logo
logo

ఆదియోగి ప్రదక్షిణ

ప్రదక్షిణ అంటే శక్తిని గ్రహించేందుకు ఎదైనా శక్తిస్థానం చుట్టూ సవ్య దిశలో తిరగే ప్రక్రియ. ఆదియోగి అనుగ్రహానికి పాత్రులమయ్యేందుకు మనం ఆదియోగి ప్రదక్షిణను చేయవచ్చు. మోక్షసాధన కోసం కృషి చేసేవారికి ఇది తోడ్పడుతుంది.

ఆది యోగి ప్రదక్షిణకు కావలసిన నివేదన సామాగ్రి(బియ్యం, దూపం, పెసర్లు, నల్లనువ్వులు) ముందుగానే ఒక గుడ్డ సంచిలో(ఆది యోగి బొమ్మ ఉన్న గుడ్డ సంచిలు అమ్మకానికి దొరుకుతాయి) సమీకరించుకోవాలి. ఆది యోగి ముందు “యోగ యోగ యోగేశ్వరాయ” మంత్రాన్ని 3 సార్లు చేసి ప్రదక్షిణ ప్రారంభించాలి. పారాయణ అయ్యాక యోగేశ్వరలింగానికి జలము అర్పించండి (మహాశివరాత్రి రోజున ఈ అర్పన కుదరదు). పురుషులు అక్కడ నుండి సూర్యకుండం దగ్గరకు వెళ్ళి, అక్కడ ఒక కుండెడు నీళ్ళు వారి తలపై పోస్తారు.

ఆ తరువాత త్రిమూర్తి పానెల్ దగ్గర ధూపం ఉరిలిలో వెలిగించండి. లింగ భైరవి దగ్గరకు వెళ్ళి అక్కడ పెసర్లు అర్పించాలి. స్త్రీలు చంద్ర కుండం దగ్గరకు వెళ్ళాలి. అక్కడ ఒక కుండెడు చంద్ర కుండం నీళ్ళు వారి తలపై పోసుకుంటారు. ధ్యానలింగం వద్దకు వెళ్ళి నల్ల నువ్వులు అక్కడ అర్పించండి. ఆ తరువాత మళ్ళీ ఆది యోగి వైపు వెళ్ళి అక్కడ బియ్యం అర్పించండి. ఇది ఒక ప్రదక్షిణతో సమానం.

ప్రతి ప్రదక్షిణకు బియ్యం, ధూపం, పెసర్లు, నల్ల నువ్వులు సమర్పించాలని. ఒకరు ఒక సంవత్సరంలో చేయగలిగినన్ని ప్రదక్షిణలు సంఖ్య ఎంపిక చేసుకోవచ్చు. 1, 3, 5, 7, 9,12,18, 21, 24, 38, 48, 64, 84, 96,108, 208, 308, 408, 508, 608, 708, 808, 908, 1008 సార్లు చేసుకోవచ్చు. ఎన్ని చేయాలనుకున్నారో అవి ఆ సంవత్సరంలో పూర్తి చెయ్యాలి.
ప్రదక్షిణ చేస్తున్నంత సేపు యోగ యోగ యోగేశ్వర మంత్రం పఠిస్తూ వుండాలి.

యోగ యోగ యోగేశ్వర మంత్రం:

యోగ యోగ యోగేశ్వరాయ
భూత భూత భూతేశ్వరాయ
కాల కాల కాలేశ్వరాయ
శివ శివ సర్వేశ్వరాయ
శంభో శంభో మహాదేవాయ

ప్రదక్షిణ ప్రతి రోజు ఉదయం 6గం. నుండి సాయంత్రం 8గం. వరకు చెయ్యవచ్చు. మహాశివరాత్రి రోజున ఉదయం 6గం. నుండి మధ్యాహ్నం 2గం. వరకు చేయవచ్చు.

గుర్తుంచుకోండి:

  • ప్రదక్షిణ సంఖ్యకు సరిపడా సామాగ్రిని తప్పనిసరిగా వెంటపెట్టుకోవాలి.

  • పురుషులు చొక్కాలు తీసి ప్రదక్షిణ చెయ్యాలి.

  • ప్రదక్షిణ చేసేటప్పుడు పాదరక్షలు ధరించరాదు.

  • ప్రదక్షిణ సమయంలో సంభాషించకూడదు.

సామాన్యంగా వచ్చే ప్రశ్నలు:

  • నివేదనలు (బియ్యం, పెసర్లు, నల్ల నువ్వులు) ఎంత పరిమాణంలో చెయ్యాలి?

  • మీరు ఎంత చెయ్యాలనుకుంటే అంత చెయ్యవచ్చు.

  • నివేదన సామాగ్రిని ఇంటి నుండి తెచ్చుకోవచ్చా?

  • తెచ్చుకోవచ్చు.

  • ప్రదక్షిణ సమయంలో పాదరక్షలు ధరించవచ్చా?

  • ధరించరాదు.

  • నివేదన సామాగ్రి ఈశ యోగ సెంటర్ లో లభిస్తాయా?

  • లభిస్తాయి.

  • సూర్య కుండం/చంద్ర కుండం వద్ద ప్రవేశ రుసుము చెల్లించాలా?

  • లేదు.

  • యోగేశ్వరలింగం వద్ద నీటికి డబ్బు చెల్లించాలా?

  • లేదు.

  • మ. 1.20 నుండి 4.20 వరకు లింగ భైరవి గుడి మూసి ఉన్నప్పుడు సమర్పణలు చెయ్యవచ్చా?

  • గుడి బయట చేయవచ్చు.

  • పంచభూతారధన సమయంలో ధ్యాన లింగం వద్ద సమర్పణలు చెయ్యవచ్చా?

  • ధ్యాన లింగం ముందు సర్వధర్మ స్థంభం ముందు వున్న ఫోటో ముందు సమర్పించాలి.

  • ఎన్ని ప్రదక్షిణలు చేయవచ్చు?

  • మీరు అనుకున్న సంఖ్య ప్రకారం 1, 3, 5, 7, 9, 12, 18, 21, 24, 33, 48, 64, 84, 96, 108 చెయ్యవచ్చు.

  • ధూపం ఎలా సమర్పించాలి?

  • త్రిమూర్తి పనెల్ ముందున్న ఉరిలిలో కానీ/ధూప దీనిలో కానీ ధూపం సమర్పించాలి.

  • సమర్పణలు ప్రతి ప్రదక్షిణకు చెయ్యాలా?

  • అవును చెయ్యాలి.