యోగా గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు
ArticleJan 17, 2017
యోగాకు సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు.
- యోగా అన్నది స్వర్గానికి వెళ్ళడం గురించి కాదు. మీనుంచి మీరే ఓ స్వర్గాన్ని సృష్టించుకోవడం గురించి.
- యోగా అంటే తలకిందులుగా నిలబడడమో లేదా శ్వాస బిగపట్టడమో కాదు. యోగా అంటే మీ జీవితాన్ని మీ అధీనంలోకి తెచ్చుకోవడం.
- యోగ సాధన చేయడం ద్వారా మీ మెదడు కార్యకలాపాలనూ, మీ శారీరిక రసాయనికతనూ, ఆ మాటకొస్తే మీ జన్యు వ్యవస్ధను కూడా మార్చవచ్చు.
- యోగా అంటే గుండ్రంగా (ఒక పరిధిలో) తిరుగుతున్న జీవితాన్ని సూటిగా ఓ సరళ రేఖలో ముందుకు సాగేలా చేయడం.
- యోగా అంటే శక్తివంతంగా జీవించడం. కేవలం కూరగాయలు తినడం, మిమ్మల్ని మీరు మెలికలు తిప్పుకోవడం లేదా మీ కళ్ళు మూసుకోవడం యోగా కాదు.
ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.