శివాంగ సాధన

స్త్రీపురుషులిద్దరూ* ఈ సాధనలో పాల్గొనవచ్చు

*వెల్లింగిరి యాత్ర పురుషులకు మాత్రమే

"ఈ సాధనని పవిత్రమైనదిగా భావించి, పూర్తి అంకితభావంతో చేస్తే, అది మీకు అద్భుతాలు చేస్తుంది."

శివాంగ సాధన అంటే ఏమిటి?

divider

సద్గురు అందిస్తోన్న శివాంగ సాధన, మీలోని భక్తిని వెలికి తీసుకొచ్చి, ఆదియోగి అయిన శివుని అనుగ్రహానికి మరింత పాత్రులయ్యేలా చేసే ఒక శక్తిమంతమైన సాధన.

మీరు ఈ సాధనని 42, 21, 14 లేదా 7 రోజుల పాటు చేయొచ్చు.

దీక్ష ఆన్‌లైన్‌లోనూ, ప్రత్యక్షంగానూ అందుబాటులో ఉంటుంది.

మీరు మీ సాధనని ఇంట్లోనే చేయొచ్చు, ఆపై ఆన్‌లైన్‌లో లేదా కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రం వద్ద ఉద్యాపనం చేయొచ్చు.

శివాంగ సాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

divider
అంతర్గత అన్వేషణకు బలమైన శారీరక, మానసిక, ఇంకా శక్తి స్థాయిలను సృష్టిస్తుంది 
ఆదియోగి అనుగ్రహం మీ జీవితంలో ఒక గైడ్‍గా ఇంకా నిత్యం అండగా ఉండేలా చేస్తుంది
తీవ్రమైన సాధన షెడ్యూల్ ద్వారా క్రమశిక్షణను అలవరుస్తుంది.

దృశ్యమాలికలు

divider

సాధన హైలైట్స్

divider
శివ నమస్కారం అనే పవిత్రమైన యోగ సాధనలోకి దీక్ష
“దక్షిణ కైలాసం” గా పిలువబడే వెల్లింగిరి పర్వతాల పైకి యాత్ర (పురుషులకు మాత్రమే)
మనలోని భక్తిని వెలికి తీసుకొచ్చే శక్తిమంతమైన మంత్రాన్ని ఉచ్చరించడం

సాధన వివరాలు

divider
అర్హత: స్త్రీ పురుషులిద్దరూ పాల్గొనవచ్చు  (8 సంవత్సరాలు  పైబడిన వారికి)

దీక్ష

  • దీక్ష 13 జనవరి 2025 నుండి 25 మే 2025 వరకు ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది.

  • శిక్షణ పొందిన శివాంగ, సాధనలోకి దీక్ష ఇస్తారు.

  • మీరు ఆన్‌లైన్‌లో లేదా ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు.

శివాంగ సాధన కిట్

దీక్ష కోసం మీకు అవసరమైన వస్తువుల జాబితా క్రింద ఉంది. వాటిని మీరే ఏర్పాటు చేసుకోవచ్చు లేదా వాటిని ఇక్కడ కొనుగోలు చేయవచ్చు:

  • ధ్యానలింగ ఫోటో - ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది

  • చేతికి కట్టుకోవడానికి నల్లటి గుడ్డ (సుమారు 18 అంగుళాలు x 3 అంగుళాలు)

  • శక్తివంతంగా ప్రతిష్ఠించబడిన ధ్యానలింగ పెండెంట్‍తో కూడిన ప్రత్యేకంగా రూపొందించిన 21 పూసల శివాంగ రుద్రాక్ష మాల , పంచముఖి రుద్రాక్ష మాల, ఆదియోగి రుద్రాక్ష పూస (రుద్రాక్ష దీక్షలో భాగంగా పొందినది), ఒక పూస రుద్రాక్ష లేదా ఏదైనా రుద్రాక్ష మాల

  • భిక్షను స్వీకరించడానికి భిక్ష పాత్ర (పురుషులకు)

  • విభూతి

ఆన్లైన్ దీక్షకి ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారా ? ఇక్కడ చేరండి

సాధన మార్గదర్శకాలు

వ్యవధి

మీరు ఈ సాధనని 42, 21, 14 లేదా 7 రోజుల పాటు చేయొచ్చు.

