సీటింగ్ పాస్ పొంది, సద్గురుతో ఈశా యోగ కేంద్రంలో రాత్రి పొడుగునా జరిగే మహాశివరాత్రి వేడుకల్లో లైవ్‌లో పాల్గొనండి.
Limited Seats Available
Registration is open for limited seats on a first-come, first-served basis
మహాశివరాత్రి అనేది, సద్గురుచే గాఢమైన ధ్యానాలు ఇంకా ప్రఖ్యాత కళాకారులచే అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో రాత్రంతా సాగే ఉత్సవం.
(సద్గురుతో)
(ప్రముఖ కళాకారులతో)
(ఈశా సంస్కృతి విద్యార్థులు)
(యోగా మూలాలను వర్ణించే అద్భుతమైన లైట్ & సౌండ్ షో)
ఈశా యోగ కేంద్రం, వెల్లెంగిరి పర్వత పాదాలు,
ఈశాన విహార్ పోస్ట్, కోయంబత్తూర్ 641 114, ఇండియా
సందేహాలకు:
ఫోన్: 83000 82000
ఈమెయిల్: info@mahashivarathri.org
చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం కాల్ చేయండి 8300082000
దయచేసి వీటిని తీసుకురండి:
● మీరు మహాశివరాత్రికి రిజిస్టర్ అయినప్పుడు ఉపయోగించిన ప్రభుత్వం జారీ చేసిన, ఫోటో గుర్తింపు కార్డు.
● మీకు ఈమెయిల్ చేయబడిన E pass ప్రింట్ అవుటు
ముందుగానే రిజిస్టర్ చేసుకున్న వారి కోసం చెక్-ఇన్ కౌంటర్లు, కార్యక్రమం రోజున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. తదనుగుణంగా మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నాము, ఎందుకంటే ఈ చెక్-ఇన్ సమయాలలో తప్ప ఇతర సమయాలలో అనుమతించడం సాధ్యం కాదు.
Please stay back for the event until 6 am on 9th March. భద్రతా కారణాల వల్ల, చెక్-ఇన్ అయిన తర్వాత, పాల్గొనేవారిని కార్యక్రమ ప్రాంగణం నుండి బయటకు అనుమతించరు.
కాలకృత్యాల వసతులు, కార్యక్రమ ఆవరణలో అందుబాటులో ఉంటాయి..
పాల్గొనవచ్చు, మహాశివరాత్రి ఆంగ్లంలో నిర్వహించబడుతుంది, తమిళ అనువాదం కూడా ఉంటుంది. ఆన్లైన్ లో పాల్గొనేవారి కోసం, ప్రత్యక్ష అనువాదం 7 భారతీయ భాషలలో (తమిళం, హిందీ, మరాఠీ, బంగ్లా, తెలుగు, కన్నడ, ఇంకా మలయాళం) ఇంకా 5 ప్రపంచ భాషలలో (రష్యన్, మాండరిన్, స్పానిష్, ఫ్రెంచ్ ఇంకా పోర్చుగీస్) అందుబాటులో ఉంటుంది.
కార్యక్రమం పొడుగూతా కుర్చీలు అందుబాటులో ఉంటాయి
లేదు. మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొనే వారికి వసతి సదుపాయాలు ఇవ్వబడవు.
లేదు. కేవలం రిజిస్టర్ అయిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.
ఈ కార్యక్రమం సమయంలో పిల్లలను ఇంకా/లేదా మైనర్లను జాగ్రత్తగా చూసుకోవడానికి సౌకర్యాలు లేదా వనరులు మా వద్ద లేవు. మీరు ఇక్కడ ఉన్న సమయంలో, వారికి ఇంటి వద్ద సంరక్షక ఏర్పాట్లు చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ప్రత్యామ్నాయంగా, మీరు కోయంబత్తూరులో ఉండటానికి ఎంచుకుని, మీ కుటుంబంతో మహాశివరాత్రికి రావచ్చు. అలా చేసే పక్షాన, దయచేసి మీ కుటుంబీకుల కోసం కూడా సీటింగ్ పాస్ కోసం రిజిస్టర్ చేయండి.
పాల్గొనేందుకు కావాల్సిన కనీస వయస్సు 10 సంవత్సరాలు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి వారికీ కూడా, మహా అన్నదానం అందించడం జరుగుతుంది. ఆహార పరిమితుల కారణంగా, మీ సొంత ఆహారాన్ని తీసుకురావాల్సి వస్తే, ఆరోగ్యకరమైన శాఖాహార భోజనాన్ని తీసుకురావచ్చు.
పరిమితమైన పార్కింగ్ మాత్రమే ఉంటుంది. వాహనానికి పూర్తి బాధ్యత వహిస్తూ పార్కింగ్ చేసుకోవచ్చు, వాహనాల విషయంలో కార్యక్రమ నిర్వాహకులు బాధ్యులు కారు.
లేదు. స్పాట్ రిజిస్ట్రేషన్ లు అందుబాటులో ఉండవు. ఈ కార్యక్రమానికి కనీసం 15 రోజుల ముందు మీరు మహాశివరాత్రి కోసం నమోదు చేసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
మీరు మహాశివరాత్రికి రిజిస్టర్ చేసుకున్న తర్వాత, మీకు మీ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఇ-రిసిప్టు ఇంకా కన్ఫర్మేషన్ ఇ-మెయిల్ వస్తుంది. కార్యక్రమానికి కొంచం ముందు, ఇ-పాస్ మీకు ఇ-మెయిల్ ద్వారా పంపబడుతుంది.
పాల్గొనవచ్చు. మహాశివరాత్రి కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు.