వేదిక- ఈశా యోగా కేంద్రం
ఈశా ఫౌండేషన్ హెడ్ క్వార్టర్స్ అయిన ఈశా యోగా కేంద్రం కోయంబత్తూరులోని వెల్లెంగిరి పర్వతపాదాల వద్ద ఉన్నది. ఆత్మ పరిణామానికి అనువైన పవిత్ర స్థలం ఈశా. మీ అంతర్గత శ్రేయస్సుకై ఇక్కడ సమయాన్ని వెచ్చించవచ్చు. యోగాలోని నాలుగు మార్గాలైన – క్రియ, జ్ఞాన, కర్మ ఇంకా భక్తి యోగాను ఈశా యోగా కేంద్రం అందిస్తోంది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తారు.
ఈశా యోగా సెంటర్ కేంద్ర బిందువు అయిన ధ్యానలింగం అత్యంత శక్తివంతమయిన ప్రత్యేకమైన రూపం. ప్రతీ మానవుడు జీవాన్ని సంపూర్ణంగా అనుభవించే అవకాశం కల్పిస్తుంది. ఈశా యోగా కేంద్రానికి పక్కనే ఉన్న లింగ భైరవి – రౌద్ర రసాన్ని అదే సమయంలో ఎంతో కారుణ్యాన్ని వర్షించే అఖండమైన దేవీ శక్తి.
మీ ఉపయోగార్థం, యోగా కేంద్రం వివిధ వసతి ఏర్పాట్లు (Residential Accommodation) ఇంకా వివిధ కాల వ్యవధుల యోగా కార్యక్రమాలను అందిస్తుంది. వసతితో పాటు , కార్యక్రమంలో పాల్గొనేవారికి , అతిథులకు ఆరోగ్యకరమైన సాత్విక ఆహార సదుపాయం ఉంది. . ఈశా యోగా కేంద్రం, మీరు ఆరోగ్యకరమైన జీవనశైలికి మారడానికి, ఉన్నత స్థాయిలో సంతృప్తిని ఆపేక్షించడానికి, మీ పూర్తి సామర్థ్యాన్ని పొందటానికి మీకు సహకార వాతావరణాన్ని అందిస్తుంది.
మహాశివరాత్రికి రిజిస్ట్రేషన్ చేసుకోండి
యక్షా & మహాశివరాత్రి గురించిన ప్రశ్నల కోసం:
ఈ మెయిల్ : info@mahashivarathri.org
ఆఫ్ లైన్:
మహాశివరాత్రికి సంబంధించిన ప్రశ్నలు & రిజిస్ట్రేషన్ కోసం:
ఫోన్: 83000 83111
యోగా కేంద్రానికి ఎలా చేరుకోవాలి
కోయంబత్తూరుకి 30కి.మీ పడమరలో వెల్లెంగిరి పర్వతపాదాల వద్ద ఈశా యోగా కేంద్రం ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ వాణిజ్య నగరమైన కోయంబత్తూర్ విమానం, రైలు లేదా రోడ్డు మార్గానికి అందుబాటులో ఉంది . ఇక్కడకి చెన్నై, ఢిల్లీ, ముంబై ఇంకా బెంగుళూరు నుండి ప్రతిరోజూ విమాన సంస్థలు విమానాలను నడుపుతున్నాయి. దేశంలోని అన్ని ప్రముఖ నగరాలనుండి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి. కోయంబత్తూర్ నుండి ఈశా యోగా కేంద్రానికి అన్ని వేళల్లోనూ బస్సు, టాక్సీ సదుపాయాలు కూడా ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి
ోయంబత్తూరుకి 30కి.మీ పడమరలో వెల్లెంగిరి పర్వతపాదాల వద్ద ధ్యానలింగం ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ వాణిజ్య నగరమైన కోయంబత్తూర్ విమానం, రైలు లేదా రోడ్డు మార్గానికి అందుబాటులో ఉంది.
వాయు మార్గం::
కోయంబత్తూరులో విమానాశ్రయం ఉంది. ప్రముఖ నగరాలైన ఢిల్లీ, చెన్నై, ముంబై ఇంకా హైదరాబాదు నుండి ఇక్కడకు విమాన సౌకర్యం అందుబాటులో ఉన్నది.
రైలు మార్గం:
కోయంబత్తూర్ లో ఉన్న రైల్వే స్టేషన్ నుండి ఈశా యోగా కేంద్రానికి 30కి.మీ దూరం ఉంటుంది.
రోడ్డు మార్గం:
పూండి, సెమ్మేడు లేదా సిరువాని వైపు వెళ్ళే మార్గాలన్నీ ఈశా యోగా కేంద్రం వైపు వెళతాయి. ఎయిర్ పోర్ట్ ఇంకా రైల్వే స్టేషన్ వెలుపల టాక్ససౌకర్యం ఉన్నది.
బస్సు సేవలు:
ప్రతిరోజూ కోయంబత్తూర్ & యోగా కేంద్రం మధ్య బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి
బస్సు టైం టేబుల్ చూడండి
డ్రైవింగ్ నిర్దేశాలు
కోయింబత్తూర్ నుండి ఉక్కడం మీదుగా పేరూర్/సిరువాణి రోడ్డుకి రండి. అలందురై దాటాక, ఇరుటుపల్లం జంక్షన్ వద్ద కుడివైపు మలుపు తీసుకోండి. ఆ జంక్షన్ (ఇరుటుపల్లం) నుంచి, ఈశా యోగా కేంద్రం 8 కిమీ. ల దూరంలో ఉంటుంది. ఇంకా ఇదే రోడ్డు మీద ఉన్న పూండి దేవాలయం నుండి 2 కి.మీ.ల ఉంటుంది. మార్గమద్యంలో ధ్యానలింగానికి దారి చూపే పలకలు మీకు ఎదురవుతాయి. రూటు మ్యాప్..
సంప్రదించండి
ఫోన్: 83000 83111
ఈ-మెయిల్: info@mahashivarathri.org