సాధన పాదాలో జీవితం - ఇంటి నుంచి ఆశ్రమానికి
2019 సాధనపాదా మొదలైంది, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అసలు ఈశాయోగా సెంటర్ కు ఎలా వచ్చారు? వచ్చే ఏడునెలల సాధనకి, ఈ ఓరియంటేషన్ ప్రాసెస్, ఎటువంటి వేదికను సమకూర్చిందో తెలుసుకుందాం.
32 దేశాల నుంచి వచ్చిన 800 మందికి పైగా పార్టిసిపెంట్స్ వచ్చే ఏడు నెలల్లో కోయంబత్తూరు దగ్గర ఈశా యోగా సెంటర్ లో గడపటానికి, సాధన అనే పునాది ఆధారంగా, ఆనందంతో నిండిన, వత్తిడిలేని మరో కొత్త జీవితం వైపుగా పయనించడానికి ఉద్యుక్తులయ్యారు. పాల్గొనేవారు క్రమశిక్షణతో కూడిన తీక్షణ సాధనా షెడ్యూల్ లో, తమ శక్తియుక్తులు ఈశా కార్యక్రమాలకు అందిస్తూ ఆశ్రమంలోని అనేక కార్యక్రమాలలో, ఉత్సవాలలో పాల్గొంటున్నారు. ఈ సిరీస్ లో వచ్చే ఈ బ్లాగు ఆర్టికల్స్ లో, వారి ఈ ప్రయాణంలోని ఎత్తుపల్లాలు, తెరవెనుక జరిగే విషయాలు, మీకు అందిస్తాము.
ఎంపిక అవడంలోని మహదానందం
కాలేజీ నుంచి అప్పుడే బయటకు వచ్చిన వారి దగ్గరనుంచి, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, గవర్నమెంట్ ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, ఇలా అనేక వృత్తులకు చెందిన వారితో ఈ సాధనపాద ఎంత వైవిధ్యమైనదంటే, అది అందించే అవకాశాలు ఎంత వైవిధ్యమైనవో అంత.
‘‘నేను అక్కడకు వెళున్నాను, ఇది నిజమే’’
నేను వచ్చేముందు, ‘నా అప్లికేషన్ స్వీకరించారు’, అన్న విషయం పూర్తిగా నమ్మలేకపోయాను. నేను ఇంతకుముందు ఎప్పుడూ ఆశ్రమంలో వాలంటీరింగ్ చేయలేదు, అందువల్ల, ఇక్కడ అందరూ చాలా చాలా కఠినంగా ఉంటారని, నన్ను తిరిగి వెళ్ళపొమ్మంటారని కూడా అనుకున్నాను. కానీ ఆశ్రమంలోకి నేను వచ్చినప్పుడు, నేను కలిసిన మొట్టమొదటి వాలంటీరు, ఆమె నవ్వుతూ మన:స్పూర్తిగా ‘నమస్కారం’ అన్నప్పుడు, ఆక్షణం నుంచి నాలో అన్నీ మారిపోయాయి. అర్థంపర్థంలేని నా సందేహాలు పటాపంచలయ్యాయి. ఇక్కడ ఉండటం అన్నది, నమ్మశక్యం కానిది. ఆశ్రమానికి వచ్చే ప్రయాణంలో కూడా, ప్రకటనల మీద కనబడే సద్గురు ఫొటోలను చూస్తూ, ‘నేను అక్కడికి వెళ్తున్నాను, అదినిజం’ అని నాలో నేను ఎన్నోసార్లు చెప్పుకున్నాను. – భీమ్, 18, జార్ఖండ్.
‘‘నా అప్లికేషను స్వీకరింపబడినప్పుడు నేను గాల్లో తేలిపోయాను....’’
‘‘నన్ను సాధన పాదాలోకి చేర్చుకోవడానికి అంగీకరించినప్పుడు నేను మేఘాలలో తేలిపోయాను.’’
మా ఆధ్యాత్మిక ప్రగతికి కొరకు, అటువంటి వసతులు, కావలసిన సహాయం దొరికే ఇటువంటి కార్యక్రమంలో అవకాశం దొరికినందుకు ఎంతో ఆనందంలో మునిగి పోయాను. తమ ఆడపిల్లలను అంతకాలం బయటికి పంపటానికి సందేహించేవారు కూడా, ఎటువంటి సందేహం లేకుండా పూర్తి నిశ్చింతతో పంపించవచ్చు - స్వాతి, 42, లండన్.
