయం కొత్త మోడల్ ఐ ఫోను అన్నట్టు అయిపోయింది. కానీ మీరు మానవుని పరమోత్తమ శ్రేయస్సును గురించిన సైన్సు గురించి చూడాలి అనుకుంటే, కాశీ చూడాల్సిందే. మీరు ఇంతకన్నా గొప్పగా ఏమాత్రం చేయలేరు. ఇది ఒక మతమో, లేదా నమ్మకంతో కూడిన సిద్దంతమో కాదు. అతీతమైన దాన్ని అందుబాటులోకి తెచ్చుకునే విషయంలో మానవుని తెలివితేటలకు నిదర్శనం ఇది. ఇది ఈ గ్రహం మీద చేయబడిన అత్యంత గొప్ప విషయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

కాశీ యొక్క శాస్త్రం

సద్గురు:మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ శరీరం పరిమితులను తెలుసుకోవడం. మీరు నిన్న పుట్టారు, రేపు పూడ్చబడతారు. జీవించడానికి మీకు వున్నది ఈరోజు మాత్రమే. ఉనికి స్వభావమే ఇది. మరణం వచ్చే లోపు జీవం వికసించాలి. కాబట్టి, మనం, ఈ ప్రయోజనం కోసం ఉపయోగించగల ప్రతి యంత్రాంన్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసాము. ఇలాంటి యంత్రాలు చాలా ఉన్నాయి. దురదృష్టవశాత్తు, వాటిలో చాలా వరకు విచ్ఛిన్నమయ్యాయి- కాశీతో సహా. కానీ కాశీలోని శక్తీ భాగం ఇంకా చాలా వరకూ సజీవంగానే ఉంది. ఇది ఎందుకంటే, ధ్యానలింగతో సహా, మనం ఇటువంటి ప్రదేశాలను ప్రతిష్ట చేసినప్పుడు, ఎప్పుడూ కూడా భౌతిక భాగం అనేది కేవలం ఒక పరంజా (తాత్కాలిక నిర్మాణం)లా మాత్రమే ఉంటుంది. సాధాణంగా, కధనం ఏమని చెబుతుందంటే, కాశీ ఉన్నది భూమి మీద కాదు, అది శివుని త్రిశూలం పైన ఉన్నది అని చెబుతుంది.

సాధారణంగా, కధనం ఏమని చెబుతుందంటే,కాశీ ఉన్నది భూమి మీద కాదు, అది శివుని త్రిశూలం పైన ఉన్నది అని చెబుతుంది.

నా అనుభూతిలో, నేను చూసింది ఏంటంటే, కాశీ అసలైన నిర్మాణం భూమికి 33 అడుగుల ఎత్తులో ఉంది. మనకి ఏ మాత్రం బుద్ధి వున్నా, మనం 33 అడుగులను దాటి ఏమీ కట్టి ఉండకూడదు. కానీ మనం కట్టాము, ఎందుకంటే బుద్ధి అనేది ప్రపంచంలో ఎప్పుడూ చాలా అరుదుగా దొరికే వనరు. అలాగే, రేఖాగణిత లెక్కల ప్రకారం, శక్తి నిర్మాణం 7,200 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఇందువల్లే వాళ్ళు దాన్ని “కాంతి స్తంభం” అని అన్నారు, ఎందుకంటే చూడగలిగే కళ్ళు ఉన్న వాళ్ళు, అది ఎంతో ఎత్తైన నిర్మాణంగా ఉండడాన్ని చూసారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషి తనలో సాధించగల దాన్ని, కొన్ని వేల సంవత్సరాలుగా అనేక మంది పొందిన అవగాహన యొక్క సారం నుండి వచ్చిన ఒక వ్యవస్థీకృత యంత్రాంగం ద్వారా సాధించడం. మీకు మీరే (పరానికి సంబంధించిన)విషయాలను తెలుసుకోవాలంటే, అది మళ్ళీ మొదటి నుండి చక్రాన్ని కనుగొనడం వంటిది, అలాగే అనవసరంగా, చాలా బాధాకరమైన ప్రక్రియలు అన్నింటి ద్వారా మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మీరు ఇతరుల అవగాహన నుండి తెలుసుకోవాలి అంటే, అందుకు మీకు వినమ్రత ఉండి తీరాలి.

ఎంతో మందిని రవాణా చేయగలగడం కోసం ఈ ఏర్పాటుని చేసారు. ప్రజలు వచ్చి అన్ని రకాల పద్ధతులు ఇంకా యంత్రాలను ఏర్పాటు చేశారు. ఒకానొక సమయంలో 26,000 కు పైగా మందిరాలు ఉన్నాయి - వాటిలో ఒక మనిషి పరమావధిని పొందడం ఎలా అన్నదాని గురించి, వాటిలో ప్రతి ఒక్క దానికీ తనదైన విధానం ఉంది. ఈ 26,000 మందిరాల చుట్టూ ఉపగ్రహాలు వచ్చాయి, తద్వారా మందిరం యొక్క అనేక కోణాలు(angles of the temple) ఒక సొంత చిన్న మందిరాలుగా మారిపోయాయి - కాబట్టి, కాశీ అనబడే ఈ యంత్రాంగం పూర్తి వైభవంతో ఉన్నప్పుడు, ఆ సంఖ్య 72వేలకు చేరుకుంది. ఇది ఒక్క రాత్రిలో జరగలేదు. ప్రాథమిక నిర్మాణం ఏ సమయంలో జరిగిందో ఎవరికీ తెలీదు. ఆఖరికి 40,000 ఏళ్ళ నాటి వాడిగా చెప్పబడే సునీరుడు కూడా దేన్నో వెతుకుతూ ఇక్కడికి వచ్చాడని అంటారు. అప్పటికే, అది ఒక కిటకిట లాడుతున్న నగరం.

ప్రాచీనత విషయానికొస్తే, అది ఎంత పాతదో ఎవరికీ తెలియదు. శివుడు ఇక్కడకు రావాలని అనుకున్నాడు, ఎందుకంటే ఈ నగరం చాలా అందంగా ఉంది కాబట్టి. అతను రాకమునుపే, అప్పటికే ఇది ఒక అద్భుతమైన నగరంగా ఉండేది. కేవలం కొన్ని సంవత్సరాల క్రితమే, మూడు పొరల ఆలయాలను కనుగొన్నారు, అవి చాలా కాలం పాటు మూసి ఉంచబడ్డాయి. దీని అర్థం, కాల క్రమేణా ఈ నగరం మునిగిపోతూ వచ్చింది, ఎన్నో సార్లు మళ్ళీ మళ్ళీ దాన్ని ఒకదానిపై ఒకటి కట్టారు. ఈ నగరానికి మూడు నుండి ఐదు పొరలు ఉన్నాయి, ఎందుకంటే భూమి కాల క్రమేణా తనను తాను రీసైకిల్ చేసుకుంటుంది.

శివుడు కాశీలో నివసించాడని చెప్పే కథనం

సద్గురు: కాశీని గురించిన కధనం శివుడు ఇక్కడ నివసించాడు అనే ప్రాథమిక అంశాన్ని తెలుపుతుంది. ఇది అతని శీతాకాలపు నివాస స్థలం. అతను హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో ఒక సన్యాసిగా జీవించాడు, కానీ అతను ఒక యువరాణిని వివాహం చేసుకున్నప్పుడు, రాజీ పడాల్సి వచ్చింది. దయాహృదయుడు అయిన ఆయన, (కొండ ప్రాంతం నుండి) సమతుల ప్రదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో, కాశీ అనేది ఎంతో అద్భుతంగా నిర్మించబడిన నగరం.

“నేను రాజు అవ్వాలి అంటే శివుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఎందుకంటే అతను ఇక్కడ ఉంటే, నేను రాజుగా ఉండడం అనేది పనిచేయదు. ప్రజలు అతని చుట్టూ చేరతారు.”

ఒక అందమైన కథ ఉంది. శివుడు కొన్ని రాజకీయ కారణాల వల్ల కాశీని వదిలి వెళ్ళాడు. సరిగ్గా నిర్వహించకపోతే కాశీ తన వైభవాన్ని కోల్పోతుందని దేవుళ్ళు భయపడ్డారు. కాబట్టి వాళ్ళు దివోదసను రాజు కమ్మని అడిగారు. కానీ అతను ఒక షరతు పెట్టాడు, “నేను రాజు అవ్వాలి అంటే శివుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఎందుకంటే అతను ఇక్కడ ఉంటే, నేను రాజుగా ఉండడం అనేది పనిచేయదు. ప్రజలు అతని చుట్టూ చేరతారు.” కాబట్టి శివుడు పార్వతితో సహా, మందర పర్వతానికి వెళ్ళాడు, కానీ అతనికి అక్కడ ఉండటం ఇష్టం లేదు. అతను మళ్లీ కాశికి రావాలని అనుకున్నాడు, కాబట్టి ముందుగా తన దూతలను పంపాడు. వాళ్ళు వెళ్లారు, వాళ్ళకి ఆ పట్టణం ఎంతగా నచ్చిందంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లలేదు.

అప్పుడు శివుడు 64 దేవకన్యలను పంపించాడు. అతను, “ఎలాగోలా రాజు దారి తప్పేలా చేయండి. ఒకసారి మనం అతనిలో లోపాన్ని కనుగొనగలిగితే, మనం అతన్ని వెనక్కి పంపొచ్చు, అప్పుడు నేను తిరిగి వస్తాను” అన్నాడు. వాళ్ళు వచ్చి సమాజం మొత్తంలో కలిసిపోయారు ఎలాగోలా దాన్ని దారి మళ్లించాలి అని. కానీ వారికి ఆ స్థలం ఎంతగా నచ్చిందంటే, వచ్చిన పని మర్చిపోయి అక్కడే స్థిరపడిపోయారు.

అప్పుడు అతను సూర్యదేవుని పంపాడు. అతను కూడా వచ్చి- కాశీలో ఉన్న అన్ని ఆదిత్య ఆలయాలు అతని కోసమే - అతనికి అది ఎంతగా నచ్చిందంటే అతను తిరిగి వెళ్లలేదు. లక్ష్యం మీద తనకున్న అంకితభావం కన్నా ఆ నగరం మీద తనకున్న ప్రేమ అధికమైనందువల్ల శివుని ఆశయాన్ని నెరవేర్చలేక పోయినందుకు, సూర్యదేవునికి సిగ్గు ఇంకా భయం కలిగాయి, కాబట్టి అతను దక్షిణం వైపుకి తిరిగి ఒకవైపుకి వాలుగా ఉండి అక్కడ స్థిరపడి పోయాడు.

అప్పుడు శివుడు బ్రహ్మని పంపాడు. తను కూడా దానిని ఎంతగానో ఇష్టపడి తిరిగి వెనక్కి వెళ్లలేదు. అప్పుడు శివుడు, “నేను వీళ్ళల్లో ఎవరినీ నమ్మలేను” అని, తన గణంలో తనకి అత్యంత విశ్వసనీయులైన ఇద్దరు గణాలను పంపాడు. వాళ్ళు ఇద్దరు వచ్చారు -వాళ్లు శివుడిని మరచిపోలేరు, వాళ్లు అతని మనుషులు- కానీ వాళ్లకి ఆ స్థలం ఎంతగానో నచ్చి ఇలా అనుకున్నారు, “శివుడు నివసించాల్సిన ఒకే ఒక్క ప్రదేశం ఇది, మందార పర్వతం కాదు.” ఇక వాళ్ళు ఆ నగరానికి ద్వారపాలకులు అయ్యారు.

అప్పుడు శివుడు మరో ఇద్దరిని పంపాడు. గణేశుడు ఇంకా మరొకరు, వాళ్ళు వచ్చి ఈ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాళ్లు నగరాన్ని సిద్ధం చేయడం ఇంకా నగర భద్రతను చూసుకోవడం మొదలుపెట్టారు. వాళ్లు ఇలా అనుకున్నారు, “ఎలాగు శివుడు రావాల్సిందే, వెనక్కి వెళ్లి ఉపయోగమేముంది”. దివోదాసకి ముక్తి అనే ఆశని చూపించారు. అతను ఎటువంటి అవినీతికి లొంగలేదు, కానీ ముక్తిని ఆశించి దానిని తీసుకున్నాడు. అప్పుడు శివుడు తిరిగి వచ్చాడు.

ఇవన్నీ ప్రజలు ఇక్కడ ఉండటం కోసం ఎంతగా తపించారు అన్న దాన్ని తెలిపే కథలు. సుఖసౌఖ్యాలు వల్ల కాదు కానీ, ఈ నగరం అందించే (పరమోత్తమ)అవకాశాల వల్ల. ఈ నగరం కేవలం ఒక నివాసంగా ఉండే స్థలం మాత్రమే కాదు, అది అన్ని పరిమితులను దాటి వెళ్ళే ఒక ప్రక్రియ. ఈ చిన్ని జీవి అతి పెద్దదైన విశ్వ అనుబంధం లోకి రావడం కోసం స్థాపించబడిన ఒక ప్రక్రియ.

కాశీని వారణాసి అని ఎందుకు అంటారు?

సద్గురు:వారణాసి, బనారస్ లేదా కాశి - దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇది ఈ గ్రహం మీద అత్యంత ప్రాచీనమైన నగరం. మానవ జ్ఞాపకం ఎంత వెనక్కి వెళ్ళినా సరే, వాళ్ళు వరుణ ఇంకా అసి అనే రెండు నదుల మధ్య నిర్మింపబడిన గొప్ప నగరమైన వారణాసిని గురించి మాట్లాడతారు.

కాశీ విశ్వనాథ ఆలయం

సద్గురు: ఈ దేశంలో, ప్రజలు, కేవలం ఈ నగరంలోకి అడుగు పెడితే చాలు ముక్తి లభిస్తుంది అని నమ్మే ఒక సమయం ఉండేది. ఎందుకంటే అది అంతటి శక్తివంతమైన ప్రదేశంగా ఉండేది. అన్నింటినీ మించి ఈ నగరంలోని అతి పెద్ద విశేషం విశ్వనాథ ఆలయం. ఈ ఆలయం చాలాకాలం క్రితమే నాశనం చేయబడింది, కానీ దాన్ని స్వయంగా ఆదియోగే ప్రతిష్టించారు అంటారు. గత రెండు శతాబ్దాల్లో, మరీ ముఖ్యంగా గత ఆరు నుండి ఏడు శతాబ్దాలలో, కాశీ మూడుసార్లు నేలమట్టం చేయబడింది. కాశీలో 26000 దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇవాళ కేవలం మూడు వేలు మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే అవి ఆక్రమణల సమయంలో, ఒక వ్యూహం ప్రకారం పడగొట్టబడ్డాయి. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షించింది అంటే, కాశీ యొక్క ముఖ్య భాగమైన కాశీ విశ్వనాథ దేవాలయం, ఎంతో అద్భుతమైన ప్రదేశం అయి ఉండాలి. అది పూర్తి వైభవంతో ఉన్న సమయంలో మనం సజీవంగా లేకపోవటం అనేది దురదృష్టం. దాన్ని మూడు సార్లు పడగొట్టడం జరిగింది, వాళ్లకు చేతనైన విధానంలో మళ్లీ దాన్ని మూడు సార్లు కట్టారు.

