సద్గురు, అన్ని సామాజిక నిబంధనలకు ఇంకా పోకడలకు అతీతమైన ఇంకా తీక్షణమైన భక్తురాలయిన అక్కమహాదేవి గురించి మాట్లాడుతున్నారు. ఆమె తనకున్న అన్నిటినీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో నడిచేలా చేసిన ఓ సంఘటనను గురించి ఆయన చెబుతున్నారు, అలాగే తిరిగి సమాజంలోనికి రావాలని కోరిన తన తల్లికి, ప్రత్యుత్తరమిస్తూ తను రాసిన ఓ కవితను కూడా మనతో పంచుకుంటున్నారు.