వెల్లియంగిరి పర్వతం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. దీనిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు, ఎందుకంటే శివుడు ఇక్కడ కొంత సమయం గడిపాడు. సద్గురు చెప్పినట్టుగా అది ఒక పర్వత ఆలయం. సద్గురు మనకు ఈ పర్వతంలో పొందుపరచబడిన అసాధారణమైన గొప్ప శక్తి గురించి, అలాగే ఆ శక్తిని స్వీకరించేందుకు ఉన్న శివాంగ సాధన వంటి అనేక సాధనల గురించి మాట్లాడుతున్నారు.