ఈ వ్యాసంలో వెన్నెముక, మెదడులకు సంభందించిన శస్త్రచికిత్సలు ఆధ్యాత్మిక సాధనని ఎలా ప్రభావితం చేస్తాయి అన్న విషయం గురించి, అలాగే మన గ్రహణశక్తిని పెంపొందించడంలో వెన్నెముక ప్రాముఖ్యత గురించి సద్గురు  వివరిస్తారు.


ప్రశ్న: సద్గురు, ఒక వేళ శస్త్ర చికిత్స లేదా ఇతర వైద్య ప్రక్రియలేవైనా ఒకరి మెదడు లేదా వెన్నెముక మీద జరిగి ఉంటే, అది వారి కుండలినినీ, అలాగే వారి ఆధ్యాత్మిక సాధననీ ఏమైనా ప్రభావితం చేస్తుందా?

సద్గురు: అదృష్టవశాత్తూ, సర్జన్లు శక్తిచక్రాల మీద ఆపరేషన్లు చేయడం లేదు, వారు మీ శరీరం మీద మాత్రమే ఆపరేషన్ చేస్తున్నారు. ఏంతో అవసరమయితే తప్ప మీరు మెదడు శస్త్ర చికిత్సకు వెళ్లరు కాబట్టి, దాని గురించి మాట్లాడనవసరం లేదు. మీరు జుట్టుని తిరిగి ట్రాన్స్‌ప్లాంటు చేయించుకోవడానికి వెళుతూ ఉండి ఉండవచ్చు, కానీ మీరు దానిని కూడా మానుకోవడం మంచిది. జుట్టు లేకపోకవడం వల్ల చాలా సమయం ఆదా అయ్యి మీకు సాధన కోసం మరింత సమయం లభిస్తుంది కదా!

వెన్నెముక శస్త్ర చికిత్సలు మనుషులను ప్రభావితం చేయవచ్చు. శస్త్ర చికిత్సలకు, ప్రక్రియలకు వెళ్ళే కన్నా మీ వెన్నుముకని బలపరచుకోవాడం మంచిదని మేము ఎప్పడూ సలహా ఇస్తాం. అక్కడ ఏమి జరుగుతుందో నిజంగా తెలిసిన వారు తప్ప, ఆ ప్రాంతాన్ని వేరే వారెవరూ ముట్టుకోకూడదు.

  ప్రస్తుతం మీ అనుభూతులన్నిటికీ మీ వెన్నెముకే ఆధారం. మీరు మీ పరిమితులని అధిగమించాలనుకుంటే, ఇది చాలా ముఖ్యమయిన భాగం

ప్రస్తుతం మీ అనుభూతులన్నిటికీ మీ వెన్నెముకే ఆధారం. మీరు మీ పరిమితులని అధిగమించాలనుకుంటే, ఇది చాలా ముఖ్యమయిన భాగం. వంటికి మాలీష్ చేయడం లాంటి ప్రక్రియలు చేయించుకోకూడదని చెప్పడం అందుకోసమే తప్ప, అవి సరైనవి కాదని కాదు. మీరు మీ గ్రహణశక్తిని పెంచుకోవాలానుకుంటే, అది మీ వెన్నెముక నుండే పెరుగుతుంది. అందువలనే వెన్నెముకకు చేసే చికిత్సలు వీలయినంతవరకు మానుకోవాలి. మీకు ఏదైనా ఆక్సిడెంట్ లేదా గాయం అయ్యి సర్జరీ చేస్తే తప్ప సరికాని పరిస్థితి ఉంటేనే చేయించుకోవాలి, లేకపోతే వెన్నెముక సర్జరీలు చేయించుకోకూడదు. ఏదైనా కొంచం నొప్పి లేదా అసౌకర్యం అనిపిస్తే దానిని సరి చేసుకోవచ్చు. అలా చేయటానికి మీరు కొంత శ్రమచేయవలసి వస్తుంది, కాని అది మీరు చేయగలరు. మీ శరీరంలోని ఇతర భాగాలకన్నా మీ వెన్నెముక త్వరగా కోలుకోగలదు.  వెన్నెముక పూసలు మొత్తం అరిగిపోయిన కొన్ని వేల మంది కేవలం కొన్ని సాధనలు చేయడం ద్వారా పూర్తిగా కోలుకున్నారు.

