seperator

"పౌర్ణమి నాటి రాత్రి, లోపల ఇంకా బయట కూడా ఒక అధిక స్థాయి శక్తి ఉంటుంది. ఆరోగ్యము , ఆనందము ఇంకా విజయాల కోసం ఈ శక్తిని వినియోగించుకునేందుకు మార్గాలు ఉన్నాయి" - సద్గురు

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి, పౌర్ణమి నాటి రాత్రులు ధ్యానానికి చాలా సానుకూలంగా ఉంటాయి, ఎందుకంటే ప్రకృతి మనకి ఒక ఉచిత శక్తిని అందిస్తుంది. 28 మార్చి 2021 నుండి మొదలుకొని, 12 పౌర్ణములు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్వేషకులు పౌర్ణమి రాత్రిన గల ఆధ్యాత్మిక సంభావ్యతలకు ఒక తలుపు తెరుస్తూ, సద్గురు మనకి సత్సంగాలని అందిస్తారు.

ఈ సత్సంగం, ప్రతి పౌర్ణమిని, మీ అనంత స్వభావాన్ని తెలుసుకునే దిశలో మార్గంగా, ఇంతకు ముందెన్నడూ లేనటువంటి ఒక సరికొత్త సంభావ్యత కాగలదు.

buring questions
 
మిమ్మల్ని దహించి వేసే ప్రశ్నలకు సమాధానాలు పొందండి.
meditations
 
శక్తివంతమైన ధ్యాన ప్రక్రియలో జాయిన్ అవ్వండి.
satsang
 
ఒక సజీవ గురువు సమక్షంలో జీవంలోని లోతైన పార్శ్వాన్ని అన్వేషించండి

మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు

seperator
  • రిజిస్ట్రేషన్ ఉచితం ఇంకా తప్పనిసరి.
  • 28 మార్చి 2021 నుండి మొదలుకొని 12 పౌర్ణములు సత్సంగాలు జరుగుతాయి.
  • ప్రతి సత్సంగం ఈ టైమ్ జోన్లలో సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతుంది - IST, CET, PT ఇంకా ET.
  • 1.5 నుండి 2 గంటల సమయాన్ని ఇందు కోసమే కేటాయించేందుకు తయారు కండి.
  • అన్ని వయసుల వాళ్లు చేయవచ్చు. ఎటువంటి వయోపరిమితి లేదు.
  • ఇదివరకే ఈశా యోగ ప్రోగ్రాంలు చేసి ఉండాల్సిన అవసరం లేదు.

ఉచితంగా రిజిస్టర్ చేసుకోండి

ఈ సత్సంగం నుంచి అత్యధిక ప్రయోజనాన్ని పొందడం ఎలా

seperator

మీ గ్రహణ శీలతను పెంచి, మిమ్మల్ని ఈ అవకాశాన్ని ఉత్తమంగా వినియోగించుకునేలా చేసే కొన్ని సూచనలు:

  • ఈ సత్సంగాన్ని సమగ్రతతో అనుభూతి చెందడం అనేది చాలా ముఖ్యం. దయచేసి ఈ సమయాన్ని ప్రత్యేకంగా దీని కోసమే కేటాయించండి, అలాగే ఈ 1.5 నుండి 2 గంటల సమయంలో ఎటువంటి అంతరాయం (బాత్ రూమ్‌‌కు వెళ్ళటం, ఫోన్ మాట్లాడటం లేదా మెసేజ్ లు చెక్ చేయడం వంటివి) లేకుండా చూసుకోండి.
  • మీకు ఒక స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోండి.
  • ఈ సత్సంగంలో పాల్గొనేందుకు ఒక లాప్టాప్ ని గానీ లేదా ఒక కంప్యూటర్ ని గానీ వాడటం ఉత్తమం .
  • దయచేసి సాయంత్రం ఏడు గంటలకల్లా జాయిన్ అయ్యేలా చూడండి, ఎందుకంటే సత్సంగం మొదలయిన తరువాత మీరు జాయిన్ కాలేక పోవచ్చు. సమయానికి కనీసం 15 నిమిషాల ముందుగానే లాగిన్ అవ్వడం ఉత్తమం. ప్రారంభ సమయానికి 30 నిమిషాల నుండి లాగిన్ అయ్యే వీలు ఉంటుంది.
  • దయచేసి మీరు కొద్దిగా ఖాళీ కడుపుతో ఉండేట్టు చూసుకోండి (మీరు తిన్న క్రితం భోజనం నుండి కనీసం 2.5 గంటల వ్యవధి ఉండాలి), అలాగే సత్సంగం సమయంలో ఏమీ తినకండి.
  • మీరు ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు (ఇది తప్పనిసరి కాదు).
  • వీలైతే, నేల మీద కూర్చోవడం ఉత్తమం. లేకపోతే, మీరు కుర్చీలో కూర్చోవచ్చు.

రాబోయే సత్సంగాలు

seperator

మార్చి 2021 నుండి, ప్రతి పౌర్ణమి రోజున సద్గురు సత్సంగాలు అందిస్తున్నారు. రాబోయే సత్సంగాల తేదీలు ఇక్కడ తెలుసుకోండి.

18 జనవరి 2022

తరచుగా అడిగే ప్రశ్నలు

మమ్మల్ని సంప్రదించండి

seperator