ఒక నిశ్శబ్దపు సముద్రం
ఒక సడిలేని పొద్దు
ఒక చప్పుడు చెయ్యని మెదడు
కానీ ఒక రగిలే హృదయం
నిప్పులు కక్కే జ్వాలాముఖి
అది ఒక అనాది యోగి మది
మండుతోంది ఎందరికోసమో యుగయుగాలుగా
మతిలేని వారికది మారణాయుధం
అన్వేషకులకది ఆత్మజ్ఞానౌషధం
మొండి వారికది కర్కశం
సుముఖులకతి సున్నితం
అన్ని ఎత్తులూ చిత్తయినప్పుడు
ఆదియోగి అగ్నికీలలిక
దహించివేయు మూర్ఖులను
భవిష్యత్ భవనాల వెలుగులు నింపగ
భావితరాల కోటలు ముందు
ఉద్భవించాయి మూఢుల మెదళ్ళలో
ఆ నీలదేహు డనంత సృష్టికర్త అనుగ్రహ కాంతుల
ఈ కోటను వెలుగులు నిండగ
ఇక నపుడు అవును ఆ చోటు నివాసయోగ్యము
అధ్యాత్మ తీరాల దారితీసే త్రోవయై
ఆ ఆదియోగి జ్వాల నెత్తి కొనగ
ఆహా, మనమెంతటి భాగ్యవంతులము!