శివునికి, బుద్ధునికి మధ్య వున్న తేడా ఏంటి? అందుకు సద్గురు, “శివుని లోని ఏ అంశాన్ని బుద్ధుడు పరిశోధించాడు?” అనేది అసలైన ప్రశ్న అంటున్నారు. మానవాళికి సాధికారతను చేకూర్చడంలో, మానవ చైతన్యాన్ని పెంపొందించటంలో శివుడు చేసిన విస్తారమైన పనికి, తనని తగినంతగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని సద్గురు వేడుకుంటున్నారు.