'ఉప యోగా' ఎందుకు చేయాలి?
మనము అర్ధం చేసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే యోగా ఒక రకమైన వ్యాయామం కాదు. కానీ యోగాలో ఉప యోగా వంటి శక్తివంతమైన వ్యాయామ పధ్ధతులు కూడా ఉన్నాయి. వ్యాయామం కావాలనుకునే చాలా మందికి ఉప యోగా ఒక మంచి ప్రారంభం కావచ్చు. ఎందుకంటే అది దానికదే ఒక శక్తివంతమైన వ్యవస్థ.
భారతీయ భాషలలో ‘ఉప యోగా’ అనే పదము యొక్క అర్థం దురదృష్టవశాత్తూ దిగజారిపోయి ‘ఏదైతే ఉపయోగపడుతుందో అది’ గా మారిపోయింది. ఉప అనే పదానికి అర్ధం క్రింద స్థాయి అని, అందువల్ల ఉప యోగా అంటే క్రింద స్థాయి యోగా అని అర్థం. ఐక్యమయిపోవడం కోసమే యోగా. అంటే యోగా అనేది తన పరమోన్నత స్వభావానికి చేరుకోవాలనుకునే నిబద్ధత గల సాధకుడికి కొరకే. అటువంటి కోరికా, ఉద్దేశ్యమూ లేని వారికీ, తమ అస్థిత్వ మూలంతో కలిసిపోవడానికి సిద్ధంగా లేనప్పటికీ, సంసారిక జీవనంలో పడి కొట్టుకపోకూడదనుకునే వారికీ అందించబడేదే ఈ సెమీ-యోగా లేదా ఉప యోగా.
కాలక్రమేణ, వాడుక భాషలో ‘ఉప యోగా’ అంటే ‘ఉపయోగపడే యోగా’ లేదా ‘ఉపయోగపడే చర్య’ అని అర్థంచేసుకోవడం జరిగింది. కాని దేనిని కూడా అలాంటి దృక్పధంతో చూడకూడదు. నిజానికి మనం ఒకదాన్ని దానిలోని ఉపయోగం ఏమిటనే భావనతో మాత్రమే చూడకూడదు. దానిలో అంతకు మించినది కూడా ఉండవచ్చు. మీకు గనుక ఒకదాని పట్ల దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దృక్పధం లేకపోతే, అప్పుడది మీకు ఎంతో ఉపయోగపడడమే కాకుండా, ‘మీరు’ అనే మీ మౌలిక భావననే సమూలంగా మార్చివేస్తుంది.
ఈ క్రింది వీడియో ద్వారా మీరు ఉప యొగాను నేర్చుకొవచ్చు:
ఉప యోగాలో లోతైన ఆధ్యాత్మిక కోణం లేదు, ఇది మనిషి యొక్క భౌతిక, మానసిక, శక్తి పార్శ్వాల కొరకు రూపొందిచబడినది. ప్రస్తుతం ఉన్న దానికంటే ఇంకొంచం పరిపూర్ణమైన భౌతిక జీవనం కావాలనుకునే వారి కోసం ఇది రూపొందిచబడినది . నేను భౌతికత అన్నప్పుడు, అది మానసిక, భావోద్వేగ అంశాలకు కూడా వర్తిస్తుంది. మనము అర్ధం చేసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే యోగా ఒక రకమైన వ్యాయామం కాదు. కానీ యోగాలో ఉప యోగా వంటి శక్తివంతమైన వ్యాయామ పధ్ధతులు కూడా ఉన్నాయి. వ్యాయామం కావాలనుకునే చాలా మందికి ఉప యోగా ఒక మంచి ప్రారంభం కావచ్చు. ఎందుకంటే అది దానికదే ఒక శక్తివంతమైన వ్యవస్థ. యోగాను ఒక వ్యాయామంగా చేయటం కంటే ఉప యోగాను చేయడం చాలా మంచిది.
మీరు నిద్రపోయినప్పుడు, చాలాసేపు పడుకుని కదలకుండా ఉంటారు. అలా ఉన్నప్పుడు మీ శక్తి వ్యవస్థలో కొంత జడత్వము ఏర్పడుతుంది. అప్పుడు మీ కీళ్లలో కావలసినంత లూబ్రికేషన్ ఉండదు. మీ కీళ్ళను లూబ్రికేట్ చేయకుండా కదిలిస్తే అవి ఎక్కువ రోజులు పనిచేయవు. ఒక మనిషికున్న స్వేచ్ఛంతా కూడా తనకున్నటువంటి కీళ్ళ వల్లనే. కీళ్ళు శక్తి భాండాగారాలు. కీళ్ళలోని నాడులు ఒక నిర్దిష్ట విధానంలో ప్రవర్తిస్తాయి. ఉపయోగాలోని ఒక అంశము కీళ్ళలోని కందెనను (లూబ్రికంట్ను), శక్తి స్థానాలను ఉత్తేజపరచటమే. అందువల్ల మీ తక్కిన వ్యవస్థంతా సరిగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది.
ప్రేమాశీస్సులతో,
సద్గురు
సాంప్రదాయ హఠ యోగాని శుద్ధరూపంలో అందించాలి అనేది సద్గురు ఆశయం. అసలైన హఠ యోగాని నేర్పించే యోగా టీచర్లను తయారుచేయటం కోసం 'ఈశా హఠ యోగా స్కూల్' వారు 21 వారాల టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు 08300097444కి కాల్ చేయండి, లేదా info@ishahathayoga.com కి ఈమెయిల్ చేయండి.