Tవిషయ పట్టిక
1. అగ్ని- రకాలు
    1.1 జఠరాగ్ని
    1.2 చితాగ్ని
    1.3 భూతాగ్ని
    1.4 సర్వాగ్ని
2. ఆధ్యాత్మిక పథంలో అగ్ని మూలకం ప్రాధాన్యత
3. యోగ సాంప్రదాయంలో అగ్ని
4. అగ్ని ద్వారా ఓజస్సు శుద్ధి ( క్లేశ నాశన క్రియ)

సద్గురు: ఏ సమాజంలోనైనా, “అగ్ని” అనే పదాన్ని బిగ్గరగా పలికితేనే, అది ఎంతో ఆదుర్దాను కలిగిస్తుంది. సాధారణంగా అగ్నిని ఒక అపాయంగా చూస్తారు. సరైన విధంగా నిర్వహించకపోతే గనుక, అది అపాయమే. మనం అగ్ని యొక్క మౌలికమైన పార్శ్వాలను – దాని అభివ్యక్తీకరణను, నిర్వహించే విధానాలను, ఇంకా అన్నిటికీ మించి, దానిపై ఆధిపత్యం పొందడం ఎలాగో తెలుసుకుందాం. మానవ శరీర నిర్మాణంలో దోహద పడే పంచభూతాల్లో, అగ్నిది చాలా తక్కువ భాగమే అయినప్పటికీ, దాని ప్రభావం అమోఘమైనది. అనేక విధాలుగా, అగ్ని జీవానికి సంకేతం. మీరు ప్రాణాలతో ఉన్నారా లేరా అనే దానికి, ఒక ముఖ్యమైన సూచిక, మీ శరీరంలో ఇంకా వెచ్చదనం ఉందా లేదా చల్లబడి పోయిందా అనేది. ఈ భూమిపై జీవం అనేది ప్రాధమికంగా సౌర శక్తి మయం. సూర్యుడు, ఈ భూమిపై జీవానికి దోహద పడే ఒక పెద్ద అగ్ని గోళం. ఏ యంత్రం అయినా సరే అది పని చేసేటప్పుడు, కచ్చితంగా ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఎందుకంటే, ప్రాథమికంగా, అగ్ని ఒక ఇంధనం. మీరు దానిని విద్యుత్తు, పెట్రోల్, చెక్క, బొగ్గు లేదా మరెలా అయినా పిలవవచ్చు. కానీ ప్రాథమికంగా, మీ శరీరంతో సహా ఏ యంత్రాన్నైనా, నడిపించేది అగ్నే!

220px-Agni_18th_century_miniature.jpg

ఈ సంస్కృతిలో, అగ్ని మూలకాన్ని , అగ్ని దేవుడికి(రెండు ముఖాలు కలిగి, ఒక ఉగ్రమైన పొట్టేలుపై స్వారీ చేస్తాడు) ప్రతిరూపంగా భావిస్తారు. ఆ రెండు ముఖాలు, అగ్నిని జీవ ప్రదాతగా, జీవ హర్తగా ప్రతీక. మనలో అగ్ని రగలకుంటే, జీవం లేదు. కానీ మీరు జాగ్రత్త వహించకపోతే ఆ అగ్ని తక్షణమే మీ చేదాటిపోయి, అంతటినీ హరిస్తుంది. అది మన శరీరాన్ని కాల్చివేసేటప్పుడు, దానిని దహన సంస్కారం అంటారు. మరొక అంశం ఏంటంటే, మనం అగ్నిని ఉపయోగించి ఆహారాన్ని వండి తింటున్నాము. లేదంటే గనుక, అవి తినడానికి యోగ్యంగా, రుచికరంగా ఉండకపోవచ్చు.