సాధన

  • దీక్షా సమయంలో నేర్పించిన శివ నమస్కారం, రోజుకి 12 లేదా 21 సార్లు భక్తితో సూర్యోదయానికి ముందు గాని లేదా సూర్యాస్తమయం తర్వాత గాని ఖాళీ కడుపుతో చేయాలి.

  • సాధన కాలంలో, ఇతరులను "శివ" అని పిలిస్తే మంచిది.

  • డ్రెస్ కోడ్: కాషాయపు రంగు శాలువాతో తెలుపు లేదా లేత వర్ణపు దుస్తులను ధరించడం ఉత్తమం. శాలువా ధరిస్తే ఎంతో మంచిది, కానీ తప్పనిసరి కాదు.

  • కనీసం 21 మందిని భిక్ష అడగాలి, ఉద్యాపన సమయంలో ఆ భిక్షని ధ్యానలింగానికి సమర్పించాలి .

  • ఆన్‌లైన్‌లో ఉద్యాపన చేసేవారు అవసరం ఉన్న ముగ్గురికి ఆహారం కానీ, డబ్బు కానీ ఇవ్వవచ్చు లేదా మహాశివరాత్రి అన్నదానానికి అదే అమౌంట్‍ని విరాళంగా ఇవ్వవచ్చు.

దయచేసి గమనించండి:
హెర్నియా ఉన్నవారు దిండు లేదా కుర్చీని ఉపయోగించి, అందుకు తగిన శివ నమస్కారాలను చేయాలని సూచిసున్నాము.

ఉద్యాపనం

ప్రత్యక్షంగా

  • శివాంగ సాధకులు కోయంబత్తూరులోని ధ్యానలింగం వద్ద సాధనను ఉద్యాపన చేయొచ్చు.

  • ఉద్యాపన తర్వాత వెల్లింగిరి పర్వతాలకు యాత్ర చేయొచ్చు. యాత్ర చేయలేని వారు ఆదియోగి ప్రదక్షిణలు చేయవచ్చు.

  • ఉద్యాపన & యాత్ర తేదీలు: 20 ఫిబ్రవరి 2025 నుండి 31 మే 2025 వరకు ప్రతిరోజూ

  • తాత్కాలిక వసతి సౌకర్యం ఉంటుంది.

  • సద్గురు సన్నిధి బెంగళూరులో కూడా ఆదియోగి ప్రదక్షిణలతో సాధనను ముగించవచ్చు.

ధర

divider

ఉద్యాపనకు ఇతర మార్గాలు

శివాంగ సాధన కిట్

ఈశా లైఫ్ లో కొనండి లేదా దీక్షకు ముందే మీరే స్వంతంగా సమకూర్చుకోండి

అన్ని వ్యవధుల సాధనకూ ఒకే ధర ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

divider

మమ్మల్ని సంప్రదించండి

divider
మీ సాధన సమయంలో ఏవైనా సందేహాల కోసం దయచేసి మీ స్థానిక శివాంగ కోఆర్డినేటర్‍ని సంప్రదించండి.

మీరు ఇక్కడ కూడా సంప్రదించవచ్చు
shivanga.co/emailsupport | +9183000 83111

Download the Shivanga Brochure for more details.

  • Shivanga Sadhana
  • Shivanga Spurthi
  • Kailasha Vadyam
  • Velliangiri Cleaning Drive
  • Donate
  • Contact

Contact

Phone: +91 83000 83111

Email: info@shivanga.org

Location

Isha Yoga Center, Velliangiri Foothills,

Ishana Vihar Post, Coimbatore,

Tamil Nadu - 641114

Direction →

Social Media

Terms and Conditions

Copyright © 2024 THENKAILAYA BAKTHI PERAVAI ALL RIGHTS RESERVED

Back to top