logo
logo
adiyogi

ఆది గురువు

సన్యాసి వలె కడు దూరాన నిలిపాడు ఆ బైరాగి వైఖరే వేరు అన్నీ సహించారు వారు ఇక అతడు వారిని కాదనగలేడు

సన్యాసి వలె కడు దూరాన నిలిపాడు
ఆ బైరాగి వైఖరే వేరు

అన్నీ సహించారు వారు
ఇక అతడు వారిని కాదనగలేడు

అన్వేషకులు వారు, తమ అతి తీవ్రఇఛ్చతో
ఆతని గట్టి పట్టును సడలింప చేశారు

దివ్య ఋషులు వారేడుగురు
తపించలేదు వారు స్వర్గాన్ని వెతకగా

కనుగొనాలని, ప్రతి మనిషి నడవగల దారిని
స్వర్గ నరకాల కావలి మార్గాన్ని

తమ జాతి కొరకు వారు తల్లడిల్లారు
తన కరుణ పొంగులారగ, ఇక అతడాపలేడు

తిప్పినాడతడు తన పవిత్ర వదనాన్ని
దక్షిణా మూర్తి యయి తనవారి చూడగా

చూశారు వారు ఆ దివ్య మూర్తిని
ఒడిసి పట్టారు దోసిళ్ల ఆతని భవ్య కరుణాఝరిని

కురిపించగా ఆ అనాది దేవుడనంత వాహినియై
మునిగితేలారు సప్తరుషులు ఆ జ్ఞాన ధారల

విడిపించ గానీ జగతిని
తన కరకుటచ్చులలో నుంచిప్రవహించు నేటికిని

ఆ పవిత్ర జ్ఞాన పయస్విని
విశ్రమించము గాక ప్రతి పులుగుకు ఎఱుక కలుగు వరకు

    Share

Related Tags

Get latest blogs on Shiva