సద్గురు: గత కొన్ని వారాలుగా నేను మన కొత్త పుస్తకంలో తలమునకలై ఉన్నాను. ఆ పుస్తకం పేరు ‘మరణం....’ . ఈ పుస్తకం చనిపోయే వారికి మాత్రమే. నేను ఈ పుస్తకాన్ని మరోసారి తిరగ వేస్తున్నప్పుడు, జీవితం గురించిన గంభీరమైన విషయాల గురించి ప్రజలు మూర్ఖంగా ఎన్ని విషయాలు లేవనెత్తుతారా అని చూస్తున్నాను, ఎందుకంటే ప్రజలు ఈ పుస్తకం నుంచి అసందర్భ ప్రస్తావనలతో, లేనిపోని విషయాలను లేవనెత్తుతారు.

‘మరణం’ మీద ఓ పుస్తకం – నిర్ఘాంత పరచే, మొరటైన రచన

తమ సరికొత్త పుస్తకం ‘మరణం’ లో సద్గురు ఎన్నో రహస్యాలను బహిర్గతం చేస్తారు. తాను ముక్కుసూటిగా వ్యక్తపరిచిన అనేక అంశాల వల్ల ఈ పుస్తకం అనేక అలజడులకు ఎలా కారణం అవుతుందో వివరిస్తున్నారు. “ఇది కేవలం కొంత ప్రభావం చూపడానికే కాదు. ఎలాగూ వాస్తవం కూడా అదే. ఆ వాస్తవమే ఎంతో నిర్ఘాంత పరచేది’’ అని సరైన వివరణ ఇస్తూ ఆయన అంటారు. సద్గురు: గత కొన్ని వారాలుగా నేను మన కొత్త పుస్తకంలో తలమునకలై ఉన్నాను. ఆ పుస్తకం పేరు ‘మరణం....’ . ఈ పుస్తకం చనిపోయే వారికి మాత్రమే. నేను ఈ పుస్తకాన్ని మరోసారి తిరగ వేస్తున్నప్పుడు, జీవితం గురించిన గంభీరమైన విషయాల గురించి ప్రజలు మూర్ఖంగా ఎన్ని విషయాలు లేవనెత్తుతారా అని చూస్తున్నాను, ఎందుకంటే ప్రజలు ఈ పుస్తకం నుంచి అసందర్భ ప్రస్తావనలతో, లేనిపోని విషయాలను లేవనెత్తుతారు.

అయినా పర్వాలేదు. నేను నా జీవితంలో, వ్యవహార రీత్యా సరైనదే చెప్పనవసరం లేని స్థాయికి చేరాను. నేను ఏమి చెప్పదలచుకున్నానో, అదే చెబుతాను. నా జీవితం మొదటి భాగంలో, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను, కానీ నా మనసులో ‘ధ్యానలింగం ప్రతిష్టించాలి’ అన్న ఆలోచన వచ్చాక, అవే మాటలకు, కాస్త మెరుగులు దిద్ది, కొంచెం లౌక్యంగా మాట్లాడాను. నేను వస్త్రధారణ కూడా చక్కగా చేసుకోవడం మొదలెట్టాను. లేకపోతే నేను అన్ని విధాలుగా మొరటుగా ఉండే వాడిని. ఈ పుస్తకంలోని ఎక్కువ విషయాలు ఆ కాలం నాటివే. అవి చాలా మొరటుగానూ, ముక్కుసూటిగానూ ఉంటాయి.

మరోసారి, లౌక్యంగా మాట్లాడవలసిన కాలం నాకు చెల్లిపోయింది. మరో సంవత్సరం పాటు కొద్దిగా అలానే మాట్లాడతానేమో కానీ, ఆ తర్వాత సాంఘిక పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి నేను ముక్కుసూటిగా మాట్లాడబోతున్నాను. ఎందుకంటే సత్యాన్ని ఎవరో ఒకరు ముక్కుసూటిగా తెలియపరచాలి. ఈ భూగోళం మీద తమ అంతరంగంలో అమోఘమైన క్షమతతో వచ్చిన జ్ఞానులను, వారి జీవిత కాలంలో ఎవరూ పట్టించుకోలేదు. మనం అంత దురదృష్టువంతులం కాదు. మనం బాగానే పని చేస్తున్నాము. మనల్ని కనీసం కొంతమందైనా అర్థం చేసుకుంటున్నారు. కొందరికి ఎంతో ఇష్టం, కొందరు అసహ్యించుకుంటారు. కానీ ఆ ఇంతకూ ముంది వచ్చిన అమోఘ జీవులను వారి జీవితాల్లో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ప్రజలు వారిని చంపబోయారు. వారిని ప్రజలు తరిమేసే వాళ్ళు. వారికి విషయం ఇచ్చారు, ఇంకా సిలువపై ఎక్కించారు. ప్రపంచ చరిత్ర ఇలాగే ఉన్నది. ఆ విధంగా చూస్తే మనం బాగానే ఉన్నాము. కొందరు ఇంటర్నెట్ నిపుణులు మన వీడియోలను 100 కోట్ల మందికి పైగా ప్రజలు ఇంతవరకు చూశారు అని చెప్పారు. కాని అది మన లక్ష్యం లో 16 శాతం మాత్రమే.