అగ్ని – రకాలు

#1 జఠరాగ్ని

మన ఆంతరంలో మరియు బాహ్యంలోనూ, అగ్నికి అనేక కోణాలు ఉన్నాయి. మనలో రగిలే మూడు రకాలైన అగ్ని గురించి తెలుసుకుందాం. వాటిలో ఒకటి జఠరాగ్ని. జఠర అంటే పొట్ట లేదా జీర్ణ వ్యవస్థ. మీ ఉదరంలో కొంచెమైనా అగ్ని లేకుండా, మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోలేరు. ఆహారం అనేది ఒక ఇంధనంగా పనిచేస్తుంది. మీరు తిన్న ఆహారం విచ్చిన్నం చేయబడితేనే, మీకు అవసరమైన శక్తి విడుదల అవుతుంది. జఠరాగ్ని అనేది బాగా పోషించబడి, దానికి ఇంధనాన్ని బాగా అందిస్తే గనుక, అది కామాగ్నిగా కూడా మారుతుంది. జీర్ణక్రియ అలాగే ప్రత్యుత్పత్తి కూడా జఠరాగ్నిపై ఆధారపడి ఉంటాయి.

#2 చితాగ్ని

అంతరంగంలోని రెండో రకం అగ్నిని చితాగ్ని అంటారు. అది మనసు ఇంకా దానికి అతీతమైన ఒక పార్శ్వం. ‘చిత్త’ అనేది మీలో ఉన్న చైతన్యానికి ఒక పార్శ్వం. అది భౌతిక రూపానికి ఉన్న పరిమితులను అధిగమించే ఒక పార్శ్వం. మీ భౌతిక రూపం అనేది మీ జన్యుపరమైన ఇంకా కర్మ సంబంధమైన స్మృతికి ప్రతిఫలం. దానికి విరుద్ధంగా, చిత్త అనేది స్మృతితో పొందలేని చైతన్యానికి ఒక పార్శ్వం, చితాగ్ని అనేది అనేక వేరు వేరు స్థాయిల్లో అభివ్యక్తం అవుతుంది. మొదటి అభివ్యక్తీకరణ స్థాయి, బుద్ధి. మీలో ఉన్న వివిధ రకాల అగ్నిని పరిశీలిస్తే, మీ జఠరాగ్ని అనేది సంతృప్తి చెందితే గనుక, కామాగ్ని అనేది పనిచేస్తుంది. మీరు సుష్టుగా తినకపోతే గనుక, కామ ప్రవృత్తి మాయమౌతుంది. అదేవిధంగా, మీ చితాగ్ని సరైనంత రాజుకోకపోతే గనుక, మీ బుద్ధి బలహీనమై, నిష్ప్రయోజనమౌతుంది. ఏదేమైనా, మీ చితాగ్ని రగులుతుంటే గనుక, మీరు జాగరూకతతో చైతన్యానికి సంబంధించిన ఇతర పార్శ్వాలను, పొందే స్థితిలో లేకపోయినా కూడా, అది బుద్ధి రూపంలో తనను తాను అభివ్యక్త పరుచుకుంటుంది. మీ చితాగ్ని శోభాయమానంగా రగులుతుంటే గనుక, మీరు ఆహారం, లైంగికత అలాగే శరీరానికి సంబంధించిన ఇతర విషయాలపై ఆసక్తిని కోల్పోతారు. ఈ విషయానికి సంబంధించే, దురదృష్టవశాత్తూ త్యాగం అని ప్రచారం అవుతన్నది ఏదైతే ఉందో, అది వాస్తవానికి సర్వోత్కృష్టమైనది.

#3 భూతాగ్ని

అగ్ని యొక్క తదుపరి పార్శ్వం భూతాగ్ని. మీ భూతాగ్ని రాజుకుంటే గనుక, మీ శరీరం, మనసులు చేసే సర్కస్ అంతగా మిమ్మల్ని ఆకట్టుకోలేదు. మీ ఆసక్తి, ధ్యాస మీ శరీరం, మనసుల వికారాల నుండి, సృష్టి యొక్క ప్రాథమికమైన అంశం – జీవం యొక్క మూలానికి మరలుతాయి. మీరు జఠరాగ్నిని మీ నియంత్రణలోకి తీసుకుంటే గనుక, మీకు ఆరోగ్యకరమైన, దృఢమైన శరీరం ప్రాప్తిస్తుంది. మీరు చితాగ్నిపై పట్టు సాధిస్తే, మీరు అనేక విధాలుగా ఉపయోగించుకోదగ్గ బుద్ధి మీకు లభిస్తుంది. మీరు భూతాగ్నిపై నియంత్రణ సాధిస్తే, మీకు జీవ ప్రక్రియపై ప్రాథమిక ఆధిపత్యం లభిస్తుంది.

