మీరు లోకల్ సెంటర్ లోనైనా,ఆన్ లైన్ లోనైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు: మీరుమహాశివరాత్రి పేజీ వెళ్ళి ‘ATTEND IN PERSON’ లోకి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. మీకేమైనా ప్రశ్నలు ఉంటే, మీ ప్రశ్నని అడగండి, 4-7 రోజులలో ఒక వాలంటీరు సీటింగ్ వివరాల గురించి మీతో ఫోన్ లో మాట్లాడతారు. గమనిక: ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నిచడం వల్ల, పైన తెలిపిన సమయం లోపల మీకు ఫోన్ రాకపోతే, మీరు మీ ప్రాంత రిజిస్ట్రేషన్ పాయింట్ కు ఫోన్ చేస్తే మీకు లోకల్ సెంటర్ వివరాలు ఇస్తారు. మీరు మీకు కావలసిన కేటగిరీ ఏమిటో మీ ఈ మైల్ లో తెలియపరిస్తే, మీకు 24-48 గంటల్లో‘please complete your donation’. డొనేషన్ లింక్ పంపిస్తాము. దయచేసి మీ స్పామ్ ఫోల్డర్ చూడండి. డొనేషన్ లింక్ 30 రోజులు పనిచేస్తుంది.
అవును, మీరు మహాశివరాత్రి సీటింగ్ పాస్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడువాడిన గవర్నమెంట్ ఫొటో ఐడెంటిటీ కార్డు తీసుకురండి. విదేశీ యాత్రీకులకు పాస్ పోర్ట్, వీసా తీసుకురావాలి.
కార్యక్రమం రోజు రిజిస్ట్రేషన్ చేసినవారికి చెక్ ఇన్ కౌంటరు మధ్యాహ్నం 10 am to 5 pm గం తెరవబడుతుంది. టాయిలెట్స్, రిఫ్రెష్మెంట్ సదుపాయాలు కార్యక్రమ స్థలంలో ఉంటాయి, మీకు వచ్చిన ఈ-మైల్ ప్రింట్ ఔట్ తీసుకురండి.
మహాశివరాత్రి ఇంగ్లీషు, తమిళ భాషల్లో జరపబడుతుంది. హిందీ, మాండరీన్ అనువాదాలు ఉంటాయి.
పాల్గొనవచ్చు, మీతో మీ మందులు తెచ్చుకోండి.
కార్యక్రమం జరుగుతున్నంత సేపూ కుర్చీలో కూర్చోవచ్చు.
మహాశివరాత్రి సమయంలో చిన్న పిల్లలు లేదా పసిపిల్లలను చూసుకోవడానికి మా దగ్గర సౌలభ్యాలు లేవు. మీరు కార్యక్రమానికి వచ్చేటప్పుడు వారిని చూసుకోవడానికి ఇంటిదగ్గరే ఏదైనా సదుపాయం చూసుకోమని మా ప్రార్థన. కార్యక్రమంలో పాల్గొనడానికి కనీసం 10 సంవత్సరాల వయస్సు ఉండాలి. మీరు కోయంబత్తూరులో ఉండి కుటుంబంతో సహా కార్యక్రమానికి రావాలంటే రావచ్చు.
కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి, మీరు కనీసం 15 రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది, అలా చేస్తే మీకు ఆశాభం ఉండదు. సీట్ల లభ్యతను బట్టి ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది.
మీరు విరాళం ఇచ్చిన తరువాత ఒక్కరోజులోపలే మీకు రిసీట్, మీ రిజిస్ట్రేషన్ నంబరుతో సహా మీకు ఈ మైల్ వస్తుంది. కార్యక్రమానికి ముందు మీకు ఈ మైల్ లో ఈ-పాస్ వస్తుంది.
పాల్గొనవచ్చు, మహాశివరాత్రి కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు.
అన్ని విభాగాల్లోనూ, ఒక్కొక్కరికీ ఒక్కొక్క సీటింగ్ పాస్. సీటింగ్ పాస్ లు ఒకరరినుంచి మరొకరికి మార్పిడి చేయకూడదు.
చేయవచ్చు, విరాళం ఎవ్వరైనా ఇవ్వవచ్చు. అందుకు రసీదు, విరాళం ఇచ్చి వారి పేరు మీద వస్తుంది. మీరు విరాళాన్ని భాగాలుగా చేయకూడదు.
లేదు
పార్కింగ్ కు మితమైన స్థలమే ఉంది. మీ వాహనాలకు మీరే జవాబుదారీ, కార్యక్రమం నిర్వహించేవారికి ఏ బాధ్యతా ఉండదు.
మీరు పాల్గొనవచ్చు.
సాంప్రదాయ వస్త్రాలు ఉత్తమం. ఆశ్రమంలో ఉన్నప్పుడు నిరాడంబర వస్త్రధారణ చేయండి. మగవారు, ఆడవారు భుజాలు, మోచేయి దాకా, కాలి మడమల వరకు, నడుము కప్పే వస్త్రధారణ చేయాలి. పాశ్చాత్య వస్త్రధారణ అయితే మగవారు, ఆడవారు మడమలదాకా ఉన్న పాంట్లు(కురచ లాగూలు వేసుకోరాదు), మోచేతుల దాకా కప్పే చొక్కాలు వేసుకోవాలి. మీ సౌఖ్యం కోసం, ఇక్కడి సంస్కృతిని గౌరవిస్తూ వంటిని అట్టిపెట్టుకుని ఉండే వస్త్రాలు ధరించకండి. యక్ష ఇంకా మహాశివరాత్రి సమయాల్లో భారతీయ సాంప్రదాయ వస్త్రాలు ధరించమని ప్రోత్సాహిస్తాము.
డిసెంబర్ నుంచి మార్చి వరకు ఆశ్రమంలో రాత్రిళ్ళు కాస్త చల్లగానూ, పగళ్ళు వెచ్చగానూ ఉంటాయి. కనీస ఉష్ణోగ్రత 17°C (62.6°F) గరిష్ట ఉష్ణోగ్రత 35°C (95°F) దాకా ఉండవచ్చు.
ఈశాయోగా కేంద్రంలో నీటి ఎద్దడి ఉన్నందవల్ల, బట్టలు ఉతుక్కోవడం సాధ్యం కాదు. లాండ్రీ సదుపాయం కూడా లేదు. కార్యక్రమం పూర్తయ్యేవరకు కావలసిన బట్టలు తెచ్చుకోండి.
కోయంబత్తూరు నుంచి ఈశాయోగా కేంద్రానికి టాక్సీలు, బస్సులు ఉంటాయి. గాంధీపురం టౌన్ బస్ స్టాండు నుంచి ఈశాయోగా కేంద్రానికి 14D, 14G బస్సులు ఉన్నాయి, ఉదయం 5.30 నుంచి ప్రతి అరగంటకు ఒక బస్ ఉంటుంది. ఈశా ట్రావెల్ ఫోన్:9442615436, 0422-2515430
టాక్సి: 0422-40506070, ఎయిర్ పోర్టు ప్రీ పైడ్: 99764 94000,
ఫాస్ట్ ట్రాక్ టాక్సి: 0422-2200000 (ఛార్జెస్ ముందుగానే తెలుసుకోండి).
ఓలా, ఊబెర్ మొబైల్ ఆప్స్.
లేవు, 10 సంవత్సరాలు వయస్సు పైనున్న వారు సామాన్య ఆరోగ్యంతో ఉంటే చాలు.
కార్యక్రమ స్వభావాన్ని బట్టి, దాని నుంచి మీరు సంపూర్ణంగా లభ్యి పొందడానికి, మీరు ప్రోగ్రాం సమయంలో ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గించడం ఉత్తమం. గమనిక: మొబైల్ ఫోన్ ఛార్జంగ్ సదుపాయం ఉండదు.
