COVID-19 మహమ్మారి దేశ దేశాలలో వ్యాప్తి చెందుతూ ఉండగా, ప్రపంచం, దాని వ్యాప్తిని అరికట్టటానికి ఇంకా వైరస్ ను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోంది. బలమైన రోగనిరోధక శక్తి గలవారు, ఈ నోవెల్ కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారని డాక్టర్లు ఒప్పుకుంటున్నారు. కాలక్రమేణ రోగనిరోధక శక్తిని సహజంగానే పెంపొందించుకోవడానికి సద్గురు కొన్ని విధానాలను మనతో పంచుకుంటున్నారు.

సద్గురు: ఈ వైరస్లు మన జీవితాల్లోకి కొత్తగా వచ్చినవి కాదు. అక్షరాలా మనం బ్యాక్టీరియా ఇంకా వైరస్ల సముద్రంలో జీవిస్తున్నాము. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వైరస్ మన వ్యవస్థకి కొత్తది, కాబట్టి మన శరీరాలు దానితో ఇబ్బంది పడుతున్నాయి. మనం అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేసి, - మిగతా వైరస్‌లు అన్నింటినీ ఎదుర్కొన్న విధంగానే - దీనిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనగలిగేలా చూడడం కోసం - మనం చేయగలిగినవి కొన్ని ఉన్నాయి. ఇది కరోనా వైరస్ కు చికిత్స అని కాదు గాని, ఈ సులభమైన వాటిని పాటిస్తే, 6 నుండి 8 వారాల సమయంలో, మీ రోగనిరోధక శక్తి కనీసం ఓ కొన్ని పాయింట్లు మెరుగవడాన్ని మీరే చూస్తారు. మీకు ఇంకా మీ చుట్టూ ఉన్న వారికి ఎటువంటి మరణ భయం లేకుండా, ఈ పరిస్థితిని దాటేందుకు మీకు కావలసినది ఇదే.

Infographic - 17 Tips to Boost Your Immune System

#1 వేపాకులు

Neem

మీ ఉదయకాల సాధన మొదలెట్టే ముందు, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు, 8 నుండి 12 వేపాకులు నోట్లో వేసుకుని, నమిలి వాటిని మీ నోటిలో ఉంచుకోండి. అది మీ నోటిలో ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే అది మీ నోటిలో ఉన్నప్పుడే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. దాన్ని ఒకటీ, రెండు గంటల పాటు నమలండి. దాన్ని ఊసేయకండి లేదా మింగకండి. దాన్ని నోట్లో ఉండనివ్వండి. అలాగే మీ సాధన చేయండి.

#2 పసుపు

ప్రతిరోజూ ఉదయాన్నే పసుపుని తీసుకోండి, ఆపై ఏదైనా తినక ముందు దాన్ని కనీసం ఒక గంట పాటు మీ కడుపులో ఉండనివ్వండి. ఇది మీకు అద్భుతాలను చేస్తుంది. సేంద్రీయ పద్ధతిలో పండించిన పసుపును వాడటం ఉత్తమం.

#3 మహాబిల్వ ఆకులు

raw mango health benefits

పశ్చిమ కనుమల ప్రాంతంలో లభించే మహాబిల్వ ఆకులు అనేవి ఒకటి ఉన్నాయి. ఉదయాన్నే మూడు నుండి ఐదు ఆకులను తింటే, అది మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

#4 నీలవేంబు కషాయం

మేము నీలవేంబు కషాయాన్ని ఈశా యోగ కేంద్రానికి దగ్గరలో ఉన్న గ్రామాలన్నింటిలో పంచుతున్నాము. మేము గమనించింది ఏమిటంటే, మేము పని చేస్తున్న ఈ ప్రదేశంలో, గత రెండు నెలల్లో ఒక్క కేసు కూడా లేదు. ఒక ముఖ్య విషయం ఏంటంటే మేమూ ఇంకా అధికారులు, చాలా సమర్థవంతంగా సామాజిక దూరం ఉండేలా చూడటం, రెండోది నీలవేంబు కషాయం, మీరు వీటిని పాటిస్తే చాలా సులభంగా మీ రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుకోవచ్చు, ఎందుకంటే మొత్తం మీద మనకున్న ఏకైక సంరక్షణ అదొక్కటే.

 

టాబ్లెట్ ఇంకా పౌడర్ రూపంలో Ishalife.com లో అందుబాటులో ఉన్నాయి.

#5 వేడి పానీయాలు

రోజుకి 4 నుండి 5 సార్లు వేడినీళ్లు తాగండి. అవి సాధారణ నీళ్లు కావచ్చు లేదా మీరు అందులో కొద్దిగా కొత్తిమీర లేదా పుదీనా వేయొచ్చు, లేదా ఒక చిటికెడు పసుపు వేయొచ్చు, లేదా నిమ్మరసం కూడా వేయొచ్చు, దీన్ని క్రమం తప్పకుండా తాగుతూ ఉండండి.

https://isha.sadhguru.org/in/en/blog/article/immunity-boosting-drinks-during-coronavirus

#6 నేల ఉసిరి

ఇది ఉసిరికాయలు కాసే కాలం. తెలుగులో దీన్ని నేల ఉసిరికాయ అంటారు. మీకు, ఇంకేదీ దొరకకపోతే హైబ్రీడ్ ఉసిరి కూడా పరవాలేదు. కాకపోతే ఇక్కడ ఈ కొండల మీద పండేది చిన్నగా ఉంటుంది. ఒక ఉసిరికాయని నలగొట్టి దాని మీద కొంచెం ఉప్పు చల్లి చప్పరించండి. మీరు దాన్ని నోటిలో ఒకటి నుండి రెండు గంటల పాటు ఉంచాలి ఎందుకంటే అది అక్కడ ఉన్నప్పుడే అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.

#7 తేనె ఇంకా మిరియాలతో ఉసిరి

honey gooseberry benefits

ఉసిరికాయని, కాస్త దంచిన మిరియాలతో పాటు రాత్రంతా తేనెలో నానబెట్టండి. రోజుకి మూడు సార్లు, సుమారు మూడు స్పూన్లు తీసుకోండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మొట్టమొదటిగా తీసుకునేది ఇదే అయితే, చాలా బాగా పనిచేస్తుంది. ఇది చేస్తే, నాలుగు నుండి ఎనిమిది వారాలలో, మీ రోగ నిరోధక శక్తిలో గణనీయమైన మెరుగుదలను చూడవచ్చు

#8 పచ్చిమామిడి

raw mango health benefits

పచ్చి మామిడి పళ్ళ కాలం కూడా ఇప్పుడే మొదలవుతుంది. అవి పండడం కోసం వేచి చూడకండి, పచ్చి మామిడి కాయని తినండి. అది కరోనా వైరస్ కు నివారణ కాదు, కానీ అది మీ రోగనిరోధక శక్తిని కొద్దిగా పెంపొందిస్తుంది.

#9 చవన్ ప్రాష్

సాంప్రదాయ పరంగా జీవ లేహ్యం లేదా చవన్ ప్రాష్ వంటివి ఉన్నాయి. ఇవి కూడా నిరోధక శక్తిని పెంచుతాయి. మీ ఇంటిలో 60 ఏళ్లకు పైబడిన పెద్ద వాళ్ళు ఉంటే, వాళ్లు చవన్ ప్రాష్ తో మొదలు పెట్టడం మంచిది.

#10 భైరవీ రక్ష

మేము బైరవి రక్షని తయారు చేస్తున్నాము. వీటిని రస వైద్యశాస్త్రంతో లేదా భారతీయ ఆల్కెమీతో తయారుచేస్తారు. వాటిని ఒక ప్రత్యేక విధానంలో తయారు చేస్తారు, మీరు వాటిని మీ చేతికి ధరించవచ్చు. అవి వేర్వేరు సైజుల్లో లభ్యం అవుతున్నాయి, కాబట్టి మీరు కోరుకుంటే, మీరు దాన్ని మీ పిక్క కండరానికి కూడా ధరించవచ్చు. అది ప్రతిష్టీంకరించబడినది, అది ఖచ్చితంగా మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

భైరవి రక్ష లింక్ 

#11 పృథ్వి ప్రేమ సేవ

చాలామంది తాము చనిపోయిన తర్వాతనే భూమితో అనుబంధం ఏర్పరచుకుంటారు. కానీ మీరు సజీవంగా ఉన్నప్పుడే భూమితో అనుబంధం ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. మరి ముఖ్యంగా ఇప్పుడు, ఈ వైరస్ ఉన్నప్పుడు. దీన్ని మేము పృథ్వి ప్రేమ సేవ అంటాము. అంటే దాని అర్థం, భూమితో ఎంతో ప్రేమతో ఉండడం. ఇలా చేయడం ద్వారా, మీ ప్రాణం మీదకి వచ్చే ఇటువంటి దాడులను నిరోధించే సామర్థ్యం ఎంతో గొప్పగా పెరుగుతుంది. కేవలం మనం బతికితే చాలదు, మనం బలంగా బతకడం ముఖ్యం.

మీకు ఒక చిన్ని తోట ఉంటే, మీరు ఆ తోటలో చేయవచ్చు. లేదా మరొకరి తోటలో ఈ పని చేసి పెట్టొచ్చు. వాళ్లకి ఉచితంగా పని జరుగుతుంది. కానీ వాళ్ళకి లాభం కలుగుతుంది అనుకోకండి; వాళ్ళ కంటే మీరే ఎక్కువ పొందుతున్నారు ఎందుకంటే నేలతో స్పర్శలో ఉండటం అనేది మీ శరీరం పని చేసే తీరులో ఎంతగానో మార్పు తెస్తుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఎక్కడో ఒకచోట ఉపయోగించుకోవాలి - కనీసం వెళ్లి వీధులు శుభ్రం చేయండి. ఏదో ఒకటి చేయండి! మీ చేతులకు మట్టి అంటడం ముఖ్యం. అలాకాక, ఎవరైతే గొప్ప కుటుంబంలోని వారిమని, అలా పనిచేస్తూ కనపడకూడదని, అది మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగిస్తుందని అనుకుంటారో, మీరు మడ్ బాత్ తీసుకోవచ్చు. అవును అది కూడా ఒక మార్గమే

#12 శరీరంలో ఉష్ణాన్ని పెంచడానికి యోగ యోగ యోగేశ్వరాయ స్తుతి చేయండి

యోగ యోగ యోగేశ్వరాయ చాంట్, మీ శారీరిక వ్యవస్థలో సమత్ ప్రాణాన్ని లేదా ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడం కోసం. ఉష్ణ ఇంకా శీత అనేవి ఉంటాయి. మీరు తగినంత సమత్ ప్రాణాన్ని సృష్టించి, తద్వారా వ్యవస్థలో ఉష్ణాన్ని సృష్టిస్తే, మీ రోగనిరోధక శక్తి మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఈ స్తుతి రోగనిరోధక శక్తిలో కొంత బలాన్ని తెస్తుంది, ఎందుకంటే అది ఉష్ణాన్ని కలగజేస్తుంది.

https://isha.sadhguru.org/blog/article/offerings-sadhguru-challenging-times

మరొకసారి ఇది స్పష్టం చేస్తున్నాము, ఇది కరోనా వైరస్ కు చికిత్స కాదు లేదా ఇది దాని నివారణ కూడా కాదు. “నేను నా చాంటింగ్ చేశాను, కాబట్టి బాధ్యతారహితమైన పనులు చేస్తాను” అంటే - అది ఈ విధంగా పని చేయదు. ఇవి మీరు ఓ కొద్దికాలం పాటు చేస్తూ ఉండాలి. ఎందుకంటే, మీ రోగనిరోధక శక్తిని పెంపొందించుకుని, తద్వారా వైరస్ వచ్చినప్పుడు, దాన్ని వ్యవహరించేందుకు మీరు మరింత మెరుగైన రీతిలో ఉండడానికి.

#13 ఈశా క్రియ ప్రాక్టీస్ చేయండి

మనం చేసిన ఒక ప్రాథమిక తప్పిదం ఏమిటంటే, ‘మనకీ’ ఇంకా ‘మనదైన దానికీ’ మధ్య వ్యత్యాసం గుర్తించడంలేదు. ‘నేను పోగు చేసుకున్నది నాది కాగలదు’ అంటే, దీన్ని మనం విభేదించడం లేదు. కానీ అది ‘నేను’ కాదు కదా. ఇదెలా అంటే ‘నేను వేసుకున్న బట్టలే నేను’ అంటే, అప్పుడు నాకు మతి పోయిందనేగా అర్థం. అదే విధంగా, ఈ శరీరము ఇంకా ఈ మనసు మీరు పోగు చేసుకున్నవి – మీకు తెలిసినవి ఇంకా మీకు తెలియనివి - అన్ని కూడా మీరే అంటే, అప్పుడు మీకో సమస్య ఉన్నట్టే. ఈ సమస్య మీ జీవితాలతో రోజూ ఆడుకుంటుంది, కానీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అది ఎంతో పెద్ద ప్రభావం చూపవచ్చు. దీనికి మనకి ఒక సులభమైన పరిష్కారం ఉంది: ఈశా క్రియ - ఏది మీరో, ఏది మీరు కాదో, వాటిని వేరు చేయడానికి, ఇది ఒక సులభమైన విధానం. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేందుకు అది ఉచితంగా అందుబాటులో ఉంది. మీలోకి మీరు ఈ మాత్రం ఎరుకని తీసుకు వస్తే, అంటే, ఏది నేను, ఏది నేను కాదు అన్న ఎరుకని తీసుకువస్తే, అప్పుడు ఇటువంటి ఆపత్ కాలాలు దాటటం ఎంతో సులభతరం అవుతుంది.

#14 రోగనిరోధక శక్తిని, ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచటానికి రెండు సులభమైన సాధనలు

సింహ క్రియ అనేది ఒక సులభమైన యోగసాధన, ఇది శక్తి చలన క్రియ వంటి శక్తివంతమైన ప్రక్రియలు చేయని వారికి వర్తిస్తుంది. సింహ క్రియ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరిచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అన్నిటినీ మించి, మీరు దీన్ని ఓ ఐదు రోజుల పాటు వరుసగా చేయగలిగి, ఉన్నట్టుండి ఒక రోజున ఇది చేయలేకపోతే, అప్పుడు మీ శ్వాసకోశ వ్యవస్థలో ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉన్నట్టే. అది కరోనా వైరస్ కాకపోవచ్చు, అది ఏదైనా ఇతర సమస్య కావచ్చు. ఒక్కసారిగా మీరు అది చేయలేకపోతే, మీరు తప్పనిసరిగా చెకప్ చేయించుకోవాలి.

అలాగే సాష్టాంగ అనే ఒక ఆసనం కూడా ఉంది. ఈ భంగిమలో ఊపిరితిత్తులు ఒక విధంగా పనిచేస్తాయి, తద్వారా వ్యవస్థలోని ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అత్యంత సర్వసాధారణమైన ఆసనం, కాకపోతే వాడుకలో ఇది ఎన్నో మార్పులకు గురైంది. దాదాపు ప్రతి భక్తుడు కూడా ఈ భంగిమ చేస్తాడు, కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల, ప్రజలు ఊరికే అలా నేలమీద పడుకుంటున్నారు. ఈ భంగిమలోని ప్రాముఖ్యత ఏమిటంటే, మీ శరీరంలోని ఎనిమిది ప్రదేశాలను నేలకానించి, అలా ఉంచుతారు. ఆ తర్వాత మీరు శరీరాన్ని సడలించి శరీరం మొత్తం నేలకు తాకేలా ఉంచుతారు, ఆపై మకరాసనంలోకి వెళ్తారు.

ముఖ్యంగా మీలో చాలామంది ఇప్పుడు మాస్కు ధరిస్తున్నారు. కాబట్టి ఇన్ఫెక్షన్లు లేకపోయినా, ఆక్సిజన్ స్థాయిలు తగ్గే ప్రమాదం ఉంది. మీరు ఈ సాధనను, రోజులో నాలుగు నుండి ఐదు సార్లు చేస్తే, మీ ఆక్సిజన్ స్థాయిలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇదే ఖచ్చితమైన చికిత్స, లేదా నివారణ కాదు. కానీ మన ఆరోగ్యం కూడా ఖచ్చితమైనది లేదా మనం ప్రభావితం చేయలేనిది కాదు. మన ఆరోగ్యం అనేది మనం వేసే చిన్నచిన్న అడుగులు పర్యవసానమే. ఈ మహమ్మారి సమయంలో దయచేసి అడుగు వేయండి, ఇంకా వీలైనంతవరకు మీరు ఈ వైరస్ బారిన పడకుండా, లేదా ఈ వైరస్ ను వ్యాప్తి చెందించకుండా ఉండేలా చూసుకోండి.

