కైలాస వాద్యం తమిళనాడుకు రావడానికి ప్రధాన కారణం అప్పర్, 63 నాయనార్లలో (తమిళ శివ భక్తులలో) ఒకరు.
తిరునావుక్కరసర్ అని కూడా పిలువబడే అప్పర్, అనేక శివాలయాలను సందర్శించి, శివుని గురించి గొప్ప స్తోత్రాలను పాడారు. సుమారు 80 ఏళ్ల వయసులో, ఆయనకు కైలాస పర్వతాన్ని సందర్శించాలనే బలమైన కోరిక కలిగింది. శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ, ఆయన పట్టుదల అంత గొప్పది కాబట్టి, అలసిపోయేంత వరకు నడిచారు, పాకారు, దొర్లారు కూడా.
శివుడు ఒక వృద్ధ సాధువు వేషంలో అప్పర్ ముందు ప్రత్యక్షమై, వెనక్కి వెళ్లమని సలహా ఇచ్చాడు, కైలాసంలో శివుడు కనిపించడని చెప్పాడు. కానీ అప్పర్ దృఢంగా, "నేను శివుని దర్శనం పొందుతాను లేదా ఇక్కడే చనిపోతాను!" అని అన్నాడు. అప్పుడు శివుడు, అప్పర్ను దగ్గరలోని కొలనులో మునగమని, అది తనను పునరుజ్జీవింపజేస్తుందని ఒప్పించాడు. అప్పర్ మునిగినప్పుడు, ఆశ్చర్యకరంగా, అతను తిరిగి తిరువైయారులో బయటకు వచ్చి, తాను కోరుకున్న దర్శనాన్ని పొందాడు; జంతువులలో, పక్షులలో, చెట్లలో - ప్రతిచోటా శివశక్తుల సాన్నిధ్యాన్ని గ్రహించాడు. ఇదే కైలాస వాద్యానికి జన్మనిచ్చింది.
ఇప్పుడు తమిళనాడులోని అనేక శివాలయాలలో కైలాస వాద్యం వాయించబడుతోంది.
ధ్వనుల ప్రాముఖ్యత:యోగ సంస్కృతిలో, ధ్వనికి అపారమైన ప్రాముఖ్యత ఉంది, ఇంకా అది చైతన్యాన్ని పెంపొందించడానికి ఉపయోగించబడుతుంది. ఎల్లప్పుడూ మధురంగా లేకపోయినప్పటికీ, కొన్ని ధ్వనులు ఒకరి వ్యవస్థపై గొప్ప ప్రభావాన్ని చూపగలవు. ఉదాహరణకు, ఒక సాధారణ డప్పు శబ్దం కూడా సమ్మోహన స్థితిని కలిగించగలదు. కైలాస వాద్యం శివ స్థితిని అనుభూతి చెందడంలో సహాయపడే ప్రాచీన, శక్తివంతమైన వాద్య ధ్వనుల సమర్పణ.
ఈ ప్రాచీన ప్రక్రియను పునరుజ్జీవింపజేయడానికి, శివాంగ బృందం తమిళనాడు అంతటా వివిధ శివాలయాలలో కైలాస వాద్యాన్ని ప్రదర్శిస్తోంది. మరిన్ని వివరాల కోసం, దయచేసి info@shivanga.org కు రాయండి. సబ్జెక్ట్ లో "కైలాశ వాద్యం" అని పేర్కొనండి.