ఆ తర్వాత ఔరంగజేబు వచ్చినప్పుడు, అతను దీన్ని పడగొడితే వీళ్ళు దాన్ని మళ్లీ కడతారు, ఎందుకంటే ఇది ఎక్కడో ఉన్న ఒకరి నాయకత్వం కింద నడిచే మతం కాదు; ఇది ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఇంకా హృదయాల్లో సజీవంగా ఉండే విషయం. అది ప్రచారం చేసిన విషయం కాదు, ఆ విధమైన బంధాన్ని ప్రజలు ఏర్పరుచుకున్నారు. అది ఒక నమ్మకం చేత నడపబడేది కాదు, అది ఒక గాఢమైన అనుభూతి ఇంకా విశ్వ ఉనికితో ఒక సంబంధం కలిగి ఉండటం చేత నడపబడేది. అతను ఇది గమనించినప్పుడు, అతను కాశీ విశ్వనాథ ఆలయంలోని ప్రధాన ప్రదేశంలో ఒక మసీదును కట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను ఈ ఆలయం మొత్తాన్ని పడగొట్టాడు, కానీ ఈ సంస్కృతిలోని ప్రజలకు, ఒక హెచ్చరికగా ఇంకా ఆలయానికి చేసిన వినాశనాన్ని సరి చేయలేరు అని చెప్పే ఒక గుణపాఠంగా ఒక చిన్న భాగాన్ని మాత్రం కూలగొట్టకుండా వదిలేశాడు. ప్రస్తుతం కాశీ విశ్వనాథ లింగం ఇక్కడ ఉంది. అది ఆలయ ప్రాంగణానికి వెలుపల ఉంది. ఇంతకు ముందు అది విశ్వేశ్వర గర్భగుడి వద్ద ఉండేది. ఇప్పుడు అది మసీదు యొక్క మధ్య భాగం, అది మొత్తం మధ్య భాగాన్ని ఉత్తరం నుండి దక్షిణం వరకు వ్యాపించి ఉంది.

లింగాన్ని పెలికితీసి, పడేసేటప్పుడు, వాళ్ళు దాన్ని తిరిగి కనిపెట్టలేని ప్రదేశంలో పడేయాలి అని అనుకున్నారు. వాళ్ళు దాన్ని ఊరికే పడేశారో లేదా దాన్ని విరగ్గొట్టి పడేసారో మనకు తెలీదు. కొందరు ఏమంటారంటే, రెండు ముక్కలు ఉన్నాయి అని, ప్రజలు తమ ప్రేమ ఇంకా భావోద్వేగం కారణంగా వాటిని ఒకటిగా చేయాలని ప్రయత్నించారు అని అంటారు. అలాగే ఒక కథనం ఉంది. అందులో “గ్యాన్ వాపి” అనే బావి ఉంటుంది. గ్యాన్ వాపి అంటే ఒక జ్ఞానంతో నిండిన బావి అని. వాళ్లు ఏమంటారంటే, అది పూర్తిగా నాశనం కాకుండా ఉండటం కోసం, ప్రజలు ఆ లింగాన్ని ఈ బావిలో దాచి భద్రపరిచారు అని అంటారు. ఇక పరిస్థితులు సద్దుమణిగాక, వచ్చే దక్షిణవైపు మూలన ఎక్కడో స్థాపించారు అని అంటారు. అది ఈ లింగమేనా అనేది నాకు కూడా తెలియదు. ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడం కోసం వారు దీనిని భర్తీ చేయాలనుకునే అవకాశం ఉంది, లేకపోతే, అది పోయిందని ప్రజలు మానసికంగా విచ్ఛిన్నం అయిపోతారు. ఎవరో దానిని మరొకదానితో భర్తీ చేసి ఉండవచ్చు, లేదా బహుశా వాళ్ళు దాన్ని నిజంగానే భద్రపరిచి ఉండవచ్చు. బహుశా అది విరిగిపోయి ఉండవచ్చు, వాళ్ళు దాన్ని తిరిగి ఒకటిగా చేసి ఉండవచ్చు, లేదా వాళ్ళు ఒక కొత్త లింగాన్ని తయారు చేసి ఉండవచ్చు. మనకి తెలియదు.

సప్తర్షి హారతి:

Sadhguru: సద్గురు: మేము కాశీకి వెళ్ళినప్పుడు, విశ్వనాథ ఆలయంలో సాయంత్రం సమయంలో జరిగే ఒక ప్రక్రియను చూసి నేను నివ్వెర పోయాను. ఈ ప్రక్రియ ఆదియోగి మొదటి ఏడు శిష్యులు అయిన సప్తర్షుల గురించి. సప్తర్షులను బయటకు వెళ్లి బోధించమని అడిగినప్పుడు, వాళ్ళు వెళుతూ శివుడిని, “మేము మీకు దూరంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా పూజించాలి, మీ సమక్షాన్ని ఎలా పొందగలము?” అని అడిగారు. అందుకు ఆయన వారికి ఒక ప్రక్రియను ఇచ్చి, “మీరు ఎక్కడ ఉన్నా సరే ఇది చేయండి, నేను అక్కడ మీతో ఉంటాను” అన్నాడు. దీన్ని ఈ రోజుకి కూడా విశ్వనాధ్ ఆలయంలో సజీవంగా ఉంచారు. దీనిని సప్తర్షి హారతి అంటారు. అది ఒక సుదీర్ఘమైన వ్యవస్థ. దాన్ని ఇప్పుడు చేస్తున్న ప్రజలకు దాని గురించి ఏమీ తెలీదు, కానీ వారు కేవలం ఆ ప్రక్రియను సజీవంగా ఉంచుతున్నారు.

ఈ పూజారులకు తమ సొంత శక్తి గురించి లేదా ఏమి చేయవచ్చు అన్న దాని గురించి ఏమీ తెలీదు, కానీ వారు ఆ ప్రక్రియకు కట్టుబడి ఉన్నారు, అలాగే అక్కడ అంత గొప్ప విషయాన్ని ఆవిష్కరించారు. అది పూర్తిగా అద్భుతంగా ఉంది.

