1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై సద్గురు సందేశం
Also in:
English
मराठी

పహల్గామ్ ఉగ్రవాద దాడిపై సద్గురు సందేశం

తీవ్రవాదం ఉద్దేశ్యం యుద్ధం కాదు, భయంతో సమాజాన్ని నిర్వీర్యం చేయడమే. దాని లక్ష్యం భయాందోళనలు వ్యాపింపజేయడం, సమాజాన్ని విభజించడం, ప్రతి స్థాయిలో దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయడం, అరాచకాన్ని సృష్టించడం. ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలన్నా, పోషించుకోవాలన్నా, ఇలాంటి శక్తులను ఉక్కుపాదంతో, దృఢమైన దీర్ఘకాలిక సంకల్పంతో అణచివేయాలి. దీనికి విస్తృతమైన, దీర్ఘకాలిక పరిష్కారాలున్నాయి – విద్య, ఆర్థిక అవకాశాలు, సంపద, సంక్షేమం అన్ని స్థాయిలలో మరింత సమానంగా పంపిణీ జరగడం వంటివి. ప్రస్తుతానికి, మతం, కులం, వర్గం లేదా రాజకీయ అనుబంధాలు వంటి అన్ని సంకుచిత విభేదాలకు అతీతంగా ఒక దేశంగా కలిసి నిలబడటం, మన భద్రతా బలగాలు అన్ని స్థాయిలలో వారి విధులను నిర్వర్తించడానికి మద్దతు ఇవ్వడం అత్యంత ముఖ్యం. మృతుల కుటుంబ సభ్యులకు, గాయపడిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతి & ఆశీస్సులు. -సద్గురు

video

Jun 24, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
బంగ్లాదేశీ హిందువులు, ప్రార్థనా స్థలాల చట్టం & Waqf – కుంభమేళాలో సద్గురుతో టైమ్స్ నౌ ముఖాముఖి
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా, బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా ఎదుర్కొంటున్న సంక్షోభం మొదలుకొని, వక్ఫ్ చట్టాలు, ప్రార్థనా స్థలాల చట్టం వరకు, సద్గురు టైమ్స్ నౌకు చెందిన నవికా కుమార్‌తో కీలకమైన జాతీయ, రాజకీయ సమస్యలపై చర్చిస్తున్నారు.
Jun 24, 2025
video  
తండ్రి కొడుకులు మధ్య విభేదాలు ఎందుకు వస్తాయి?
సద్గురు ఒక ప్రశ్నకి సమాధానమిస్తూ, ఒకానొక సమయంలో కొడుకు తన తండ్రితో దూరం పాటించాల్సిన అవసరం ఉందని ఎందుకు అనిపిస్తుందో వివరిస్తున్నారు
Jun 24, 2025
video  
కబీర్ ఇంకా ఇరాన్ రాజుకి సంబంధించిన ఇంతవరకూ తెలియని కధ
సద్గురు కవి-సంతు కబీర్ మరియు ప్రస్తుత ఇరాన్, ఇరాక్‌ లలోని బుఖారా రాజు ఇబ్రాహీం గురించిన ఒక కథను వివరిస్తున్నారు. రాజుకు దైవానుభూతిని పొందాలనే తీవ్రమైన తపన ఉన్నప్పటికీ, అతని మానసిక గందరగోళం అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎలా అడ్డంకిగా మారిందో కబీర్ ఆ రాజుకు ఎలా తెలియజేశాడో సద్గురు వివరిస్తారు. కబీర్ రాజు దృక్పథాన్ని, తద్వారా అతని జీవితాన్ని ఎలా మార్చాడో, అదే విధంగా ఒకరు తమలోని చెత్తను తమ అంతర్గత ఎదుగుదలకు ఎరువుగా మార్చుకోవచ్చని సద్గురు గుర్తుచేస్తున్నారు.
Jun 24, 2025