మొదట్లో వచ్చే కొన్ని అడ్డంకులను అధిగమించడం
నన్ను చేర్చుకోవడానికి అంగీకరించారు అన్న ఈ సంతోషం తో పాటు ఏవో చిన్న చిన్న అడ్డంకులు లేక పోలేదు. ఇలా ఆశ్రమంలో జీవించడానికి రావటం అనేది జీవితంలో మామూలుగా వేసే అడుగు కాదు. కొందరిని అంగీకరింప చేయటం చాలా కష్టమైన విషయం. పాల్గొనాలంటే, కొందరు తమ అధికారాలను అంగీకరింపచేయాలి, తమ ఆర్థిక విషయాలను సరి చూసుకోవాలి, తమ కుటుంబంలోని పెద్దవారికి ఈ కార్యక్రమం విలువ గురించి నచ్చచెప్పాలి.
నేను వెళ్ళడానికి, నా వ్యాపార భాగస్వాములు సుముఖత వ్యక్తపరచలేదు.
కొన్ని రోజులుగా నేను ఈ ఈశా కార్యక్రమాల్లో వాలంటీరింగ్ చేస్తున్నాను. ఈ సాధనపాద కార్యక్రమం గురించి విన్నాను. కానీ అది ‘నాలాంటి వారి కోసం’ కాదు అనుకున్నాను. అనేక వ్యాపారాలు నడిపే నాలాంటి వారికి, అందునా ఇంటి దగ్గర వయసు మీరిన మా అమ్మని ఏడు నెలల పాటు వదిలిపెట్టి ఉండటం అనేది చాలా పెద్ద విషయం.
నేను వెళుతున్నప్పుడు, నా వ్యాపార భాగస్వాములు సుముఖత చూపలేదు. కానీ, నేను నాపైనే కృషి చేయబోతున్నాను, దానిద్వారా మరింత సమర్దవంతంగా తయారవుతానని వారిని ఒప్పించాను. అలాగే మా అమ్మగారిని చూచుకోవడానికి ఏర్పాట్లు చేశాను. అంతేకాక ఇంటిదగ్గర నా సాధన అంత బాగా జరగటం లేదు, అందుకే ఇక్కడ ఉండటం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది, ఇప్పటికే నాలో మార్పులు వస్తున్నాయని గమనిస్తున్నాను. – శ్రీ కుమార్, 48, కేరళ.
‘‘అందరూ రూ నాకు పిచ్చి పట్టింది అనుకున్నారు’’
ఏడు నెలలపాటు ఆశ్రమానికి వెళుతున్నాను, అని నేను వారికి చెప్పినప్పుడు ఎవరూ ఆమోదించలేదు, అందరూ పిచ్చి పట్టింది అనుకున్నారు. ఏడు నెలల వ్యవధి తరువాత నా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో అన్న బెంగ కూడా ఉన్నది. ఆశ్రమంలో గడిపిన ఈ కాలం నా ఉద్యోగ ప్రయత్నాలకు తోడ్పడుతుందని మా తల్లితండ్రులకు సర్దిచెప్పాను.
‘‘నాకు కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, మా నాన్నగారు వాటిని గమనిస్తునే ఉన్నారు. నన్ను నేను బాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నానని ఆయనకు చెప్పాను, నిద్ర తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాను. నేను మరింత ఏకాగ్రతతతో, సమతుల్యంలో ఉండాలనుకుంటున్నాను అని చెప్పాను. వాళ్ళు సరే అలానే చెయ్యి, ‘నీకు అన్నీ మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాము’ అని దీవించారు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను - షాంతను, 29, కాశ్మీరు.
‘‘నేను ఏడు నెలలపాటు దూరంగా ఉంటానంటే మా తల్లితండ్రులు చాలా సందేహించారు’’
ఇంతకు ముందు ఆశ్రమానికి నేను చాలాసార్లు వచ్చాను, ఇక్కడు ఉండడం ఎంతో అద్భుతమైన అవకాశం, కాని నేను ఏడు నెలలపాటు దూరంగా ఉంటానంటే మా తల్లితండ్రులు చాలా సందేహించారు. నా ఉద్యోగం మొదలుపెట్టే ముందు, ‘నా మీద నేను’ కొంత సమయం వెచ్చించడం ఎంత అవసరమో వారికి నచ్చజెప్పడానికి, ఎంతో సమయం పట్టింది.