శరీరానికున్న సరిహద్దులు చాలా స్పష్టమైనవి, పరిమితమైనవి. మనసు సరిహద్దులు పెద్దవి. ఉదాహరణకు, మీకు ప్రపంచం యొక్క మరో భాగం గురించి కొంత తెలిస్తే గనుక, అది మీ మనసు పరిధిలోనే ఉంటుంది. మీ జ్ఞానం పెరిగేకొద్దీ మీ మానసిక పరిధులు విస్తరించగలవు. కానీ, మీరు భూతాగ్ని యొక్క పార్శ్వం పట్ల జాగరూకులై ఉంటే గనుక, మీరు అవధులు లేని వారౌతారు. ఎందుకంటే, భూతాల విన్యాసం అనేది సృష్టి అంతటా జరుగుతోంది.

#4 సర్వాగ్ని

దీనికి అతీతంగా, సర్వాగ్ని అనేది ఉంటుంది. ఎందుకంటే, ఆధునిక విజ్ఞానం ప్రకారం, ఉనికి యొక్క భౌతిక పార్శ్వం ఐదు శాతం కంటే తక్కువ. దానర్థం, మీకు ఉనికి యొక్క భౌతిక పార్శ్వం అంతా తెలిసినా, మీరు ఐదు శాతం ఉనికిని మాత్రమే తెలుసుకున్నట్టు. సర్వాగ్ని, మూలకాలు లేని పార్శ్వాన్ని, మీకు తెలిసిన సృష్టి అనేది లేని పార్శ్వాన్ని, లేదా మరోలా చెప్పాలంటే భౌతిక గుణం లేని పార్శ్వాన్ని స్పశిస్తుంది.

సాధారణంగా, ఒక యోగి, జీవ స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటే గనుక, జఠరాగ్ని, చితాగ్ని అలాగే భూతాగ్ని పట్ల ఆసక్తి కలిగి ఉండడు. అతడు, సర్వాగ్నిపై మాత్రమే ధ్యాస పెడతాడు. ఎందుకంటే అది అంతిమమైన అగ్ని. కానీ అది చల్లని జ్వాల. జఠరాగ్ని సర్వ సాధారణమైన అగ్ని. చితాగ్ని అంత సాధారణం కాదు, కానీ అది చాలా వరకు ఉంది. భూతాగ్ని అంతగా కనిపించదు కానీ, అది చాలా వరకు ఉంది. సర్వాగ్ని అనేది అనుభూతి చెందడం అరుదు, కానీ అది లేకుండా, ఏదీ జరగదు. అది అన్ని ఇతర రకాల అగ్నిని తనలో ఇముడ్చుకుని ఉండే ప్రాథమికమైన, అంతిమమైన అగ్ని.

ఆధ్యాత్మిక పథంలో అగ్ని మూలకం ప్రాధాన్యత

అగ్ని అనేది ఆకాశం లేదా ఈథర్‌కు సమీపంగా ఉండే మూలకం. అగ్ని ఉన్న చోట, ప్రత్యేకించి, కొన్ని నిర్దిష్టమైన ఇంధనాలు వాడితే గనుక, ఆకాశ లేదా ఈథర్ పార్శ్వం మరింతగా అందుబాటులోకి వస్తుంది. దక్షిణ భారతదేశంలో, మనము దీపం వెలిగించేందుకు నెయ్యి లేదా నువ్వుల నూనెను వాడతాము. ఈ రెండూ అందుబాటులో లేకపోతే, వేరుశెనగ నూనె; అది కూడా అందుబాటులో లేకపోతే, కొబ్బరి నూనె. ఈ నూనెల ద్వారా జనించే అగ్నికి ఒక నిర్ధిష్టమైన గుణం ఉంటుంది. ఇతర నూనెలతో పోలిస్తే, అది అత్యంత ఎక్కువ బాష్పీకరణ స్థాయిని కలిగి ఉంటుంది. అందుకే మీరు అగ్ని యొక్క జ్వాలను కాకుండా, దాని కొనను చూడాలి. తద్వారా ఈథర్‌ పార్శ్వం మరింత అందుబాటులోకి వస్తుంది.

