ప్రభుత్వం విలువైన పని ఏమైనా చేసిందా లేదా అని అంచనా వేసేందుకు ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకూ మీకు అవకాశం ఉంటుంది. వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే, వోటువేయకుండా దింపేయండి. కాని, ఒకసారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక, ప్రభుత్వానికి చేదోడుగా నిలిచి దేశానికి ఉత్తమమైన రీతిలో మన వంతు సహాయం అందించడం మన ప్రాధమిక కర్తవ్యం.