"ఇవ్వడానికి మీ హృదయ ద్వారాలను తెరిస్తే, దైవానుగ్రహం అందులోకి నిశ్చయంగా ప్రవేశించి తీరుతుంది."
వెల్లియంగిరి పర్వతాలను పరిశుభ్రంగా ఉంచడానికి, సహజ పర్యావరణాన్ని రక్షించడానికి, వాటి పవిత్రతను నిలబెట్టడానికి ఇంకా పర్యావరణ అవగాహన పెంచడానికి ‘తెంకైలయ భక్తి పేరవై’ ప్రతి సంవత్సరం శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
శివాంగ వాలంటీర్లు వేసవిలో, కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఉన్న అందరికీ ఉచితంగా మజ్జిగ అందిస్తారు. ఇది వేడిని తట్టుకోవడానికి, శరీరానికి తగినంత నీరు అందించడానికి ఇంకా శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
వివిధ శివాంగ కార్యకలాపాలు ఇంకా కార్యక్రమాలలో పాల్గొనే వందలాది వాలంటీర్లకు,పాల్గొనేవారికి అన్నదానం చేయండి, వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో తోడ్పడండి.
శివాంగ బృందం అందించే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు - శివాంగ సాధన, శివాంగ స్ఫూర్తి, కైలాస వాద్యం, శివ యాత్ర వంటివి - భక్తులు దైవానుగ్రహానికి పాత్రులు కావడానికి తోడ్పడతాయి.