అది ఒక సెల్‌ఫోన్ వాడడం లాంటిది - మీకు వాస్తవానికి అది ఎలా పని చేస్తుందో తెలియదు, కానీ మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మాత్రం నేర్చుకుంటారు, అది మీకు పని చేస్తుంది. ఇదే విధంగా, ఈ ప్రజలకు అందులోని సాంకేతికత తెలియదు, కానీ అది జరిగేలా ఎలా చేయాలో వాళ్లకు తెలుసు. వారు ఆ వ్యవస్థను ఉన్నది ఉన్నట్టుగా ఉంచారు. సాయంత్రం పూట ఒక గంటన్నర పాటు ఈ ప్రక్రియను చేశారు. వాళ్ళు రాశులు రాశులుగా శక్తిని నిర్మించారు. నేను అక్కడ కూర్చుని ఈ పూజారులు ఇది చేయడాన్ని నమ్మలేక పోయాను. వాళ్లు ఇది చేయగలుగుతారని నేను ఎప్పుడూ ఊహించని కూడా ఊహించి ఉండను. దీన్నే ఈశాలో చేయాలి అంటే మేము ఎన్నో విషయాలు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మాకు అటువంటి ప్రక్రియలు లేవు. మేము ప్రజలను అటువంటి పరిస్థితుల్లోకి అభివృద్ధి చేసి, ఒక శక్తి పోగును తయారు చేస్తాము, తద్వారా ప్రతి ఒక్కరు దాన్ని అనుభూతి చెందగలుగుతారు. ఈ పూజారులకు తమ సొంత శక్తి గురించి లేదా ఏమి చేయవచ్చు అన్న దాని గురించి ఏమీ తెలీదు, కానీ వారు ఆ ప్రక్రియకు కట్టుబడి ఉన్నారు, అలాగే అక్కడ అంత గొప్ప విషయాన్ని ఆవిష్కరించారు. అది పూర్తిగా అద్భుతంగా ఉంది.

Watch what happened when Sadhguru invited the Kashi Vishwanath priests to perform the powerful Saptarishi Arati at Yogeshwar Linga in the presence of Adiyogi at Isha Yoga Center, Coimbatore.

సౌండ్స్ ఆఫ్ ఈశా వారిచే విశ్వనాధాష్టకం

సౌండ్స్ ఆఫ్ ఈశా వారు అందిస్తున్న ఈ మంత్రముగ్ధమైన విశ్వనాధాష్టకాన్ని వినండి.

 

సద్గురుతో కాశీ క్రమ

కాశీ క్రమ అనేది, పవిత్ర నగరం కాశీ గుండా, ఈశా సేక్రేడ్ వాక్స్ నిర్వహించే ఒక తీర్థయాత్ర. ఈ తీర్థయాత్రలో భాగంగా పాల్గొనేవారు, ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తారు ఇంకా కాశీలో సద్గురుతో కలిసి ఒక ప్రత్యేకమైన సత్సంగంలో పాల్గొనే ఒక అరుదైన భాగ్యాన్ని కలిగి ఉంటారు.

కాశీ క్రామ గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..

కాశి కర్వట్

సద్గురు::మీరు ముక్తి కోసం ప్రయత్నిస్తూ ఉన్నంత కాలం, మీరు ఏమి చేస్తున్నారు ఇంకా ఎలా చేస్తున్నారు అన్నది ముఖ్యం కాదు. మీ ప్రాథమిక ధ్యేయం లయమవటమయినప్పుడు మీరు ఎలా చేస్తున్నారు అన్నది ముఖ్యం కాదు. కాశీలో ఒక దేవాలయం ఉంది, మీరు ముక్తిని పొందాలి అనుకుంటే, అక్కడ చెక్కని కోసే రంపం ఒకటి ఉంటుంది, దాన్ని ఆ ప్రాంతీయ భాషలో కర్వట్ అంటారు. ఇప్పటికీ కూడా ఆ లింగాన్ని కర్వట్ లింగం అంటారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుండి ప్రయాణం చేసి వచ్చి, కర్వట్‌ని కోరుకునే వారు, అంటే వాళ్ళు ఆ దేవాలయంలో లింగానికి ఎదురుగా రంపంతో రెండు ముక్కలుగా కోయబడాలని కోరుకునేవారు. ఆ లింగాన్ని ఆ ప్రయోజనం కోసమే తయారు చేశారు. వాళ్ళు ఒక రంపాన్ని తీసుకుని, దాన్ని మనిషి తలపై నుండి రెండుగా కోయటానికి ఉపయోగించేవారు. మొదట్లో, సహస్రాన్ని తెరవడం కోసం ఒక పాయింట్ వరకు కోయడం కోసం మాత్రమే దీన్ని చేసేవారు. అది, జీవం ముక్తిని పొందటం కోసం ఏమి చేయాలో తెలిసిన ప్రజలచే ఎంతో జాగ్రత్తగా చేయబడేది. అంటే, ఇది, మీరు అనే రెండు పార్శ్వాలను విడివిడిగా చేసి మిమ్మల్ని లోపల నుండి విముక్తి చేయడం అన్నమాట. అలా చేయాలని ఇప్పుడు ప్రయత్నించకండి! దాన్ని చాలా కాలంగా నిషేధించారు. నేను మీకు ప్రజలు ఎంత దూరం వెళ్ళటానికి సుముఖంగా ఉన్నారు అన్న దాన్ని చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే ముక్తిని అంత ముఖ్యమైనదిగా చూసే వారు - మీరు ఈ జన్మలోనే ముక్తిని పొందాలి.

వాళ్ళు ఒక రంపాన్ని తీసుకుని, దాన్ని మనిషి తలపై నుండి రెండుగా కోయటానికి ఉపయోగించేవారు. మొదట్లో, సహస్రాన్ని తెరవడం కోసం ఒక పాయింట్ వరకు కోయడం కోసం మాత్రమే దీన్ని చేసేవారు.

కాశి కర్వట్ గురించి ప్రస్తావించిన సాధువులు ఇంకా సన్యాసులు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకి మీరాబాయి ఇంకా సూర్దాస్. మీరాబాయి కృష్ణుడిని ఇలా అని భయపెడుతుంది, “నువ్వు రాకపోతే నేను కాశి కర్వట్ కి వెళతాను” అని. ఆమె అతన్ని భయపెడుతుంది, “నువ్వు నాకు ప్రత్యక్షం కాకపోతే నేను వెళ్ళి రంపంతో నన్ను నేను కోసుకుంటాను” అని. బ్రిటిష్ వారి పాలన సమయంలో వాళ్ళు దాన్ని నిషేధించారు. కానీ ప్రజలు వెళ్లి అక్కడ ఆ రంపం మీద పడి దండం పెడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఆ రంపాన్ని అక్కడ నుండి తీసేసారు. అది ప్రస్తుతం ఏదో ఒక బ్రిటిష్ మ్యూజియంలో ఉందని అంటారు.

పంచ క్రోషి యాత్ర

పంచ క్రోషి యాత్ర అనేది పవిత్రమైన కాశీ మండలం చుట్టూ, తీర్థయాత్రలు చేసే వారిచే చేయబడే ఒక ముఖ్యమైన పాదయాత్ర.

మార్గమధ్యంలో 108 దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాలకు తీర్థయాత్రలు చేసేవారు కాలినడకన వెళతారు. ఐదు ముఖ్యమైన గ్రామాలు ఉన్నాయి. వాటిలో ప్రజలు సేద తీరవచ్చు ఇంకా రాత్రికి బస చేయవచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజులచే నిర్మించబడిన సత్రాలు ఈనాటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

పంచక్రోషి మార్గంలో సవ్యదిశలో ప్రయాణిస్తున్నప్పుడు, అన్ని దేవాలయాలు రహదారికి కుడి వైపున ఉన్నాయి, ఇది పంచక్రోషి గోళం యొక్క బాహ్య పరిమితిని సూచిస్తుంది.