మీరు ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలనుకున్నప్పుడు, మొదటగా నూనె లేదా నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఇది భారతీయ జీవనంలో ఒక భాగం. అలాగే, దీపానికి వాడే ఇంధనం, గరిష్టమైన ప్రయోజనాన్ని అందించేదిగా ఉండాలి. సాధారణంగా కొవ్వొత్తులు, ప్రత్యేకించి రసాయనాల మైనంతో తయారయినప్పుడు, వాటి వల్ల అటువంటి ప్రయోజనం చేకూరదు. ప్రాథమికంగా, వాళ్ళు ప్రయత్నిస్తున్నది ఏంటంటే, మండినప్పుడు తమ చుట్టూ ఒక ఓజస్సును సృష్టించే పదార్థాలతో అగ్ని రగిలించడం ద్వారా ఆకాశం అందుబాటులోకి తెచ్చుకోవడం. నూనె దీపంతో, మీరు ఆకాశ క్షేత్రాన్ని సృష్టిస్తారు, తద్వారా మీరు, మీ ఇంట్లోని వారు ప్రయోజనం పొందగలరు. ప్రత్యేకించి, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉన్నవారి కోసం, అలాగే సాధారణంగా ఆరోగ్యం కోసం, మీ ఇంట్లో దీపాన్ని వెలిగించడం ముఖ్యం. అది మెరుగైన ఆరోగ్యం, దృఢమైన శరీరం కోసం మీలోని జఠరాగ్నిని పెంపొందించడమే కాకుండా, చితాగ్నిని పెంపొందిస్తుంది అలాగే ఆకాశ మూలకాన్ని మరింత అందుబాటులోకి తెస్తుంది. మీలో చితాగ్ని రగలడం ముఖ్యం. మీలో చితాగ్ని కాకుండా, కేవలం భౌతిక అగ్ని మాత్రమే రగులుతున్నప్పుడు, జీవితం దుఃఖపూరితంగా, వికారంగా మారుతుంది. మీలో అధికంగా జఠరాగ్ని ఉండి, తగినంత చితాగ్ని లేకపోతే గనుక, మీరు పరమ బుద్ధిహీనమైన పనులు చేస్తారు.