కార్యక్రమంలో పాల్గొనేవారి అందరికీ మహా అన్నదానం జరుగుతుంది. మీ ఆరోగ్య రీత్యా, మీరు మీ ఆహారం తెచ్చుకోవాలనుకుంటే, శాకాహార భోజనం తెచ్చుకోవచ్చు.
అఖ్కర లేదు.
కార్యక్రమం సాయంత్రం 6-గం ప్రారంభమౌతుంది. దయచేసి 5గం కల్లా మీ సీటులో కూర్చోండి. దేవి ఊరేగింపు 7 గం ప్రాంతంలో ప్రారంభమౌతుంది.
సద్గురు పూర్తిగా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు, అందువల్ల వీలుకాదు. మీరు పూర్తిగా కార్యక్రమ ప్రక్రియలో నిమగ్నం కండి, మీరు పూర్తిగా సూచనలు పాటించడం ద్వారా కార్యక్రమం నిర్వహించడంలో సహకరించండి. ఆయన కార్యక్రమ సమయంలో మనల్ని గైడ్ చేస్తుంటారు, మనం అందుకు సహకరిద్దాం.
ప్రదక్షిణం అంటే ఒక గొప్ప మూల శక్తిని గ్రహించగలగడానికి మనం దాని చుట్టూ సవ్యదిశలో తిరిగే ప్రక్రియ. ఈశా యోగా కేంద్రం భూమి ఉత్తరాంశంలో 11‘డిగ్రీల అక్షాంశం దగ్గర ఉన్నందున ఇది మరింత ప్రబలంగా ఉంటుంది. ఈ ఆదియోగి ప్రదిక్షణ సద్గురుచే రూపకల్పన చేయబడింది. ఇది ఆదియోగి అనుగ్రహానికి పాత్రులవ్వడానికి అనువుగా మార్చి, ముక్తి దిశగా వారు కృషిచేసేందుకు త్వరితం చేస్తుంది. ఇది అందరికీ అందుబాటులో ఉంచబడింది. ప్రదక్షణ సమయాలు: 4 మార్చి 2019, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఇంకా 2019 మార్చ్ 5న ఉదయం 6 నుంచి ప్రారంభం.
మూడు రోజుల యక్ష కార్యక్రమాల తరువాత మహాశివరాత్రి కార్యక్రమం రాత్రంతా జరగనుంది. మార్చి 1 – 3: యక్ష (సాయంత్రం 6 నుండి రాత్రి 8 వరకు) మార్చి 4: మహాశివరాత్రి (సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు)
ఉంది, మీరు విరాళంఇక్కడ ఇవ్వవచ్చు. గమనిక: ఈ లింక్ ద్వారా చేసిన విరాళం మీ సీటింగ్ పాస్ కు గాని, కాటేజి బుకింగ్ కు గాని వేరే ఏ ఇతర ఉద్దేశానికి ఉపయోగించకూడదు.
చేయవచ్చు, మామూలు విరాళం అలా చేయవచ్చు, మీరు భారతీయ ఖాతానుండి విరాళం ఇస్తున్నప్పుడు, మీరు భారతీయ మొబైల్ నం, ఇక్కడి అడ్రస్, PAN నం ఇవ్వవలసి ఉంటుంది. మీరు విదేశీ ఖాతానుండి విరాళం ఇస్తున్నప్పుడు, మీరు విదేశీ మొబైల్ నం, విదేశీ అడ్రస్, పాస్ పోర్టు కాపీ ఇవ్వవలసి ఉంటుంది. సీటింగ్ పాస్ విషయంలో చేసే విరాళం జాతీయత లేక నివాసం ఆధారంగా దానినికి తగిన స్వదేశి లేదా విదేశీ బ్యాంక్ ఎకౌంట్ నుంచి చేయాలి.
మంత్ర పఠనం చేయవచ్చు.