నేనీసంవత్సరమే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను, నాకెన్నో అవకాశాలు వచ్చాయి, వాటిని కాదనడం మంచిదికాదని నా కుంటుంబంలోని వారు చెప్పారు. నాజీవితంలో ఏమి చేసినా, కాస్త స్ధిరమైన పునాది వేసుకోవడానకి నాపై కొంత కృషిచేయాలని నాకు అనిపించింది. – శుభాంగి, జోథ్పూర్, రాజస్థాన్.
‘గురు పూర్ణిమ, లాప్ ఆఫ్ ది మాస్టరు’ కార్యక్రమాలు నిర్వహించడానికి జరిగిన కృషి'
2019, జులై 16. పవిత్ర గురుపూర్ణిమ రోజున, సాధనపాదా లాంఛనంగా ప్రారంభమయ్యింది, కాని అంతకన్నా కొద్దిరోజుల ముందే ‘లాప్ ఆఫ్ ది మాస్టరు’ కార్యక్రమంలో పాల్గొనడానికి కొందరం వచ్చేశాము.
ఇంత పెద్ద కార్యక్రమం అంటే ఎంతో పని ఉంటుంది, కానీ వందలకొద్దీ సాధనపాదా వాలంటీర్లు ఎంతో శ్రమించడం వల్ల, పనులన్నీ ఏ సమస్యల్లేకుండా జరిగిపోయాయి. ఇక గురు పౌర్ణమి నాడు పార్టిసిపెంట్స్ అందరికీ సద్గురుతో ఒక సత్సంగం కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది.
ఆశ్రమంలోని వారందరూ అలుపెరగకుండా ఎలా పని చేస్తారో మాకు అర్థమయింది.
‘లాప్ ఆఫ్ ది మాస్టర్’ ప్రోగ్రాంలో నేను వాలంటీరింగ్ చేయడం మొదలెట్టాను. అప్పుడు ఆశ్రమంలోని వారందరూ అలుపెరగకుండా ఎలా పని చేస్తారో చూశాను. వారందరూ సేవాలో పూర్తిగా నిమగ్నం అవుతారని అర్థమైంది. వారిని చూసి, ఈ ప్రోగ్రాంలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అనే ఉత్సుకత వచ్చింది. ఆశ్రమంలో గడిపిన గత కొద్ది రోజులు, నాకెంతో కనువిప్పు కలిగించాయి. నాకు ఎరుక పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఇటువంటి ప్రతిష్ఠిత స్థలంలో ఉండటం అద్భుతంగా ఉంది. ప్రతిక్షణం నేను ఎంతో శక్తివంతంగా అనుభూతి చెబుతున్నాను. – క్షితిజ్, 28, బెంగళూరు.
సుడిగాలిలా ప్రారంభమయ్యింది.
గురుపూర్ణిమ తరువాత అందరూ, ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఎంతో తీక్షణమైన ఓరియంటేషన్ ప్రోగ్రాంలో, హటయోగ సాధనలు నేర్చుకోవడమే కాకుండా, ముందు చేసిన ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమాన్ని మళ్ళీ మరోసారి చేయించారు, దాని మూలంగా ఆ కార్యక్రమంలోని విధివిధానాలు మరోసారి తరచి చూడడం జరిగింది. అదే రాబోయే ఏడు నెలల సాధనకు పునాది అవుతుంది. ఓరియంటేషన్ ప్రోగ్రాం ఓ సుడిగాలిలా జరిగిపోయింది. ఇంతకు ముందు ఎన్నడూ చూడని సద్గురు వీడియోలను చూశాము. గురుపూజను ఒక సజీవ ప్రక్రియగా అనుభూతి చెందాను. ఇంకా ఆదియోగి ప్రదిక్షణ ద్వారా కార్యక్రమంలోని తీవ్రతను తెలుసుకున్నాము. తమ బిజీ షెడ్యూల్ లో కూడా సద్గురు మమ్మల్ని కలుసుకొని, జరగబోయే దానికి మమ్ములను ఉద్యుక్తులను చేశారు.
‘‘ప్రోగ్రాము ఆరంభానికి ముందే, సద్గురుతో ఒక సత్సంగం జరగటం మాకు వరం.’’
‘‘ఓరియంటేషన్ కార్యక్రమానికి ముందు, ఇన్నర్ ఇంజనీరింగ్ రిఫ్రెషర్ కార్యక్రమం జరగడం ఎంతో అవసరమైనది. అది శాంభవి బాగా చేయటానికి నాకు తోడ్పడింది. ఈ సులువైన సాధనాలు నాలో ఎంత మార్పును తీసుకు వస్తాయో అర్థమైంది.’’
‘‘హటయోగ సాధనా కార్యక్రమం ద్వారా నా ఆసనాలను సరి చేసుకోవడం. ప్రతి ఆసనంలో ప్రగాఢంగా లీనమై పోగలగడం తెలిసింది. అంతేకాక రెండవసారి గురు పూజ చేయటం ఎంతో ఉపయోగపడింది. దాని ప్రాధాన్యత ఇంతకుముందు నాకు అర్థం కాలేదు. ఇక ప్రోగ్రాము ఆరంభానికి ముందే, సద్గురుతో ఒక సత్సంగం జరగటం మాకు వరం. నేహ, 26, జైపూర్.
సద్గురు నాకు అందించిన దానికి, నేను అర్హురాలను కావలని నిశ్చయించుకున్నాను. సద్గురులాంటి వారు ఒకరు, తమ విలువైన కాలాన్ని, శక్తిని, నామీద వినియోగించడం నాకెంతో విలువైనది. ఆయనకున్న దయ, ప్రేమలు, దీనిని మాకు అందించడానికి ఆయన చేసే కృషి, మాలో ఈ అంతర్గత పరిణామం తీసుకురావటానికి ఆయనకున్న తీవ్రమైన ఆకాంక్ష, నన్ను కలిచివేసింది. అందుకే నాకు అందించిన దానికి, నేను అర్హురాలను కావలని నిశ్చయించుకున్నాను. – అశ్విని, 27, హైదరాబాదు.
‘సాధనపాదా’ లో పాల్గొనే వారికి సద్గురు ఏమి చెప్పారు.
ఈ సాధనలో పాల్గొని వారికి ముఖ్యమైన అంశం, మీరు చేస్తున్న దేనిలోనైనా, మీరు స్పృశిస్తున్నది ఏదైనా, అందులో మీరు పూర్తిగా నిమగ్నం అవ్వటం, అదే సమయంలో మీ గురించిన చింత లేకుండా ఉండటం. అప్పుడే మీకందించిన ఉపకరణాలను, కావాల్సిన విధంగా మీరు ఉపయోగించుకోగలరు. అన్నింటినీ మించి, మీ మనసు, శరీరాలు మీకు ఉపకరణాలుగా ఉండాలి. సాధన యొక్క ఉద్దేశం అదే. కానీ, ప్రస్తుతం ఎవరుబడితే వారు, ఏది కావాలంటే అది, మీతో చేస్తున్నారు. మీ పరిస్థితులు, మీ మనసు, శరీరాలను రూపొందిస్తున్నాయి. సాధన అంటే, ‘నా మనసు, శరీరాలు ఏమిచేయాలో అన్నది నేను నిర్థారిస్తాను’ అని.
తరువాతి సంచికల్లో వచ్చేవి ….
సాధనపాదా 2019 లో మొదటి రెండు వారాలు అలా అలా గడిచిపోయాయి. పాల్గొనేవారికి శక్తివంతమైన ఉపకరణాలను అందించబడ్డాయి. మాకు కాస్త ఊపిరి పీల్చుకునే సమయం దొరికింది అనుకుంటుండగానే, యోగాసనాలు, సేవ వంటి కార్యక్రమాలతో, చాలా కఠినమైన దినసరి సాధన అందించబడింది. ఈ వ్యాసాలలో, వచ్చే భాగంలో, సేవలోని తీవ్రత, వారి దినచర్యలో ఎలా భాగమైపోతుందో చూడాలి. ఇక్కడ వారంత శలవలు లేవు, వారి ఇష్టాయిష్టాలకు అతీతంగా, సద్గురు అందించిన దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమే, ‘సాధనపాదా’ లోని అసలు విషయం.
ప్రేమాశీస్సులతో,