పంచక్రోషి యాత్ర, మణికర్ణికా ఘాట్ వద్ద గంగా నదిలో మునకతో మొదలవుతుంది. ఈ మార్గంలో వచ్చే మొదటి ముఖ్యమైన ఆలయం ఆధికర్మధేశ్వర్ ఆలయం. ఇక్కడ లింగాన్ని కర్మధేశ్వర్ ముని ప్రతిష్ట చేశారు.

కాశీఖండం పురాణంలో, యక్షులు ఇంకా గణాలు, ఎప్పుడూ కూడా చెట్లమీద ఇంకా నదీతీరాన నివసించేవారని చెబుతారు. ఈ మార్గంలో వారి దేవాలయాలు కూడా అదే విధంగా స్థాపించబడి ఉన్నాయి.

ఈ మార్గంలో రెండో దేవాలయం భీమచండి మందిరం. ఈ దుర్గా ఆలయం దేవి ఉపాసకుడు అయిన ఒక గంధర్వునిచే స్థాపించబడింది అని అంటారు. ఆమె తన అనుగ్రహాన్ని కోరుకునే భక్తులు అందరినీ తన సొంత పిల్లలను కాపాడినట్లు కాపాడుతుంది, ఇంకా వారిని ఆరోగ్యం ఇంకా శ్రేయస్సులతో దీవిస్తుంది.

మూడవది దేహలి వినాయక ఆలయం. ఈ దేవాలయం నేరుగా కాశీ విశ్వనాధ దేవాలయానికి వరుస క్రమములో ఉంటుంది. ఈ ఆలయం సరిగ్గా ఈ యాత్రలో సగం దూరంలో ఉంటుంది. కాశీలో ప్రవేశించడానికి ముందు శ్రీరామ ప్రభువులు ఇక్కడ ధ్యానం చేశారు అని అంటారు.

నాలుగవది రామేశ్వరం దేవాలయం. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న రామేశ్వరం దేవాలయానికి ప్రతిరూపం అని అంటారు. ఇది వరుణానది తీరాన ఉంది ఇంకా ఇది యాత్రలో అత్యంత ఉత్తరాన ఉన్న ప్రదేశాన్ని సూచిస్తుంది.

గ్రంథాలలో ఏమని చెబుతారు అంటే కాశీ మండలాల్లో ఉన్న లింగాలు అన్ని నలభై రెండు రకాల కిందకి వస్తాయి అని అంటారు. కపిలధార దేవాలయంలో నలభై రెండు రకాలూ ఒకే రూపంలో ఉన్నాయి. పసపని వినాయక దేవాలయం ఇంకా కపిలధార ఆలయాలతో పంచ క్రోషి యాత్ర ముగుస్తుంది.

కాలభైరవ

సద్గురు: భైరవ అంటే మిమ్మల్ని భయానికి అతీతంగా తీసుకువెళ్ళేవాడు. కాలభైరవ అంటే, కాలాన్ని గురించిన భయం - మరణాన్ని గురించిన భయం కాదు. ఎందుకంటే భయానికి మూలాధారం కాలం. కాబట్టి మీకు అపరిమితమైన కాలం ఉంటే, ఇక అది విషయమే కాదు, అవునా? మీరు కాలాన్ని గురించిన భయం నుండి విడుదల అయితే, మీరు భయం నుండి పూర్తిగా విడుదల అయినట్టే.

ఏదైతే కొన్ని జన్మల సమయం పడుతుందో అది మీకు ఒక మైక్రో సెకను సమయంలో జరుగుతుంది, కాకపోతే మీరు తట్టుకోలేనంత తీవ్రతతో జరుగుతుంది.

కాలభైరవ అనేది శివుని భయానక రూపం. మీరు ఎటువంటి బద్ధకస్త ప్రాణి అయినా సరే, మీరు గనక కాశీకి వస్తే మీకు ముక్తి లభించడం తథ్యం అన్నట్టు ఉండేది. కాబట్టి బద్ధకస్త ప్రాణులు అన్నీ కూడా రావడం మొదలుపెట్టాయి, ఎందుకంటే వాళ్ళు చెడుగా జీవించినా, గొప్పగా మరణించాలని కోరుకుంటున్నారు. కాబట్టి “ఏదో ఒక చెకింగ్ అనేది ఉండాలి” అని, శివుడు కాలభైరవ రూపాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే భైరవి యాతన అనేదాన్ని జరిపించడం కోసం. దాని అర్థం మరణ సమయం ఆసన్నమైనప్పుడు, ఇప్పటిదాకా మీరు ఏదైతే చేశారో, మీ జన్మ జన్మలు ఒక్క క్షణంలో గొప్ప తీక్షణతతో మీ ముందు అలా కదలాడుతాయి. ఇంక మీకు జరగాల్సిన సుఖాలూ ఇంకా దుఃఖాలు అవన్నీ మీకు జరుగుతాయి. ఏదైతే కొన్ని జన్మల సమయం పడుతుందో అది మీకు ఒక మైక్రో సెకను సమయంలో జరుగుతుంది, కాకపోతే మీరు తట్టుకోలేనంత తీక్షణతతో జరుగుతుంది. యాతాన అంటే అత్యంత ఘాడమైన దుఃఖం. అది మీకు నరకంలో జరిగేది. కానీ ఆయన మీకు అది ఇక్కడ జరిగేలా చేస్తాడు.

మీరు అటువంటి పనిని చేయాలనుకున్నప్పుడు, దానికి తగిన రూపం కావాలి. కాబట్టి శివుడు, మీకోసం భైరవి యాతన జరిపించడం కోసం సరైన రూపాన్ని ధరిస్తాడు. అతను ఎంత గొప్ప బాధని సృష్టిస్తాడు అంటే మీరు అది సాధ్యపడుతుందని ఊహించను కూడా ఊహించలేరు. కానీ కేవలం ఒక్క క్షణకాలం పాటు మాత్రమే, తద్వారా ఇక ఆ తర్వాత మీలో గతానికి సంబంధించినది ఏదీ మిగిలి ఉండదు.

కాశీలోని కాలభైరవ ఆలయం

ఎనిమిది కాల భైరవ ఆలయాలు, మొత్తం మండలాన్ని రక్షిస్తూ కాశీ యొక్క ఎనిమిది దిశలలో ఉన్నాయి. అవి: ఉన్మత్ భైరవ, క్రోధన భైరవ, కపాల భైరవ, అసితంగ భైరవ, చంద భైరవ, రురు భైరవ, భిషన భైరవ ఇంకా సంహార భైరవ.

కాశీ ఖండ పురాణంలో కాశి క్షేత్రం అనేది శివుని త్రిశూలం పైన నిలబడి ఉంటుందని, అలాగే మూడు ప్రధాన దేవాలయాలు త్రిశూలం యొక్క 3 సూలాలనీ చెప్పబడుతుంది. ఈ మూడు ప్రధాన దేవాలయాలు, మండలానికి ఊతంగా లేదా ఆధారంగా పనిచేస్తాయి. అవి: ఉత్తరాన ఓంకారేశ్వర, మధ్యలో విశ్వేశ్వర ఇంకా దక్షిణాన కేదారేశ్వర. ప్రతి ఆలయం తన స్వంత ఖండం లేదా ప్రభావ గోళాన్ని ఏర్పరుచుకుంటుంది.