ప్రాణానికి సంబంధించినంతవరకూ, వెన్నెముక ఎంతటి క్రియాశీలమయిన ప్రాంతమంటే, అది అతి త్వరగా కోలుకొని కోల్పోయిన కణాలను తిరిగి సృష్టించగలదు.

ప్రాణానికి సంబంధించినంతవరకూ, వెన్నెముక ఎంతటి క్రియాశీలమయిన ప్రాంతమంటే, అది అతి త్వరగా కోలుకొని కోల్పోయిన కణాలను తిరిగి సృష్టించగలదు. మీ మెదడులో కూడా ఇది చాలా తేలికగా జరుగుతుంది. మతిమరపు వ్యాధితో బాధపడుతున్న వారు కూడా సరైన పనులు లేదా ప్రక్రియలు చేస్తే, వారు తమ మెదడులో ఆ సంబంధిత భాగాలను తిరిగి సృజించుకోగలరు. ప్రస్తుతం మీ జీవితంలో కూడా మీరు మీ మెదడుని ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే దానిని బట్టి ఎన్ని న్యూరాన్లు క్రీయాశీలంగా ఉన్నాయనేది ఆధారపడి ఉంటుంది. మీరు ఉత్సాహంగా లేకపోయినా, మత్తులో ఉన్నా, బాధగా ఉన్నా క్రీయాశీలక న్యూరాన్ల సంఖ్య తగ్గవచ్చు. సరైన పనులు(యోగ ప్రక్రియలు) చేయడం ద్వారా మీరు ఆ సంఖ్యను పెంచవచ్చు. ప్రతి ఒక్క మనిషికీ, వారు ఎవరైనా కూడా, ఇది ఒక వరం లాంటిది. ఈ ప్రపంచానికి మరింత మేధస్సు అవసరం.

మెదడు ఎంతో సంక్లిష్టమయిన యంత్రం. చాలా మంది దానిని ఉపయోగించడానికి సరైన శిక్షణ ఎన్నడూ పొందలేదు. దానిని ఉపయోగించడానికి ఒక స్థాయి అంకితభావం, ఏకాగ్రత కావాలి.

బ్లూ బ్రెయిన్ ప్రాజెక్టు అనే పరిశోధనలో హెన్రీ మార్క్రాం మెదడు మీద అసాధారణ పరిశోధన చేశారు. మానవ మెదడుని పూర్తిగా మ్యాప్ చేయటం ఇదే మొదటిసారి. వారు దాదాపు ఒక ఎలెక్ట్రానిక్ మెదడుని సృష్టించారు - కీ బోర్డుతో అనుసంధానమైన మానవ మెదడుని తయారు చేశారు. ఇప్పడు మీ సమస్య ఏమిటంటే, మీ వద్ద మెదడు ఉంది, కానీ కీ బోర్డు లేదు. ఏదో ఒకటి పని చేస్తుంది, మరొకటి పని చేయదు. మీ మెదడుకు పూర్తి సామర్ధ్యంతో ఉన్న ఒక కీ బోర్డు ఉంటే, మీరు దాని ద్వారా మీకు కావలసినది టైపు చేయగలిగితే, మీరు ఇప్పుడున్న దానికంటే వెయ్యి రెట్లు సమర్ధవంతంగా పనిచేయవచ్చు, ఎందుకంటే మానవ మెదడు చాలా సంక్లిష్టమైన పనులను చేయగలదు. మెదడు ఎంతో సంక్లిష్టమయిన యంత్రం. చాలా మంది దానిని ఉపయోగించడానికి సరైన శిక్షణ ఎన్నడూ పొందలేదు. దానిని ఉపయోగించడానికి ఒక స్థాయి అంకితభావం, ఏకాగ్రత కావాలి. చాలా మంది వారి కంప్యూటర్ సామర్ధ్యంలో కేవలం చాలా తక్కువ శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారని నేను అనుకుంటున్నాను. కంప్యూటర్ అనే యంత్రాన్ని ఎన్నో విధానాలుగా వాడుకోవచ్చు, కానీ అది ఎలానో అందరికీ తెలియదు. మెదడు కూడా అటువంటిదే - అది చాలా చేయగలదు, కానీ దానిని ఎలా వాడుకోవాలో మీకు తెలియదు - అదే సమస్య.

ప్రేమాశీస్సులతో,
సద్గురు