Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
బాహ్యంగా ఒక పరిస్థితిని సృష్టించడానికి, మీకు ఇతర వ్యక్తుల, శక్తుల సహకారం అవసరం. అంతర్గత పరిస్థితిని సృష్టించడానికి, మీరొక్కరే చాలు.
గతాన్ని మీలో సజీవంగా ఉంచితే, వర్తమానంలో మీరు నిర్జీవులౌతారు.
సంపద శ్రేయస్సుకి దారి తీయాలంటే, అందుకు మీలో ఆధ్యాత్మిక అంశం ఉండాలి. అది లేకుంటే, మీ విజయమే మీకు వ్యతిరేకంగా పనిచేయగలదు.
జ్ఞానోదయం కోసం పరితపించకండి. మీ తపన ప్రస్తుతం మీకున్న పరిమితుల్ని త్వరగా ఎలా అధిగమించాలి అనే దానిపై ఉండాలి.
ఆనందం అనేది సాధించాల్సిన విషయం కాదు. అది మీ జీవితంలో సహజ సిద్ధమైన వాతావరణంగా ఉండాలి.
భూమిలా, చెట్టులా - కేవలం ఓ జీవంగా అవ్వండి. మీరు కేవలం ఒక జీవంగా ఉంటే, మీలోని మానవ చైతన్యం సహజంగానే వ్యక్తం అవుతుంది.
మీ అన్వేషణ తగినంత తీక్షణంగా మారితే, జ్ఞానోదయం ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే అంతిమంగా మీరు దేనికోసం వెతుకుతున్నారో అది మీలోనే ఉంది.
అంకిత భావంతో ఉన్న వ్యక్తికి పరాజయం అంటూ ఏమీ ఉండదు - ఉండేవి, జీవన యాత్రలో నేర్చుకోవలసిన పాఠాలే.
మీరు గ్రహించినది మాత్రమే మీకు తెలుస్తుంది - మిగతాదంతా ఊహే. యోగ అనేది గ్రహణశక్తిని పెంపొందించే విజ్ఞానం.
మీరు శాశ్వతం కాదు అన్న ఎరుక నిత్యం మీలో ఉన్నట్లయితే, మీ ఆధ్యాత్మిక అన్వేషణ అచంచలంగా ఉంటుంది.
ఇతరులు పరిస్థితులను మాత్రమే సృష్టించగలరు. వారు ఏదైనా చెప్పొచ్చు లేదా చేయొచ్చు, కానీ దాని వల్ల మీరు బాధపడాలా వద్దా అనేది మీ ఎంపికే.