logo
logo
శీర్షిక - మహాశివరాత్రి వేడుక
2024

కోయంబత్తూరులోని వెల్లింగిరి పర్వత పాదాల చెంతనున్న ఈశా యోగ కేంద్రంలో రాత్రి పొడుగునా, ఉత్సాహభరితంగా జరుపుకునే పండుగే మహాశివరాత్రి. అది మార్చి 8, 2024న జరగనుంది. కొన్ని లక్షల మందిని ఆకట్టుకునే ఆ పండుగ రాత్రిన, సౌండ్స్ ఆఫ్ ఈశా మరియు ప్రసిద్ధిగాంచిన ఇతర సంగీత కళాకారుల అద్బుత ప్రదర్శనలు ఉంటాయి.

సద్గురు సమక్షంలో జరిగే ఎంతో అద్భుతమైన, అసమానమైన ఈ మహోత్సవం, ప్రత్యేకించి ఈ రాత్రిన అందుబాటులోకి వచ్చే ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక సంభావ్యతలకు తెర తీస్తుంది. 

ప్రసిద్ధ కళాకారులచే వరుసగా ఇవ్వబడే సంగీతం, నృత్యం ఇంకా సాంస్కృతిక ప్రదర్శనలు మిమ్మల్ని రాత్రంతా మెలుకువగా, ఇంకా ఉత్సాహంగా ఉంచుతాయి, తద్వారా మీరు ఈ పవిత్రమైన రాత్రిన అందుబాటులో ఉండే అవకాశాల నుండి ప్రయోజనం పొందవచ్చు.

మహాశివరాత్రి 2022 దృశ్యమాలికలు

కళాకారులు
(గతంలో ప్రదర్శించిన వారు)

కొన్ని లక్షల మందిని ఆకట్టుకునే, ప్రసిద్ధిగాంచిన సంగీత కళాకారుల ప్రదర్శనలతో కూడిన రాత్రి పొడుగునా, ఉత్సాహభరితంగా జరుపుకునే ఈ పండుగలో పాల్గొనండి.

మహాశివరాత్రి కార్యక్రమం షెడ్యూల్

రాత్రి పొడుగునా జరిగే ఈ వేడుకలో ఎలా పాల్గొనాలో, ఎలా నిమగ్నమవ్వాలో తెలుసుకోండి.

యక్ష

సంగీత నృత్యాల ప్రదర్శన

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ కళాకారుల శాస్త్రీయ సంగీతం మరియు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో జరిగే ఉల్లాసభరితమైన వేడుక.

ఫిబ్రవరి 15, 16 మరియు 17 తేదీల్లో ప్రతిరోజూ సా. 6 గం. నుంచి