సాధారణంగా స్త్రీల యొక్క స్త్రీత్వం తనను ఒక మంచి ప్రభావవంతమైన గురువుగా రాణించేందుకు అనుమతించదు. కానీ ఆమె ఆ మార్గంలో వెళ్లేందుకు చాలా బాగా సరిపోతుంది. పురుషుడు వివిధమైన పనులు చేయగలడు కానీ తనలో గ్రహణశీలత తక్కువ.  అతను తనను తాను సంసిద్ధం చేసుకోగలడు,  కానీ స్త్రీలో సహజ సిద్ధంగానే ఈ గుణం ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఒక గురువున్నాడంటే అక్కడ చాలా మంది స్త్రీలు చేరుతారు. ఎందుకంటే వాళ్ళు చాలా తేలికగా దానిని గ్రహించగలరు. అద్భుతమైన స్త్రీ గురువులు కొంతమంది ఉండేవారు, కానీ వారు కొంత విభిన్న కోవకు చెందిన వారై ఉంటారు.. పురుషులు వ్యవహరించినట్టు వ్యవహరించలేరు.. వారికి సమాజంలో ఒక రకమైన అనుకూల పరిస్థితి ఇంకా సహకారం అవసరం. సమాజం ఎప్పుడూ స్త్రీ గురువులకు సహకారం అందించలేదు. ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలలో ఎప్పుడైనా స్త్రీ తన జ్ఞానాన్ని వ్యక్తీకరించడం మొదలుపెట్టినా, సాధారణ మనుషులకు భిన్నంగా ఉన్నదాన్ని అందుకోవడానికి ప్రయత్నించినా అమెను మంత్రగత్తెగా ముద్రించారు, దహనం చేసారు.

ఏదేమైనప్పటికీ కొంతమంది స్త్రీలలో పురుషుల కన్నా ఎక్కువ జిజ్ఞాస తపన ఉంటాయి. అలాంటి స్త్రీలు సమాజ సహకారం ఉన్నట్లయితే అద్భుతమైన గురువులుగా మారతారు. కొంతమంది అటువంటి వారుండేవారు, కానీ వందల ఏళ్ళుగా మానవ చరిత్రలో ఆ విధమైన సహకారం వారికి అందలేదు. బహుశా ముందు తరాలలో అది సాధ్యపడవచ్చు, ఎక్కువ మంది స్త్రీ ఆధ్యాత్మిక గురువులు రావచ్చు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు