బూడిద గుమ్మడి హల్వా
ArticleJul 6, 2016
ఆరోగ్య విలువలున్న ప్రాణిక ఆహారమైన, బూడిద గుమ్మడి హల్వా రుచికరమైన మిఠాయి. రోజూ బూడిద గుమ్మడిని తినడం ద్వారా అది మన మేధా సామర్థ్యాలను పెంపొందిస్తుంది.
కావలసిన పదార్ధాలు
300 - 400 గ్రాములు బూడిద గుమ్మడి - చెక్కు తీసి, తురిమినది.
1 కప్పు నేయి
10 జీడిపప్పులు
1 కప్పు చక్కెర
1 టీ స్పూను ఏలకి పొడి
తయారుచేసే పద్ధతి
- తురిమిన బూడిద గుమ్మడి చేతితో పిండి ఎక్కువగా ఉన్న నీటిని తొలగించాలి, లేదా బట్టలో కట్టికాని, వడపోసి కాని నీళ్లు పోయేటట్లు చేయాలి.
- నేయి వేడిచేసి జీడిపప్పు బంగారు రంగు వచ్చేట్లు వేయించాలి. వాటిని చిల్లులున్న గరిటెతో తీసి పక్కన ఉంచుకోవాలి.
- అదే నేతిలో బూడిద గుమ్మడి తురుమువేసి 3, 4 నిమిషాలు వేయించాలి. చక్కెర, ఏలకిపొడి కలపాలి.
- గరిటెతో ఆపకుండా తిప్పుతూ ఉడికించాలి. హల్వా బాండ్లి మధ్యకు చేరుకొని ఒక ముద్దలాగా తయారవుతుంది. వేయించిన జీడిపప్పు కలపాలి.
- చల్లార్చి, వడ్డించాలి.