శివుడు, ఆదియోగి, ఆది గురువు- ఈ పదాలు ఒక వ్యక్తిని గురించి వివరిస్తాయా లేదా మరేదైనా దాన్ని ఉద్దేశించినవా? “శివ” అనే పదానికి అర్థం “ఏది లేదో అది” – భౌతికాతీతమైన ఒక పార్శ్వం. మన జ్ఞానేంద్రియాలు, కేవలం భౌతికమైన వాటిని మాత్రమే గ్రహించగలవు. అయినా కూడా, భౌతికాన్ని అధిగమించే గ్రహణశక్తిని పెంపొందించడానికి ప్రజలు యోగాను ఉపయోగించుకోవచ్చు.