పాల్గొనవచ్చు
ఈశాయోగా కేంద్రంలో ప్రతి మహాశివరాత్రి ప్రత్యేకమైనదే. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది TV ల్లోనూ, వెబ్ స్ట్రీమ్ ద్వారానూ చూస్తారు, ఇంకా కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఈశాయోగా కేంద్రంలోనూ, మహాశివరాత్రి జరిగే ప్రదేశంలోనూ జరిగే గొప్ప ముందస్తు తయారీలో పాల్గోనగలగడం, వచ్చే స్వదేశ, విదేశీయులను ఆహ్వానించి, వారికి కావలసిన సహాయం అదించడగలగడం ఒక వరం. క్రియాశీలంగా మీకు మీరు సమర్పించుకోవడం కూడా, ఈ శక్తివంతమైన ప్రక్రియలో మీ గ్రాహ్యతను పెంచే విధానం. వాలంటీర్ రిజిస్ట్రేషన్ త్వరలో ప్రకటించబడుతుంది. వాలంటీర్ లింక్
మహాశివరాత్రి సాధన ఎన్నో అవకాశాలను అందించే మహాశివరాత్రికి ముందస్తు తయారీ. ఈ సాధన ఎనిమిది ఏళ్లు దాటిన వారెవరైనా చేయవచ్చు, ఈ సాధనని 2019 మర్చి 4 న వచ్చే మహాశివరాత్రికి ముందు 40,21,14, 7 లేక 3 రోజుల ముందు ప్రారంభం చేయవచ్చు.. ఈ సాధన ఉద్యాపన ధ్యానలింగం దగ్గర (లేక మీ ఇంటి దగ్గర) చేయవచ్చు. మరింత సమాచారం కొరకు ఈ .లింక్ చూడండి మీరు మంత్ర పఠనాన్ని, శివనమస్కారాన్ని ఈ వీడియోలో చూడవచ్చు
మహాశివరాత్రికి ముందు జరిగే అద్భుతమైన సంగీత, నృత్య కార్యక్రమం. యక్ష కార్యక్రమం 2019 మార్చ్ 1 నుండి 3 వరకు ఈశాయోగా కేంద్రంలో జరుగుతుంది. భారతీయ కళల ప్రత్యేకతను, వైవిధ్యాన్ని సంరక్షించి వాటిని ప్రచారంలోకి తీసుకు రావడంకోసం ప్రఖ్యాత కళాకారులు ప్రదర్శించే సంగీత, నృత్య ప్రదర్శనలను మూడురోజుల యక్ష కార్యక్రమం ఈశా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. విశిష్టమైన భారత ప్రాచీన సంస్కృతిని ఆస్వాదించడానికి మిమ్మల్ని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము
సద్గురు చేతుల ఎలా పెట్టాలో ఏ విధమైన సూచనా ఇవ్వలేదు. మీకు సౌఖ్యంగా ఉండేలా మీరు చేతులని ఎలాగైనా పెట్టుకోవచ్చు.
సాధన కాలం అంతా అలాంటివే వేసుకోవాలి.
సాధనా కాలంలో ఏ కారణం గానూ ఆ నల్ల గుడ్డను తీయకూడదు.
విభూతి మాత్రమే పెట్టుకోండి. అదికూడా ఈశా నుంచి తెప్పించుకున్నదే, ఎందుకంటే అది నమ్మకమైంది, శక్తివంతం చేసింది.
వేప, బిల్వ పత్రాలు ప్రపంచంలో అన్ని చోట్లా ఇండియన్ స్టోర్సులో దొరుకుతుంటాయి. అవి దొరక్కపోతే మీరు ఆన్ లైన్ లో వేప పొడి తెప్పించుకోవచ్చు. దానిని చిన్న ఉండలు చేసి తీసుకోవచ్చు. అవి రెండూ దొరక్కపోతే ఉద్యాపనలో ఆ విషయాన్ని వదిలివేయవచ్చు.
