"వెల్లియంగిరిని శివుడే స్వయంగా అనుగ్రహించాడు. అనేక మహా యోగులు, సిద్ధులు, అన్నింటికీ మించి నా పూజ్య గురువు, తమ పవిత్ర జ్ఞానాన్ని ఈ శిఖరాలలో ప్రతిష్ఠించారు. ఈ అనుగ్రహ వెల్లువకు పాత్రులైనవారు తప్పక పరమపదాన్ని చేరుకుంటారు."
వెల్లియంగిరి పర్వతాల ఏడవ కొండపై ఉన్న శివాలయానికి దారి ఒకప్పుడు అందమైన ప్రకృతి దృశ్యంగా ఉండేది. కానీ ఇటీవలి సంవత్సరాలలో, భక్తులు వదిలివెళ్ళిన చెత్త ఆ దారిని కలుషితం చేసింది.
ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తూ, ఆలయ ప్రాంగణంలోనూ, అడవి మార్గాలలోనూ చెత్తను వదిలివెళుతున్నారు. ఇది పర్యావరణానికి ముప్పుగా మారింది. కొండల సహజ పరిసరాలను, పవిత్రతను కాపాడటానికి శుభ్రత కార్యక్రమాలు చేపట్టడం అత్యవసరం.
"ఇవ్వడానికి మీ హృదయ ద్వారాలను తెరిస్తే, దైవానుగ్రహం అందులోకి నిశ్చయంగా ప్రవేశించి తీరుతుంది."
విరాళం అందించి, పవిత్రమైన వెల్లియంగిరి పర్వతాల పరిశుభ్రతను నిర్వహించడానికి, సహజ పర్యావరణాన్ని, పవిత్రతను కాపాడటానికి సహకరించండి.