కాశీలో చేసే కర్మల ప్రాముఖ్యత

సద్గురు:: కాశి ఆచారాలతో నిండిపోయి ఉంటుంది. అది కర్మలకు కేంద్ర బిందువు. కాని అంతర్గతంగా చేయడం అనేది ఒక కచ్చితమైన విధానం, దానికి సమానమైనవి ఏవీ లేవు - చేయడానికి అది ఉత్తమ మైన మార్గం. ఒకసారి మీకు ఆధ్యాత్మిక ప్రక్రియలోకి దీక్ష ఇచ్చాక మీరు ఆధారపడాల్సింది దాని మీద. కానీ ఈ ఆచారాలు అనేవి ప్రజల కోసం. వారికి తమతో తాము అంతర్గతంగా ఏమి, ఎలా చేసుకోవాలో తెలియదు, కానీ వారికి తమ గురించి తాము ఏదో ఒకటి చేసుకోవాలి అని మాత్రం తెలుసు. ఇటువంటి పరిస్థితిలో, కాశీ లాంటి ఉపకరణం, ఇంకా ఈ ఉపకరణంతో పాటు వచ్చే సంక్లిష్టమైన తంతులు ఎంతో ఉపయోగకరమైనవి, ఎందుకంటే అవి సామూహికంగా నిర్వహించబడి సామాన్య ప్రజలకు ఉపయోగపడుతాయి.

గంగా హారతి

సద్గురు:: మన మనుగడకు నీరు అనేది ఎంతో ముఖ్యమైన మూలకం. మన శరీరంలో 70 శాతం కేవలం నీరు మాత్రమే. ఒకరోజు మీకు తాగడానికి నీరు దొరకకపోతే, సహజంగానే నీటిని దైవంగా చూస్తారు. కాబట్టి ఈ నదిలో ప్రవహించే నీటిని మన మనుగడకు ఒక ఆధారముగా గుర్తించాము.

గంగా ఆర్తి అనేది సాంప్రదాయ పరంగా ప్రతి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కాశీలో నదీ తీరాన జరుగుతుంది. ఇది మీరు ఆస్వాదించగల ఎంతో అందమైన వాతావరణం, ఇంకా మీరు దాన్ని మీకు జరగనిస్తే అది ఒక శక్తివంతమైన ప్రక్రియ కూడా. యోగాలోని అత్యంత ప్రాథమికమైన అంశాన్ని భూతశుద్ధి అంటారు. ఇది పంచ భూతముల నుండి ఒక విధమైన స్వేచ్ఛను సృష్టించడం కోసం పని చేయటం అన్న మాట, ఎందుకంటే సృష్టి అనేది కేవలం ఈ అయిదు మూలకాల ఆట మాత్రమే. ప్రతి అంశాన్ని గురించి ఎంతో సాధన ఉంది - భూమి గురించీ, వాయువు గురించీ, అగ్ని గురించీ, నీటి గురించీ, ఇంకా ఆకాశం గురించీ. మనం అవి మనలో చక్కగా పని చేయడం కోసం ఈ పంచ మూలకాలకూ నమస్కారం చేయడం మాత్రమే కాదు, మనం అవి సరిగ్గా పనిచేసే విధంగా చేసే ప్రక్రియను కూడా నేర్చుకుంటాం. ఈ ఐదు మూలకాలు ఒక సమన్వయంలో ఉండి పని చేస్తేనే మీకు ఒక సరైన శరీరం ఇంకా సరైన జీవితం ఉంటుంది.

కాశీ పై సద్గురు పద్యాలు

A tower of light of immeasurable height
The cosmic reach of the blessed city drew
men of all kinds. Craftsmen and tradesmen
scholars and priests, merchants and mendicants
builders and boatsmen. Seekers of every kind
flocked to suck at the teat of eternity.
Mother Ganga took an odd turn to embrace
this sacred space. Even ensnared the Great Lord
Shambho by its charm.
The great Kashi lost in the folds of human memory
Now left graceless by the invading hordes
and the callous kind who administer bereft of
the sacred touch, but of greed and indolence
of the worst sort.
May blessed Kashi rise again
And touch one and all with its
Sacred light

Domes and towers of stone and metal
Palaces and parliaments for pleasure and
purpose. Schools and temples for pursuits
of here and beyond, all these and more
make a city that people build.
But a city with a tower of light
and cremation ghats that burn eternally
with only aspiration to dissolve.
Where Death is sacred beyond life.
A city built for Death and Dissolution
where life happens with
the knowledge that there is no tomorrow.
A tower of light that lights up
not only all that there IS, but also
That which is Not – Shiva

మణికర్ణికా ఘాట్ కధ

సద్గురు: మణికర్ణికా ఘాట్ ఎలా ఉనికిలోకి వచ్చింది అన్న దాని వెనుక కథలు ఉన్నాయి. శివుని ఆదేశం మేరకు పార్వతి తన చెవి పోగును కింద పడేస్తుంది. విష్ణువు, ధైర్యవంతుడు కావడంతో, దాన్ని పైకి తీయాలి అనుకుంటాడు. కానీ అది భూమిలోకి వెళుతుంది. కాబట్టి అతను ఆ ప్రదేశంలో తవ్వడానికి తన విష్ణు చక్రాన్ని వాడతాడు. అతనికి ఎంతగా చెమట పట్టడం మొదలవుతుంది అంటే అతని సొంత చెమటతో ఆ గుంత నిండి పోతుంది. కానీ అతనికి పార్వతి చెవి పోగు దొరకదు, ఎందుకంటే అతను తవ్వేకొద్ది అది మరింత లోతుగా వెళుతూ ఉంటుంది. శివుడు అప్పుడు విష్ణువుతో, “సరే ఈ నగరం మొత్తం నాది, కానీ ఈ ప్రదేశాన్ని నువ్వు ఉంచుకో, ఎందుకంటే నువ్వు ఇందులో నీ చెమటను ధార పోసావు” అంటాడు. అది మణికర్ణిక అయింది.

మణికర్ణికా ఘాట్ వద్ద దహనం

ప్రశ్న:: మీరు మణికర్ణికా ఘాట్ వద్ద దహనం చేయబడితే మీకు జ్ఞానోదయం కలుగుతుంది అని ఒక నానుడి ఉంది, అది నిజమేనా?

సద్గురు:: మార్కెటింగు‌ను వాస్తవికత అని అపార్థం చేసుకోకండి. అది పూర్తిగా మార్కెటింగే కాదు, కానీ అందులో ఒక ఉత్పత్తి ఉంది, తరువాత మార్కెటింగ్ కూడా ఉంది. కొన్నిసార్లు సమాజంలో, ఉత్పత్తి కన్నా మార్కెటింగ్ అనేది పెద్దదిగా అవుతుంది. ఇది ప్రపంచంలో ప్రతి చోట జరుగుతూ ఉంది.

కాశీలో జీవించటం అంటే మీరు కుటుంబం వైపు గాని, లేదా ఇతర సుఖం వైపుగానీ, లేదా భావోద్వేగ విషయాల వైపు గానీ మొగ్గు చూపటం లేదు అని. మీరు మీ అంతర్గత శ్రేయస్సు కోసం పని చేస్తున్నారు అని.