వరుస క్రమం అంటూ ఏమీ లేదు. కాని శివనమస్కారాన్ని సూర్యోదయానికి ముందుగాని, సూర్యాస్తమయం తరువాత గాని చేయాలి.
సూచనలు. మీరు 8 నుంచి 10 మిరయాల గింజలు, రెండు మూడు బిల్వ లేక వేప ఆకులు తేనెలోనూ, గుప్పెడు వేరుశెనగ పప్పులు నీళ్లలోను, ఆ ముందురోజు రాత్రి నాన బెట్టాలి. ఉదయం శివనమస్కారం, స్తుతి అయిన తరువాత ఆకులు నమిలివేయాలి, మిరియాలను తేనె కాస్త నిమ్మరసంతో కలిపి తినేయండి. వేరుశనగ పప్పులు కూడా తినండి. మీకు వేప, బిల్వ ఆకులు దొరక్క పోతే, వేప పొడి IshaShoppe.com లో దొరుకుతుంది. మీరు వీటిని తీసుకునేముందే శాంభవీ మహాముద్ర, రోజువారి సాధనలు పూర్తి చేయండి.
సాధనను ఆరంభించేముందు దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని అలా వెలగనివ్వడం ఉత్తమం. మీరు పెద్ద మైనం వత్తి వాడితే అలా వదిలేయడం ప్రమాదంగా భావిస్తే, మీరు సాధన తరువాత ఒక పువ్వుతోనే, చేతితోనో గాలి విసిరి ఆర్పివేయండి, ఊది వేయవద్దు.
మీరు నల్లగుడ్డను సాధన సమయం అంతా(40, 21, 14, 7 లేక 3 రోజులు) వేసుకోవాలి, ఆ సమయంలో మీరు ఆ గుడ్డతీయగూడదు.
ఈశా కేంద్రంలో దొరికే స్నానం పౌడర్ వాడవచ్చు. అది మీకు దొరక్క పోతే మీరు ఏ కెమికల్స్ లేకుండా ఉన్న ఏ ఆర్గానిక్ పౌడరైనా వాడవచ్చు.
సాధన మొదలు పెట్టేముందు పెట్టుకోండి, తరువాత దానిని అలాగే వదిలేయండి. మీరు ఇంట్లో విభూతిని తయారు చేయలేరు, దానిని నమ్మకమైన చోటునుండి తెప్పించుకోండి. మీరు ఈశా యోగా కేంద్రం నుంచి తెప్పించుకున్నదైతే మంచిది, అది శక్తిమంతం చేసింది కూడా.
సాధన చేసేవారికి మద్యాహ్నం 12 తరువాత భోజనం దొరుకుతుంది. మిరియాలు, వేరుశనగ పప్పులు, నిమ్మకాయలు లాంటివి మాత్రం మీరు ఏర్పాటు చేసుకోవాలి.
నల్ల బట్టను చేతికి కట్టుకోవాలి.
మీరు మహాశివరాత్రి సాధన చేయాలని సంకల్పించినప్పుడు, ప్రతిరోజూ సాధన చేయాలన్న నిబద్ధత అవసరం. అలాంటి నిబద్ధత మీకు ఉంటే, అది చేయడానికి మార్గం మీకు దొరుకుతుంది. మీరు సూర్యోదయానికి ముందే సాధన పూర్తి చేసుకోవచ్చు, అందువల్ల మీరు ముందుగానే లేచి మీ దిన చర్య మొదలు కాకముందే మీ సాధన పూర్తి చేసుకోండి. ఈ సాధన చాలా శక్తివంతమైనది, మీ జీవితాన్ని పరిణామం చేసే శక్తి దానికి ఉంది, అందువల్ల దానిని ఎలా చేయాలో మీరే చూడండి.