సాధన చేసేందుకు నియమాలు:

  1. సాష్టాంగం ఇంకా మకరాసనం అనేవి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయాలి.
  2. గర్భవతులు సాష్టాంగం ఇంకా మకరాసనం చేయకూడదు. అయితే వారు, సింహ క్రియ చేయవచ్చు.

#15.మీ సాధనను కొనసాగించండి

మనకి వాస్తవంగా తెలిసిన ఒకే ఒక విషయం ఏమిటంటే, ఎవరికైతే మంచి బలమైన రోగనిరోధక శక్తి ఉంటుందో వాళ్ళు నిలబడ గలుగుతారు, ఎవరికి ఉండదో, వాళ్ళు ఈ covid19 వల్ల హానికి గురవుతారు. ఈ ఒక్క విషయం తప్ప మనకి ఈ వైరస్ గురించి ఇంకేమీ తెలీదు. ఈ విషయానికి వస్తే, మీరు మీ సాధనను కొనసాగించాలి, అది మీ రోగనిరోధక శక్తిని చాలా బలంగా ఉంచుతుంది. ఇండియనా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా, హార్వర్డ్ మెడికల్ స్కూల్, ఇంకా ఇతర యూనివర్సిటీలోని రీసెర్చర్లు, ఈశా యోగ ప్రాక్టీస్ ల మీద అధ్యయనాలు చేసి, ఇన్ఫ్లమే టరీ, BDNF ఇంకా ఇతర మార్కర్లను పరిశీలించి, ఈ సాధనలు చేసే వారిలో రోగనిరోధక శక్తి స్థాయిలు మరింత అధిక స్థాయిలో ఉన్నాయి అనేదాన్ని స్పష్టంగా నిర్ధారించారు. ప్రతి ఒక్కరు సాధనను కొనసాగించాలి.

#16. తగినంత భౌతిక శ్రమ చేయండి

exercise

ఇప్పుడు అందరూ ఇంట్లో ఉన్నారు. ఊరికే ఇంట్లో కూర్చుని రోజంతా ఏదో ఒకటి తింటూ లేదా మద్యం తాగుతూ వారు మరింతగా ఇన్ఫెక్షన్ బారిన పడే విధంగా చేసుకుంటున్నారు. ఒక సులభమైన విషయం భౌతిక శ్రమ చేయడం. ఈ సమయాన్ని ఫిట్ గా అయ్యేందుకు ఉపయోగించుకోవడానికి ఇది మంచి సమయం. మీకు ఇంకేదీ తెలియక పోతే, కనీసం మీరు ఉన్నచోటనే జాగింగ్ చేయండి, ఒక పదిహేను నిమిషాల పాటు, ఇలా రోజుకి 5 నుండి 6 సార్లు చేయండి. అప్పుడు శరీరం విషయాలను మరింత మెరుగ్గా వ్యవహరిస్తుంది.

#17. మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోండి

keep happy during coronavirus

మానసిక ఆందోళన అనేది, రోగనిరోధకశక్తిని తగ్గించే వాటిలో ఖచ్చితంగా ఒకటి. అలాగే పూర్తి స్ఫూర్తితో, ఆనందంతో, ఇంకా ఉత్సాహంతో ఉండటం అనేది మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇంకా మీ శరీరాన్ని మరింత మెరుగ్గా పనిచేసేలా చేసేందుకు ఒక విధానం కూడా.

సంతోషంగా, విచక్షణతో ఇంకా బాధ్యతాయుతంగా ఉన్న ఒక మనిషి, ప్రతి దాని గురించి చచ్చేంత సీరియస్ గా ఉండే వారి కన్నా పరిస్థితులను మరింత మెరుగ్గా వ్యవహరించగలరు. మరి ముఖ్యంగా మీరు భయాందోళనలో ఉంటే, మీరు స్తంభించిపోతారు. మీలో ఉన్న ప్రతి సామర్థ్యమూ కూడా పనిచేస్తూ ఉండటం చాలా ముఖ్యం, అప్పుడే మీ శరీరం, మీ మెదడు పని చేసి, అవసరమైన విధంగా స్పందిస్తాయి.