ఉన్నది ఉన్నట్టు చెప్పవలసిన సమయం

ఒక జ్ఞాని అవతరించినప్పుడల్లా, వారు సామాన్యంగా తమ నోరు తెరవలేదు. నాలాగా అత్యుత్సాహం ఉన్నవాళ్లు నోరు తెరిస్తే, చంపి వేయబడ్డారు. కొందరైతే విషయాన్ని నచ్చేలా తెలివిగా చెప్పి, దానిని సమాజంలో ఒక భాగంగా తీర్చిదిద్దేందుకు అనేక విధాలుగా ప్రయత్నం చేశారు, కానీ కొంతకాలం తర్వాత వారు చెప్పినదంతా వేలాది దారుల్లో ప్రజలు వక్రభాష్యం చేశారు, తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు. తమకు అనుకూలమైన విధంగా దానిని మార్చివేశారు.

ఈరోజు మనం చెప్పినదంతా రికార్డు చేయగలిగిన అవకాశం ఉన్నది. ప్రజలు అంత తేలిగ్గా దాన్ని మార్చి వేయలేరు. ఎందుకంటే వీడియోను మళ్ళీ వేసి చూడగలము. పూర్వం ఇలా మాట్లాడడానికి మనం సందేహించామని కాదు, ఏవో కొంతమంది దగ్గరి వారితో తప్ప, కొన్ని కొన్ని విషయాలను మిగతా వారికి దూరంగా ఉంచాము, అంతే. కానీ 100 కోట్ల మంది మన వీడియోలను చూస్తున్నప్పుడు, ప్రపంచం లోనివారంతా మన దగ్గర వారే. ఇక ఇది ఆశ్రమంలో నివసించేవారికి పరిమితం కాదు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో, జీవితంలో ఎప్పుడూ నన్ను చూడని వారు ఉన్నారు. వారు కూడా నాకు సన్నిహితులే.

నా మనసులో, హృదయంలో వారు నాకు ఇప్పటికే సన్నిహితులు, ఇప్పుడు వారి మనసులో, హృదయంలో కూడా నేను వారికి సన్నిహితుడనే. కొన్ని కఠినమైన విషయాలను కేవలం ఇక్కడ కూర్చున్న కొద్దిమందికే సూటిగా చెప్తూ ఉండలేను. మనం అందరితో మాట్లాడటం మొదలు పెట్టాలి. దానిని జీర్ణించుకోలేని వారు టాయిలెట్ కు వెళ్ళవలసి వస్తుంది. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా, ముక్కుసూటి మాటలకు ప్రపంచం సిద్ధంగా ఉందని నాకు అనిపిస్తోంది, అందుకే నేను ఈ రకంగా ఉన్నాను. మనుషులు చిన్నప్పటినుంచి అన్నిరకాల విషయాలకు గురి కావడం వలన అది వారిని గట్టివారిగా చేసింది. పద్నాలుగు ఏళ్లు వచ్చేటప్పటికి, వారు చాలా గట్టిపిండాలు అయి పోయారు. ఈనాడు ఎనిమిదేళ్ల బాల బాలికలకు మనం పద్నాలుగేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఊహించని విషయాలు కూడా తెలిసిపోతుంటాయి. వారు చాలా గట్టి పిండాలు, అందువల్ల వారికి సుతిమెత్తగా మాట్లాడితే ప్రయోజనం లేదు. ‘మరణం’ మీద ఈ పుస్తకం చాలా గట్టి కథనం. మేము కావాలనే వాటిని ఏమాత్రం భాషను మెరుగుపరచకుండా, నేను చెప్పినట్లే ఉంచేశాము. ఎందుకంటే, ఇది సిసలైన సాధకుడు ఆ క్షణంలో వేసిన లోతైన ప్రశ్న. మనం ప్రస్తుతం ప్రపంచంతో అదేవిధంగా మాట్లాడుతున్నాము. అది చాలా అలజడికి దారి తీయబోతోంది.

కానీ మానవజాతికి ఈ సమయం ఎంతో ముఖ్యమైనది. మనం ఎంత మందికి చేరగలము, ఎంతమందికి అందుబాటులో ఉంచగలము అనే విషయాలలో, మానవజాతి ఎప్పుడూ ఇంత అందుబాటులో లేదు. క్రికెట్ పరిభాషలో ఇది సూపర్ ఓవర్, అందుకే మనం ప్రతి బంతిని సిక్స్ కొట్టాలి. కొంతమంది దీనిని ఇష్టపడక పోవచ్చు. ఎరుక లేనివాడు, బంతిదెబ్బ బాగా తగలడం మూలంగా పడిపోవచ్చు. అయితేనేమి, మిగతా ప్రపంచం అంతా దీనిని ఆస్వాదిస్తారు.

 

ప్రజలు ఇది ఇష్టపడతారా లేదా అన్నది కాదు విషయం. వారు దేనికోసం చూస్తున్నారు అనే దానితో పనిలేదు. వారు ప్రేమ కోసం, సెక్స్ కోసం లేక అమెజాన్ లో ఏదో ఒకటి కొనడానికో చూస్తూ ఉండవచ్చు, లేక వారు ముక్తికై ఎదురు చూస్తుండవచ్చు. వారు దేని కోసం చూస్తున్నా అందరికీ ఇది తగలాలి.

ఇంత మంది జనాభాతో, మనం అందుకున్న ఈ స్థాయి శక్తితో, ఇప్పుడు మనం అంతరంగం వైపుకు చూడకపోతే, మానవజాతి ఎప్పుడూ చూడని అతి ఘోరమైన విపత్తుకు మనం చేరబోతున్నాము. ఉన్న ఒకే ఒక్క సమస్య

ప్రపంచానికి ఉన్న ఒకే ఒక సమస్య, మానవులు. మరి మానవులకు ఉన్న ఒకే ఒక సమస్య ఏమిటయ్యా అంటే, తను సరైన స్పృహతో లేకుండా, నిర్బంధ జీవిగా ఉన్నాడు. సరైన స్పృహ లేకపోవటం అయినా, నిర్బంధం అయినా, అది ఒక యుద్ధంగానో, కుటుంబ సమస్యగా పరిణమించవచ్చు. ఇవి మానవుని నిర్బంధ ప్రవర్తనకు వేరు వేరు వ్యక్తీకరణలు. మీకు ఈ స్థాయి తెలివి, ఎరుక, క్షమత ఉన్నది ఎందుకంటే, ప్రకృతి మీరు చైతన్య వంతులుగా అవుతారని ఆశించింది. మీరు ఎరుకతో వాడుకుంటారు అని నమ్మి, ప్రకృతి మీకు ఇంత పెద్ద బుర్ర ఇచ్చింది. కానీ మీరు విజ్ఞాన పరంగా చూసినా, రాజకీయాలు చూసినా, మతాన్ని చూసినా, పరిశ్రమలు చూసినా, వ్యాపారం చూసినా, ప్రపంచంలో ఉన్న ఇలాంటి అన్ని పెద్ద శక్తులూ, ఎరుక లేకుండా, నిర్బంధంగా నడుస్తున్నాయి. అందుకే మన బోధనకు కూడా ఒక నిర్ఘాంత పరచే శక్తి ఉండాలి, లేకపోతే దానిని ఎలా నిర్లక్ష్యం చేయలో వారికి తెలుసు.

ఇది కేవలం ఏదో ప్రభావం చూపడం కోసం కాదు, యదార్థం ఎలాగూ ఈ విధంగానే ఉన్నది. సత్యం ఎప్పుడూ మిమ్మల్ని విస్మయానికి గురిచేసేదే. ప్రజలు తాము ప్రేమించే వారికి కూడా అబద్ధాలు చెబుతారు ఎందుకంటే ఏ చిన్న యధార్థం కూడా చాలా విస్మయం కలిగిస్తుంది. ఇటువంటి యదార్థాన్ని మింగి అరిగించుకోగల శక్తి చాలా కొద్ది మందికే ఉంటుంది. వారి గురించి యదార్థాన్ని తెలియపరిస్తే వారికే పిచ్చెక్కుతుంది. ఎందుకంటే నాగరికత, మతాలు అనేవి ఎప్పుడూ వారికి ఎలా మంచిగా ఉండాలో నేర్పాయి. మీరు పూర్తి సామర్థ్యం కల మానవునిగా వికసిస్తే, ఇక మీరు చక్కగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది చక్కగా ఉండటమే, అంతకన్నా ఏమీ కాదు, అంతే. ఒక పువ్వు వికసించింది. అది మీ పట్ల మంచిగా ఉండే ప్రయత్నం చేయటం లేదు. అది చక్కగా ఉంది. స్వాభావికంగా అది అద్భుతంగా ఉంది, అంతే.

మిమ్మల్ని మీరు సమాయత్తం చూసుకోండి

మిమ్మల్ని మీరు సమాయత్తం చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎన్నో ప్రక్రియలు జరుగుతున్నాయి. మనం ఎన్నో చోట్ల అగ్ని రగిల్చాము, అది మెల్లిగా అంటుకుంటుంది. దురదృష్టవశాత్తూ, మనం పర్యావరణాన్ని కూడా పట్టించుకోవలసి వస్తోంది. అటువంటి పని లేకపోతే బాగుండేది అనుకుంటున్నాను. కానీ, అది ఎంత పెద్ద సమస్య అంటే, ప్రజలు నన్ను ‘మొక్కలు నాటే మనిషి’ అంటున్నారు. నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈ లక్ష కోట్ల చెట్ల (trillion tree campaign) ఉద్యమంతో నన్ను అందరూ మొక్కలు నాటే వాడే అంటారు. ఆ స్థితి నుంచి నన్ను నేను బయటికి తెచ్చుకోవాలంటే, ఆధ్యాత్మిక విషయాలను నేను మరి కొంత గట్టిగా చెప్పవలసి ఉంటుంది. లేకపోతే నన్ను మొక్కలు నాటే వానిగానే భావిస్తారు. మొక్కలు నాటడం అనేది చెడ్డ వృత్తి ఏమీ కాదు. కానీ నా పని ప్రజలను వికసింప చేయడం, అంతేగాని మొక్కలు నాటడం కాదు.

ఒకసారి ఇలా జరిగింది, అత్యుత్సాహంగా ఉన్న ఒక సేల్స్ పర్సన్, ఏదో కొత్త కాలనీ అభివృద్ధి కావడం చూశాడు. అందులో కొన్ని ఇళ్ళలో అప్పటికే కొందరు నివసిస్తున్నారని గ్రహించాడు. ఈ కొత్త గృహ సముదాయంలో తన వ్యాక్యూమ్ క్లీనర్ అమ్మిన మొదటి వ్యక్తి తానే కావాలని ఉత్సాహ పడ్డాడు. అతను ఒక తలుపు తట్టాడు. ఒకామె తలుపు తెరిచింది. అతను లోనికి వెళ్లి తన సంచిలో ఉన్న గుర్రపు లద్దెలు కార్పెట్ అంతా వేసేశాడు. ఆ తర్వాత ‘‘చూడండి, ఇప్పుడు నా దగ్గరున్న వ్యాక్యూమ్ క్లీనర్ తో కొంచెం లద్దె కూడా లేకుండా మొత్తం శుభ్రపరిచి, మీ తివాచీ మంచి వాసన వచ్చేలా చేస్తాను’’ అన్నాడు. ఈ చెత్తనంతా ఐదు నిమిషాలలో శుభ్రపరుస్తాను, అలా చేయలేక పోతే ఈ గుర్రపు లద్దె అంతా నేనే తినేస్తాను’’ అన్నాడు. అప్పుడు ఆమె ‘‘ఆగండి నేను కిచెన్ కు వెళ్ళి కాస్త టొమేటో సాస్ తెస్తాను’’ అంది. అతను ‘‘ఎందుకు?’’ అన్నాడు. ఆమె ‘‘ఇల్లు కొత్తది కదా, ఇంకా కరెంటు రాలేదు’’ అన్నది. ఇలా మీ చేత గుర్రపు లద్దె తినేలా చేయాలంటే, టమోటా సాస్ పనికి వస్తుంది. కానీ, ఈ టమాటా సాస్ మూలంగా, ప్రపంచంలో చాలామంది ఎక్కువ శాతం పేడను తింటున్నారు. టమాటా సాస్ లేకపోయినట్లయితే, అది తినలేమని అందరికీ తెలుసు. కేవలం టమాటా సాస్ వల్ల ఏది పేడో, ఏది బలవర్ధకమైన ఆహారమో, మీరు గుర్తించ లేకపోతున్నారు. అందుకే మేము టమాటా సాస్ లేకుండా చేస్తాము.