రాత్రి జాగరణ చేయడం అనేది సాధనలో భాగం. మీరు చేసిన 40 రోజుల సాధనాఫలం అందుకునే సమయం ఇది, అందువల్ల దానినుంచి పూర్తి ఫలితం పొందండి. చన్నీటి స్నానం, తల తడిగా ఉంచుకోవడం, వాకింగ్ కు వెళ్లడం ఇలా మీరు మేలుకుని ఉండడానికి ఏవి ఉపకరిస్తాయో వాటన్నింటినీ ఉపయోగించుకోండి. మీ ప్రాంతంలో ఈ ఉత్సవాలు జరుగుతుంటే అక్కడకు వెళ్లండి. మీరు ఈశా లైవ్ వెబ్ స్ట్రీమ్ కూడా చూడవచ్చు.
చేయవచ్చు, సద్గురు ఈ మహాశివరాత్రికి ఈ క్రింది సాధనలు ఇచ్చారు:
1. .శివాంగ సాధన మగవారికి ఇది వెల్లంగిరి పర్వతాలకు ట్రెక్ తో సమాప్తమౌతుంది. వివరాలకు: Shivanga Sadhana and Initiation Schedule
2. మహాశివరాత్రి సాధన (ఆడవారికి, మగవారికి) 40/21/12/7/3 రోజుల సాధన. సమాపనం ధ్యానలింగ దగ్గర (లేక అవసరాన్నిబట్టి ఇంటి దగ్గర).
మరిన్ని వివరాలకు చూడండి: Mahashivratri Sadhana Instructions & Guidelines
మీరు క్రింద ఉన్న లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోగలరు: click here
శాంభవి మహాముద్ర క్రియలో ఉపదేశం పొందిన వారు మాత్రమే వాలంటీరింగుకు అర్హులు. వాలంటీర్లందరూ కనీసం ఏడు రోజులకు ముందు, అంటే 14 ఫిబ్రవరి లోపు ఆశ్రమానికి చేరుకోవాలి.
భారతీయులు తమ పాస్పోర్ట్, ఓటర్ ID కార్డు, డ్రైవింగ్ లైసెన్సు లేక ఆధార్ కార్డు తీసుకు రావడం అవసరం.
గమనిక: మీరు ఫోరంలో వాడిన ID కార్డుని మాత్రమే మీతో తీసుకునిరండి.
మహాశివరాత్రి సంబరాలకు వచ్చిన వారందరూ వాలంటీరింగ్ చేయగలరు. వాలంటీయర్ల శ్రద్ధ, అంకిత భావం లేకపోతె ఇంతటి స్థాయిలో ఈ కార్యక్రమం సాధ్యం కాదు. కానీ ఈశా యోగా కేంద్రంలో మౌళిక సదుపాయాల కొరత వల్ల 17 పిభ్రవరి తరువాత వచ్చిన వారికి, వాలంటీర్లకు ఇచ్చిన వసతి సౌకర్యాలను అందించలేము.
వాలంటీర్లు అందరూ తాత్కాలిక వసతి సదుపాయాలలో బస చేస్తారు. ఇవి శివరాత్రికి మాత్రమే ప్రత్యేకంగా నిర్మించబడుతున్నాయి. వాలంటీర్లందరూ అందుకు తగినట్టు ఏర్పాటు చేసుకోవాలి. క్రింద నున్న ఆరవ జవాబులో మీరు తీసుకురావలసిన వస్తువుల గురించి విశదంగా తెలుసుకోండి. ఆధ్యాత్మిక అనుభూతిని అందరికీ పంచడం అన్నదే మహాశివరాత్రి సంబరాల లక్ష్యం, అందువల్ల మీకు ఏదైనా అసౌకర్యం కలిగినట్లైతే దానిని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము.
