చాంద్రమాన పంచాంగములో అమావాస్యకు ముందు వచ్చే 'చతుర్దశి' నెలలోని మిగతా రాత్రుల కన్నా చిమ్మచీకటితో ఉండే రాత్రి. ఈ రాత్రిని శివరాత్రిగా పరిగణిస్తారు. మనం "శివ" అన్నప్పుడు, ఒక అంశంలో మనం ఆదియోగి గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక అంశంలో, "శివ" అంటే "ఏదిలేదో అది" అని అంటున్నాం. ఉన్నది అంటే సృష్టి. లేనిది అంటే "శివ". సృష్టి అంతా "శూన్యం" నుండి వచ్చిందని ఈ రోజున ఆధునిక శాస్త్రం కూడా చెబుతున్నది. ప్రతీది శూన్యం నుండి వచ్చి తిరిగి శూన్యం లోకి పోతుంది. శూన్యం అనేది సృష్టికి ఆధారం. అందుకని మనం శివుడిని సృష్టికి ఆధారంగా భావిస్తాం. ఏది లేదో అదే ఉన్నదానికి ఆధారం.
విశేషమేమిటంటే, జగత్తులో ప్రతీదానిని తనలో ఇమిడ్చుకొని ఉంచుకునే దానిని ఒక అంధకార శక్తిగా నేటి ఆధునిక శాస్త్రవేత్తలు అంటున్నారు.
రాత్రిపూట మీరు ఆకాశం వంక చూసినట్లైతే, ఆకాశంలో వందల కోట్ల నక్షత్రాలు ఉంటాయి. కాని అది ముఖ్యం కాదు. నక్షత్రాల కన్నా ఖాళీగా ఉండే స్థలం ఆకాశంలో ఎక్కువగా ఉంటుంది. సృష్టి అతిసూక్ష్మమైనది. విస్తారమైన శూన్యం బ్రహ్మాండమైనది. సృష్టి అంతా శివుని ఒడిలో జరుగుతున్నట్లు మనం చెబుతూ ఉంటాం. శివుడిని నల్లని వాడని పిలుస్తాం. విశేషమేమిటంటే, జగత్తులో ప్రతీదానిని తనలో ఇమిడ్చుకొని ఉంచుకునే దానిని ఒక అంధకార శక్తిగా నేటి ఆధునిక శాస్త్రవేత్తలు అంటున్నారు. దానిని మరొకలాగా వర్ణించడానికి వీలులేక, దాని తత్వాన్ని గ్రహించలేక వారు దానిని ఒక అంధకార శక్తిగా పిలుస్తున్నారు. వారు "శివ" అనడం ఒక్కటే తక్కువ.
శివరాత్రి అనే పదం శబ్దతః శివుని రాత్రి. ఆ రోజున, మీ శరీరంలోని శక్తులు సహజంగా ఉప్పొంగుతాయి. దీనిని ఉపయోగించుకోడానికి యోగాలో ఒక విశేషమైన సాధన ఉన్నది. ప్రాధమికంగా, ఒక మానవ శరీరమైనా లేదా విశ్వం మొత్తమైనా పంచ భూతాలతో, అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలతో నిర్మించబడినవే.
మీరు పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, నడిచే నేల, జీవ శక్తిగా ఉన్న జీవాగ్ని - ఈ పదార్ధాలతో మీ శరీరం ఏర్పడింది.
శివుని నామాలలో ఒకటి భూతేశ్వర, అంటే భూతాలకు నాధుడు. ప్రతి శివరాత్రి ధ్యానలింగ గుడిలో జరిగే పంచభూత ఆరాధన ప్రధానంగా ధ్యానలింగ యొక్క అనుగ్రహాన్ని అనుభూతి చెందడం కోసమే. పంచభూత ఆరాధన అతి శక్తివంతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ అవకాశం మీ శరీర వ్యవస్థలో ఈ పంచభూతాలు సమన్వయంతో, సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.
ఈ పంచభూతాలు ఎంత బాగా ఒకరి శరీరంలో అమర్చబడి ఉన్నాయి అన్నదాని మీదే ఆ మనిషికి సంబంధంచినదంతా నిర్ణయిచబడుతుంది. ఒక మహత్తర అవకాశాన్ని అందుకోవాడానికి ఈ శరీరం మొదటి మెట్టుగా తయ్యారవ్వాలంటే పంచభూతాలు ఈ శరీరంలో సరిగ్గా అమర్చబడి, సమన్వయంతో ఉండడం చాలా ముఖ్యం.
మీరు పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, నడిచే నేల, జీవ శక్తిగా ఉన్న జీవాగ్ని - ఈ పదార్ధాలతో మీ శరీరం ఏర్పడింది. మీరు వీటిని నియంత్రించి, చైతన్యంతో కేంద్రీకరించి ఉంచినట్లయితే ఈ ప్రపంచంలో ఆరోగ్యం, శ్రేయస్సు, విజయం తధ్యం! ఒక విధంగా, అసలు మా ప్రయత్నమంతా కూడా జనాలు వారు ఉండే విధానాన్నే ఒక 'పంచభూత ఆరాధన'గా మలచుకోవడానికి వేర్వేరు పరికరాలను సృష్టించడమే.
ప్రేమాశీస్సులతో,
సద్గురు