FILTERS:
SORT BY:
ఎంతో అద్భుతమైన ఈ మనస్సు, చాలామంది విషయంలో దుఃఖాన్ని ఉత్పత్తి చేసే యంత్రంలా మారిపోయింది.
మీ ఆనందాన్ని భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోకండి. మీరు ఆనందంగా ఉన్నప్పుడు, మీ జీవితమంతా ఒక వేడుకలా ఉంటుంది.
ప్రతీ విషయం మీదా పూర్తి నిశ్చయంతో ఉండేవారు, తమ మేధస్సుని కోల్డ్ స్టోరేజీలో పెట్టినట్టే.
మీ ఆలోచనలు ఇంకా భావోద్వేగాల్లో మిమ్మల్ని మీరు ఎంతగా ప్రత్యేకం చేసుకుంటారో, జీవితానికి మీరు అంతగా దూరమవుతారు.
నీరు జీవాన్ని నిర్మించే పదార్థం. నీటి వనరులను కాపాడటం అంటే, జీవాన్ని కాపాడటమే.
కృపకు పాతృలు అయ్యేందుకు అత్యుత్తమ మార్గం, మీలోని 'నేను' అనే భావనను తగ్గించుకోవడమే.
పనికిరాని విషయాల కోసం మీ సమయాన్ని, జీవితాన్ని వృధాచేయకండి. మీకు నిజంగా ముఖ్యమైన దాని పట్ల నూటికి నూరు శాతం నిబద్ధత చూపండి– ఈ రోజే, రేపు కాదు.
నమ్మకం అంటే, మీకు ఏమాత్రం తెలియని విషయాల గురించి మీరు ఒక నిర్ధారణకు వచ్చారు.
మీరు అడవిలో సమయం గడిపినప్పుడు, మీరు కూడా కేవలం మరొక జీవం మాత్రమేనని గ్రహిస్తారు. మిమ్మల్ని మీరు ఎలా అనుభూతి చెందుతున్నారో, మీ చుట్టూ ఉన్న జీవాన్ని కూడా అలా అనుభూతి చెందటం ఆధ్యాత్మికంగా ఒక గొప్ప ముందడుగు.
సూర్యుడు అత్యంత ప్రకాశవంతంగా ఉండే సమయమిది. జీవం ఉచ్ఛస్థితిలో ఉంటుంది. మీ జీవితం ఫలప్రదం కావాలన్నా, మీలో పరివర్తన కలగాలన్నా - ఇదే సరైన సమయం.
ఇతరులను బాధపెట్టి ఎవరూ బాగుపడలేరు. తాత్కాలికంగా మీకు లాభం చేకూరినా, దానికి తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదు.
ఇక మీకు మీరే పట్టనంతగా జీవంతో మీరు మమేకం ఐయ్యారంటే, అదే భక్తి