మీరు ఒక ధోరణిని గమ్యంగా అపార్థం చేసుకుంటున్నారు. మనం మీరు మణికర్ణికలో దహనం చేయబడాలి అన్నప్పుడు, దాని అర్థం ఏమిటంటే, మీరు మీ జీవితంలోని ఆఖరి భాగాన్ని కాశీలో గడపాలి అని. ఇది ఇక్కడ ధోరణి. కాశీలో జీవించటం అంటే మీరు కుటుంబం వైపు గాని, లేదా ఇతర సుఖం వైపుగానీ, లేదా భావోద్వేగ విషయాల వైపు గానీ మొగ్గు చూపటం లేదు అని. మీరు మీ అంతర్గత శ్రేయస్సుకోసం పని చేస్తున్నారు అని. మనం శక్తి పరంగా కొంత మద్దతును ఇచ్చే కాశీ గురించి మాట్లాడుతున్నాము, కానీ ఇది మాత్రమే కాకుండా, మీరు అత్యంత హుందాగా విడిచి వెళ్లడంలో మీకు సాయపడగలిగే, అపారమైన సామర్ధ్యం, జ్ఞానం, ఇంకా అవగాహన కలిగిన ప్రజలు అక్కడ ఉండేవారు.

ప్రశ్న:: మణికర్ణిక ఘాట్ లో దహనం జరగని రోజున ప్రపంచం అంతమవుతుంది అని ఒక నానుడి ఉంది. అది నిజమా?

సద్గురు: సరే, ఎవరూ చావకపోతే ప్రపంచం అంతానికి వస్తుంది, రాదా? ప్రతి రోజూ ఎవరో ఒకరు చనిపోవాలి. అది ప్రక్రియలో ఒక భాగం. గౌతమ బుద్ధుడు దాన్ని ఇలా వివరించాడు. ఒక స్త్రీ తన వద్దకు వచ్చి చనిపోయిన తన పిల్లాడిని కాపాడమని అడిగినప్పుడు అతను, “వెళ్ళి చావు చూడని ఇంటి నుంచి కొన్ని ఆవ గింజలు తీసుకురా” అంటాడు. ఆమె శోఖంతో అన్ని చోట్లా తిరిగి, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు అని గ్రహిస్తుంది. ప్రపంచంలో ఎవరూ చనిపోని సమయం వస్తే, దాని అర్థం కచ్చితంగా ప్రపంచం అంతానికి వస్తుంది అనే. ప్రజలు చనిపోవాలి. ఎందుకంటే ప్రజలు పుడుతున్నారు.

కాశీ అఘోరీలు

Question: ప్రశ్న: కాశీలో మృతదేహాలతో వింత వింత పనులు చేసే అఘోరీలు, ఇంకా అనేక వస్తువులతో ప్రయోగాలు చేసే అఘోరీలు ఉంటారు. ప్రజలు వారిని అసహ్యించుకుంటారు…

సద్గురు:: ప్రజలు బహుశా శాస్త్రీయ ప్రయోగశాలలను (scientific laboratories), జీవ ప్రయోగశాలలను (biological laboratories) చూసి ఉండరు, అక్కడ వారు వివిధ జీవులతో పూర్తిగా విచిత్రమైన పనులు చేస్తుంటారు. అదంతా కూడా శ్రేయస్సును చేకూర్చాలనే ఉద్దేశంతోనే చేస్తారు. ఎప్పుడో ఒకసారి ఉపయోగకరమైనదేదో బయటకు వస్తుంది. కానీ తక్కిన సమయం అంతా మనం ఈ ప్రయోగశాలలో కేవలం వింత విషయాలే చేస్తున్నాము. మీరు హైస్కూల్లో బయాలజీ చదివినా కూడా, మీరు కప్పలను కోసి తెరుస్తున్నారు, దాని లోపల చూస్తున్నారు, ఇది అది చేస్తున్నారు. అది చాలా వింత విషయమే. కానీ మనందరం అది చేసాము, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాము, అక్కడికి ఏదో నేర్చుకోవడానికి అదొక్కటే మార్గం అన్నట్టు.

ఒకసారి శరీరం కాలటం మొదలయ్యాక, ప్రాణం వెంటనే బయటకు వెళ్ళి పోవాలి. అఘోరీలు విడుదలైన ఆ జీవశక్తిని ఉపయోగించుకోవాలి అనుకుంటారు, ఇంకా అక్కడ తమతో తాము కొంత పని చేయాలనుకుంటారు.

మృత దేహంలో ఇంకా ప్రాణం ఉంటుంది. మీరు మృతదేహాలను దహనం చేసే మణికర్ణిక ఇంకా హరిశ్చంద్ర ఘాట్ ల వద్దకు వెళితే, అక్కడ అఘోరీలు కూర్చుని చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరినీ అడుగుతారు, “ఈ వ్యక్తి వయసు ఎంత? ఈ వ్యక్తి ఎలా చనిపోయాడు?” అని. ఇందువల్లే, ఆ విషయం బయటకు తెలియడం ఇష్టం లేని కొంతమంది మృతదేహాన్ని ప్లాస్టిక్ షీట్లతో కప్పుతున్నారు, అప్పుడు ఎవరూ చూడలేరు. ఎవరైనా వాళ్ళని “ఈ వ్యక్తి వయసు ఎంత?” అని అడిగితే, వాళ్ళు సమాధానం ఇవ్వరు. కానీ అఘోరీలు తెలుసుకోవాలనుకుంటారు. వాళ్లకి యవ్వనంలో ఉన్న వ్యక్తి, వైభవమైన జీవం కలిగిన వ్యక్తి, అలాగే ఏదో ఒక కారణం వల్ల చనిపోయిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి కావాలి. ఒకసారి శరీరం కాలటం మొదలయ్యాక, ప్రాణం వెంటనే బయటకు వెళ్ళి పోవాలి. అఘోరీలు విడుదలైన ఆ జీవశక్తిని ఉపయోగించుకోవాలి అనుకుంటారు, ఇంకా అక్కడ తమతో తాము కొంత పని చేయాలనుకుంటారు. ఇప్పుడు ప్రజలు వారికి సహకరించరు, ఎందుకంటే వాళ్ళు తమకు ఇష్టమైన వారు ఇలా వాడబడటాన్ని ఇష్టపడరు. కాబట్టి వీళ్ళు శరీరాన్ని లాక్కొని పారిపోతారు.

వాళ్లు జీవంలోని ఒక భాగాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటారు. వాళ్ళు దహనం అవుతున్నప్పుడు మృతదేహం నుండి విడుదలయ్యే శక్తిని ఉపయోగించుకోవాలి అనుకుంటారు. వాళ్లు దీన్ని సజీవంగా వున్న ఒక వ్యక్తికి చేయాలని కోరుకోరు, ఎందుకంటే అది నరబలికి దారి తీస్తుంది. కాబట్టి వాళ్లు మృతదేహం రావడం కోసం వేచి చూస్తూ ఉంటారు. అందులోని శాస్త్రం మీకు తెలీదు కాబట్టి, మీరు దాన్ని వెంటనే ఒక వింత విషయం అని అనుకోకూడదు. అవును పనులు చేయడానికి అది ఎంతో భీకరమైన విధానం. అది అందరికీ కాదు. అది సమాజం యొక్క గమనిక లోకి రాకుండా చేయాల్సిన విషయం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున ప్రతిచోటా జనాభా ఉంది. ఒకానొక సమయంలో అఘోరీలు ఇక్కడ ఉంటే ఇక ఈ చుట్టుపక్కల దాదాపు ఎవరు ఉండరు అన్నట్లు ఉండేది, అప్పుడు తమ అభివృద్ధి ఇంకా శ్రేయస్సు కోసం వాళ్ళు చేయాలనుకున్న పనులను వాళ్ళు చేయడానికి వీలు ఉండేది.