యోగ సాంప్రదాయంలో అగ్ని

ఈ సంస్కృతిలో, ప్రజల జీవనంలో ప్రాధాన్యత కలిగిన విషయాలన్నీ అగ్ని కేంద్రకంగా జరుగుతాయి. అగ్ని లేకుండా, ఆరాధన లేదు, వివాహ కార్యం లేదు, ఏ విశేషమైన వేడుకా లేదు. హోమాలు, హవిస్సులు వంటి యజ్ఞ సంబంధమైన అగ్నులతో సహా, అగ్నిని ఉపయోగించే అనేక రకాల అభివ్యక్తీకరణలూ, మార్గాలూ ఈ సంస్కృతిలో స్థాపించబడ్డాయి. అగ్ని అనేది ఆకాశం లేదా ఈథర్‌ను మరింత అందుబాటులోకి తెస్తుంది. మన నిర్మాణంలో దోహద పడే మూలకాలన్నిటిలోకి ఆకాశం అత్యంత నిర్మలమైనది, ప్రవాహ భరితమైనది. నా శరీరంలో అలాగే మీ శరీరంలో ఉన్న భూమి ప్రాథమికంగా ఒకటే, కానీ మీ శరీరంలో ఏముంది, నా శరీరంలో ఏముంది అని మాట్లాడినప్పుడు, అది పూర్తిగా వేరైనది – మీలో ఉన్న నీరు, నాలో ఉన్న నీరు వేరు వేరు - అది ప్రస్తుతం వేరు వేరు పాత్రల్లో ఉంచబడింది అని మీరు అనవచ్చు. కానీ మనం పీల్చే గాలిని వేరు చేయలేము. అది ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది. మనలోని అగ్ని మూలకం అనేది మరింత విస్తారమైన స్థాయిని పంచుకుంటుంది. ఆకాశ మూలకం సంపూర్ణంగా పంచుకోబడుతుంది. మనం అందరం ఓకే ఆకాశాన్ని పంచుకుంటున్నాం. మీరు ఏ వాతావరణంలోనైనా, ఆకాశ మూలకాన్ని పెంపొందించినప్పుడు, మనుషుల మధ్య ఒక నిర్దిష్టమైన బంధం ఏర్పడుతుంది. అగ్ని సాన్నిధ్యంలో ఉన్నప్పుడు, కలిసి మెలసి ఉండడం, ఇంకా భావవ్యక్తీకరణ అనేవి గొప్పగా పెంపొందుతాయి, ఎందుకంటే, అగ్ని ఉన్నప్పుడు, ఆకాశ మూలకం ఆధిపత్యాన్ని పొందుతుంది.

క్రోడీకరిస్తే: పరిణామం దృష్ట్యా, నాణ్యత దృష్ట్యా, అగ్ని అనేది మీలో ఒక చిన్న భాగమే అయినప్పటికీ, దాని విశిష్ట గుణాల కారణంగా, అది ఎంతో ప్రధానమైనది. చాలా తక్కువగా మీరు అగ్నిని స్పృశించగలరు. అదే సమయంలో, మీరు సున్నితత్వంతో వ్యవహరించే ఒక మూలకం అగ్ని. మాధ్యమానికి అనువైన వాతావరణం కోసం, గ్రహణ శీలత సృష్టించేందుకు, పరిమితులను అధిగమించేందుకు, మీరు దైవం అని లేదా సృష్టి మూలం అని ఎలా పిలవాలనుకుంటే అలా భావించే ఇతర పార్శ్వాలను స్పృశించడం కోసం తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు, అగ్ని అనేది ఒక మార్గం.

అగ్ని ద్వారా ఓజస్సు శుద్ధి ( క్లేశ నాశన క్రియ)

మీరు గమనించారా, మీరు స్నానం చేసినప్పుడు – కేవలం మునక వేయడం కాకుండా, మీ శరీరంపై నీరు ప్రవహించడం జరుగుతుంది, మీరు గమనిస్తే, ప్రత్యేకించి, మీరు చన్నీటితో స్నానం చేస్తే గనుక, స్నానం అనేది కేవలం చర్మాన్ని శుద్ధి చేయడం లేదా మీ చర్మంపై ఉండే మురికి లేదా మలినాలని కడిగేయడం గురించి మాత్రమే కాదు. అది మిమ్మల్ని పునరుత్తేజితుల్ని చేసి, అనేక విషయాల నుండి మిమ్మల్ని శుద్ధి చేస్తుంది. మీరు స్నానానికి వెళ్ళినప్పుడు కోపంతో, ఉద్రేకంతో ఉన్నప్పటికీ, స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికే, పనికిమాలిన విషయాల నుండి ఉపశమనంగా అనిపిస్తుంది. దీనికి కారణం, కేవలం చన్నీరు మీ శరీరంఫై ప్రవహించి, మీ నరాల్ని శాంతిపరచడమే కాదు. అది కూడా జరుగుతోంది, కానీ దానికి మించి, మీ ఆకాశ పార్శ్వంలో కొంత శుద్ధి జరుగుతోంది.

క్లేశ నాశన క్రియ గురించి మరింత చదవండి. 

Editor's Note:  Learn more about cleansing the five elements and how it can enhance your life in this comprehensive guide on Bhuta Shuddhi