ఆశ్రమము ఎటువంటి పక్క బట్టలు సరఫరా చేయదు. వాలంటీర్లు వారి వారి పక్కకు కావలసినవి వారే తెచ్చు కోవాలి. యోగ మాట్ / పరుపు (మీకు అవసరమయితే) దుప్పటి ఇంకా దిండు. డిసెంబరు నుండి మార్చ్ నెల వరకు ఇక్కడ రాత్రులు కొద్దిగా చలిగా ఉంటూ పగలు కొంత వేడిగా ఉంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రత అత్యుత్తమ శ్రేణి 35°C (95°F) నుండి కనీస ఉష్ణోగ్రత 17°C (62.6°F) ఉంటుంది. మీరు రాత్రులు కప్పుకోవడానికి ఒక కంబళి, మీరు వేసుకోవడానికి వెచ్చని దుస్తులు తప్పక తీసుకొనిరండి.
గమనిక: కుటుంబ సభ్యులు కలిసి వచ్చినా వారికి బస వేరు వేరుగా దొరకవచ్చు, అందువలన వారి వారి వస్తువులు విడిగా తెచ్చుకోవాలి,
వ్యక్తిగత అవసర వస్తువులు
టార్చ్ లైటు
గొడుగు
దోమల నుండి కాపాడుకోవటానికి క్రీము
పడక వస్తువులు
సరిపడినన్ని దుస్తులు
వెచ్చని దుస్తులు (శాలు, స్వేటరు వంటివి)
మందులు (మీకు ఆదేశించినవి, తలనొప్పి, జ్వరం, వంటి నెప్పులు, కడుపు నొప్పి ఇంకా అజీర్తికి మీరు వాడుకోగలిగినవి.)
లగేజీకి తాళం
పవర్ బ్యాంకులు
యోగ మాటు
స్లీపింగ్ బాగ్ ( మీకు సాధ్యమయితే )
వాటర్ బాటిల్
ఎండ నుండి కాపాడుకోవటానికి టోపీ
ఈశా యోగా కేంద్రం సురక్షితమైన ప్రదేశము. సెక్యూరిటీ మనుషులు ఇరవై నాలుగు గంటలు తమ డ్యూటీలో ఉంటారు. ఇంతటి స్థాయిలో జరుగుతున్న కార్యక్రమము కనుక మీరు మీ వస్తువులను సురక్షితంగా ఉంచుకోవడం మంచిది. మీరు మీ వసతి ఇంకొకరితో కలిసి పంచుకుంటున్నారు కనుక విలువైన వస్తువులు, నగలు లేక విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని రాకండి. మీ వస్తువుల జాగ్రత్త కొరకు మీతో తాళం ఉంచుకుని మీ లగేజీని తాళం వేసి ఉంచుకోండి.
కొన్ని ఛార్జింగ్ సౌకర్యాలు వాలంటీర్లు ఉండే ప్రదేశంలో లభ్యమవుతాయి. మీ ఫోనును ఛార్జింగ్ కి పెట్టి వదిలివెయ్యకండి. మీ సొంత మొబైల్ పవర్ బ్యాంకులు తెచ్చుకోవడం మంచిది.
వాలంటీర్లు 17 ఫిబ్రవరికి తప్పకుండా ఆశ్రమానికి చేరుకోవాలి, 23 వరకు ఉండాలి. ఈ కార్యక్రమం సఫలం కావడానికి ఎంతో తయారీ అవసరం కనుక మీరు జనవరిలోనే చేరుకోవడం మంచిదని మా సలహా.
మహాశివరాత్రి సమయంలో వాలంటీర్లు వారికి ప్రత్యేకంగా కేటాయించిన ‘వాలంటీర్ బే’లో కూర్చుంటారు. మీరు ప్రత్యేకమైన సీటింగ్ పాస్ తీసుకోవలసిన అవసరం లేదు.
వాలంటీర్లుగా, ఎంతో మందికి, మహాశివరాత్రి కార్యక్రమం యొక్క అనుభవం మన మీద ఆధారపడి ఉంటుంది. రాత్రి పొడుగునా వాలంటీర్లకు వివిధ కార్యకలాపాల బాధ్యత ఇస్తాము. ఒకసారి మీరు వాలంటీరుగా సమర్పించుకోవాలి అని నిశ్చయించుకున్నప్పుడు మీరు ఈ శివరాత్రికి పూర్తి రాత్రి వాలంటీర్ గానే భాగం పంచుకోవాలని మా సలహా. ఈ కార్యక్రమం యొక్క అనుభవం వాలంటీర్ గా మనల్ని మనం సమర్పణ చేసుకున్నప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ మీకు సీటింగ్ పాస్ తీసుకోవాలని కోరికగా ఉంటే మీ ఏరియా కోఆర్డినేటర్ తో సంప్రదించండి.
ప్రాచీన భారతీయ దుస్తులను ప్రోత్సహిస్తున్నాము. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆడంబరంలేని దుస్తులు ధరించాలని కోరుతున్నాము. ఆడవారు, పురుషులు కూడా వారి దుస్తులతో వారి వారి భుజాలను, పై చేతులను, నడుమును, మడమల వరకు కాళ్ళను ఎల్ల వేళలా కప్పి ఉంచాలి. సరైన పాశ్చాత్త్యా దుస్తులు – మడమల వరకు ఉన్న ప్యాంట్లు ఆడ, మగ వారికి కూడా.(షార్ట్స్, కాప్రిలు కాదు). చేతుల పై భాగాలను కప్పి ఉంచే పొడవైన షర్టులు. బిగువైన దుస్తులను వేసుకోకండి – ఇది మీ సౌకర్యంకోసం మాత్రమే కాదు స్థానిక సంస్కృతికి గౌరవమివ్వడ౦ కూడా.
యక్ష మరియు మహాశివరాత్రి సందర్భంగా భారతీయ సంప్రదాయ ఉత్సవ దుస్తులు ప్రోత్సహిస్తున్నాము.
యోగ సెంటరులో తీవ్రమైన నీటి కొరత ఉన్నందువల్ల, మీ బట్టలు ఉతుక్కోవడం సాధ్యపడదు. లాండ్రి సదుపాయం కూడా లేదు. మీరిక్కడ ఉండే పూర్తి సమయానికి సరిపడా దుస్తులు తీసుకొని రండి.
చేయగలరు.
చేయవచ్చు. మీతో మీ మందులను తప్పక తీసుకొని రండి.
శాంభవి మహాముద్ర క్రియ ఉపదేశం ఉన్నవారే వాలంటీర్ వసతిలో ఉండడానికి అనుమతి ఉంది. ఇతర కుటుంబ సంభ్యులు, అతిథులు, మహాశివరాత్రి సంబరాలకు రిజిస్టర్ చేసుకుని రాత్రి పొడుగునా జరిగే కార్యక్రమాలలో పాల్గొనగలరు.
ఈషా యోగ సెంటర్లో పిల్లలను చూసుకోవడానికి సౌకర్యాలు, వసతులు లేవు. మీరు ఇక్కడ ఉన్నప్పుడు వారిని ఇంటివద్దనే వదిలి రావడం మంచిది.
కొంత పార్కింగ్ వసతి లభ్యమవుతుంది. మీ వాహనాన్ని ఇక్కడ తయారీలో ఉపయోగించాలని మీరు కోరుకుంటే అది కూడా సాధ్యం.
సాధారణమైన ప్రాధమిక చికిత్సా సదుపాయాలు ఉన్నాయి. కానీ, దగ్గరి హాస్పిటలుకి వెళ్లాలంటే మామూలు ట్రాఫిక్ లో దాదాపు గంట సమయం పడుతుంది. మహాశివరాత్రి సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. మెడికల్ షాప్ ౮ కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు కావలసిన మందులు మీతో తప్పక ఉంచుకోండి.
తప్పక చేసుకోవచ్చు. వర్కుషాప్ లో రిజిస్టర్ చేసుకుని మహాశివరాత్రి వాలంటీర్ గా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
మీకున్న ఏ ఇతర ప్రశ్నలకైనా, మీరు +91 83000 83111 కి ఫోను చెయ్యండి, లేక info@mahashivarathri.org కి మెయిల్ పంపించండి.