ప్రశ్న:: కానీ మీరు సైన్స్ గురించి మాట్లాడితే, “ఆ కోతులను వాడటం ద్వారా అంతిమంగా మనకు కొన్ని మందులు వచ్చాయి.” కానీ మనిషికి సహించని ఇటువంటి విషయాలను చేసే వెసులుబాటును వాళ్లకి కలిగించేంతగా ఒక అఘోరీ ఈ ప్రపంచానికి ఏమి ఇచ్చాడు?

ప్రశ్న:: కానీ మీరు సైన్స్ గురించి మాట్లాడితే, “ఆ కోతులను వాడటం ద్వారా అంతిమంగా మనకు కొన్ని మందులు వచ్చాయి.” కానీ మనిషికి సహించని ఇటువంటి విషయాలను చేసే వెసులుబాటును వాళ్లకి కలిగించేంతగా ఒక అఘోరీ ఈ ప్రపంచానికి ఏమి ఇచ్చాడు?

సద్గురు: ఒక సమాజానికి ఏది ఉపయోగకరం, ఏది ఉపయోగకరం కాదు అనేది చరిత్రలో విభిన్న సమయాలలో మారుతూ ఉంటుంది. మనం సైన్స్ అంటే, గొప్ప ప్రయోజనాలను చేకూర్చటం పరంగా మాట్లాడినా, అది కేవలం ఆ సందర్భానికి మాత్రమే వర్తిస్తుంది. ఇది ఇప్పటికే జరగటం మొదలైంది. పర్యావరణవేత్తలందరూ ప్రతి శాస్త్రీయ విషయాన్నీ కూడా ఆపాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు, అభివృద్ధి పేరిట మనం మన శ్రేయస్సు యొక్క మూలాన్నే పూర్తిగా నాశనం చేస్తున్నాము అని.

సమాజంలో ఈ రోజు ఏదైతే వాస్తవమో, దాన్ని రేపు చిన్న చూపు చూస్తారు. ఈరోజు ఏదైతే గొప్పదో, దాన్ని ఎల్లుండి అత్యంత హీనమైనదిగా అనుకుంటారు. ఇది సామాజిక నిర్మాణంలో ఎలాగూ జరుగుతుంది. ఇదే అతి ముఖ్యమైనది, అని మిమ్మల్నినమ్మేలా చేస్తారు. రేపు, తర్వాతి తరం నిలుచుని, “మీరు చేసింది అత్యంత మూర్ఖమైన విషయం” అంటారు.

అఘోరీలు సామాజిక నేపథ్యంలో పాలుపంచుకోవాలి అనుకోరు. వారు తమ అనంతమైన స్వభావం మీదే దృష్టి నిలుపుతారు. సమాజం ఏమనుకుంటుందో వాళ్లకు పట్టింపు ఉండదు, కాబట్టి వాళ్లు ఎప్పుడూ కూడా సమాజానికి దూరంగా ఉంటారు. కానీ ఈరోజు సమాజం మొత్తం అంతటినీ ఆక్రమించింది. వాళ్ళు ఉండటానికి చోటు లేదు. వాళ్ళు ఎవరికీ హాని కలిగించడం లేదు. మీరు ఏ అఘోరీ అయినా ఎవరికైనా హాని తలపెట్టడం గురించి విన్నారా? లేదు. తను తనతో ఏదో చేసుకుంటున్నాడు. ప్రజలు మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారు, చనిపోయేవరకు తాగుతున్నారు, పొగ తాగి మీ ముఖం మీద ఊదుతున్నారు. అఘోరీలు వీటిలో ఏ ఒక్కటీ చేయడం లేదు. తమ సొంత పని చేసుకుంటూ - అది కూడా తమతో, మరొకరితో కాదు - వాళ్లు మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నారు.

వాళ్లు ఏ స్థాయికి పరిణితి చెందాలనుకుంటున్నారు అంటే, ఏదైతే మీకు అత్యంత అసహ్యమో, అది వారికి సన్నిహితమైనది అయ్యే స్థాయికి. ఎందుకంటే మీరు దేని మీదైనా ఇష్టం లేదా అయిష్టం ఏర్పరుచుకున్న క్షణమే, మీరు ఉనికిని విభజించేశారు. ఇక ఒకసారి మీరు ఉనికిని విభజించాక, మీరు దాన్ని అక్కున చేర్చుకోలేరు. మీరు దేన్ని అయితే సహించలేరో, వారు అది చేయాలనుకుంటారు. ఎందుకంటే వారు తమలో ఇష్టం ఇంకా అయిష్టం అనే వాటిని తీసి వేయాలి అనుకుంటున్నారు. వారికి ప్రతిదీ ఒకటే. ఇది విశ్వాన్ని అక్కున చేర్చుకోవడానికి ఒక విధానం. అది, మీకు నాకు సరిపడే విధానం కాకపోవచ్చు, కానీ అది మరొకరికి పనిచేస్తుంది. పనికొచ్చే దేనికీ కూడా నేను వ్యతిరేకం కాదు. అది గనుక పనిచేస్తే, నాకు అది పర్వాలేదు.

కాశీని అనుభూతి చెందటం ఎలా?

ప్రశ్న::ఎవరైనా కాశీకి వస్తే ఇక్కడ కచ్చితంగా అనుభూతి చెందాల్సిన విషయం ఏమిటి?

సద్గురు: ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే, కొద్దిగా ముందస్తు తయారీ అయ్యి రావడం. మీరు కాశీ వెళుతుంటే, కనీసం మూడు నెలలపాటు ఏదో ఒక సరళమైన ఆధ్యాత్మిక ప్రక్రియలోకి దీక్ష తీసుకోండి. కొంత సమయం ధ్యానం చేయండి. మిమ్మల్ని మీరు కొంత సున్నితమైన(sensitive) వారిగా చేసుకుని రండి. మీ నమ్మకాలను ఇంటి వద్ద వదిలేసి రండి. దేన్నీ నమ్మవద్దు.

కాశీని పునరుద్ధరించడం

సద్గురు: కాశీ ఒక అద్భుతమైన ప్రదేశం. మనం దీన్ని, దాని పూర్తి వైభవానికి మళ్ళీ పునరుద్ధరించాలి. ఎందుకంటే, ఈ గ్రహం మీద మునుపెన్నడూ కూడా మానవులు కాశీ అంతటి మహోన్నతమైన ఇంకా గొప్పదైన దాన్ని చేసే ధైర్యం చేయలేదు. కానీ దురదృష్టవశాత్తు, కాలం వల్ల ఇంకా ఆక్రమణల వల్ల దెబ్బతింది, ఎంతో నష్టము జరిగింది. దీన్ని పునరుద్ధరించి మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావలసిన సమయం ఇది. ఇది ఒక మతం కాదు. ఇది మన బాధ్యత. మనం మానవ శ్రేయస్సు గురించి ఆలోచించే వారమైతే, మానవ శ్రేయస్సు కోసం సృష్టించబడిన ఈ విధానాలను, ఈ ప్రక్రియలను ఇంకా ఈ పరికరాలను పునరుద్ధరించాలి.

    Share

Get latest blogs on Shiva

Related Content

శివుడు, శక్తి: 54 శక్తి స్థలాలు ఎలా ప్రారంభమయ్యాయి?