సద్గురు : మీరు ‘నా దేహము, నా మనస్సు’ అని పిలిచేవి, మీ జ్ఞాపకాల గుట్ట. ఈ జ్ఞాపకాలు లేదా సమాచారం వలన మీ దేహం ఈ రూపం పొందింది. దానికి అందిన సమాచారం వేరే విధంగా ఉంటే, మీరు తినే ఈ తిండి మిమ్మల్ని ఒక కుక్క గానో, ఆవు గానో, ఒక గొర్రె గానో లేక మరింకేదో దానిగానో మార్చేది. వేరే మాటల్లో చెప్పాలంటే, మీ దేహం ఒక జ్ఞాపకాల మూట. ఆ జ్ఞాపకాల వలనే, దానికి గుర్తున్న విధంగా, ప్రతిదీ తమ పాత్రలను పోషిస్తాయి. మీరు ‘స్త్రీ’ నా లేక ‘పురుషుడా’ అన్నది మీరు మర్చి పోవచ్చు, కానీ మీ దేహానికి గుర్తుంటుంది. ఇదే విధంగా మీ మనస్సు గుర్తుంచుకుంటుంది, మీరెన్నో విషయాలు మర్చి పోవచ్చు కానీ మీ మనసు గుర్తు ఉంచుకుని అదే ప్రకారంగా పని చేస్తుంది.

ఈ రెంటికి అతీతంగా ఉండటమంటే, జ్ఞాపకాలకు అతీతంగా ఉండడం అన్న మాట, ఎందుకంటే జ్ఞాపకాలు అంటే గతించిన కాలం. మీ గతించిన దాన్ని గురించి మీరు కోరినంతగా ఆడుకోవచ్చు, కానీ కొత్తది ఏమీ జరగదు. మీ వద్ద ఉన్న వాటి గురించి ఎన్నయినా లెక్కలు వేసుకోవచ్చు- పాత వాటికీ రంగు వేయొచ్చేమో - కానీ కొత్తది ఏమీ జరగదు. మీకు మీ దేహానికి మధ్య, మీకు మీ మనస్సుకి మధ్య కొంత ఎడం కల్పించడం అన్న దాన్ని గురించి మేము మాట్లాడితే, మేము, మీరు గతానికి బానిసలవకూడని - ఎదో కొత్త అవకాశాన్ని గురించి మాట్లాడుతున్నామని. ఆ కొత్తది ఏమిటి? దాన్ని ఈ విధంగా చూడండి. ఈ సృష్టిలో ఎంత భాగాన్ని మీ జ్ఞాపకాల్లో ఇమిడ్చామని మీరు అనుకుంటున్నారు. చాల తక్కువ. అవునా? కాబట్టి ‘కొత్తవి ఏం జరుగుతాయిలే’ అని ఎవరూ అనకూడదు. ఎన్నో విషయాలు జరగవచ్చు. దాన్ని మనం ఏ వైపు నుండి సమీపిస్తున్నాము అన్న దానిపై అది ఆధారపడుతుంది.

విశ్వంలో లోపాలు

మనం కొన్ని పరిమాణాలలోకి వెళితే, కొన్ని ఘటనలు జరుగుతాయి. అందుకనే జనం కొత్త విషయాలలో మునిగి పోకుండా ఉండేట్లు గురువు నిరంతరం ప్రయత్నిస్తారు. అనేక విధాలుగా నేను జనాలకు కొత్త అనుభవాలను కోరుకోవద్దని గట్టిగా చెప్తుంటాను. ఎందుకంటే మీరు అనుభవాన్ని కోరుకుంటే ఏవో జరుగుతూ ఉంటాయి. అవి కొత్తవి కావచ్చు, అత్యంత ఆసక్తికరంగా ఉండవచ్చు మరియు విచిత్రంగా ఉండవచ్చు, కానీ దానితో మీరు పూర్తిగా దారి తప్పవచ్చు.

ఉదాహరణకి, మీరు పసివారిగా ఉన్నప్పుడు మీ తోటలో, గడ్డిపోచ మీద ఉన్న చిన్న పురుగు, అది విశ్వములో కల్లా విచిత్రమైనది. కానీ ఇప్పుడు, దాని మీద ఒక్క క్షణం కూడా వెచ్చించడానికి ఇష్ట పడరు. పురుగు అంటే ఛీ ఛీ. విచిత్రమేమిటంటే, మీ అనుభవంలో లేని విషయం, మీ అనుభవంలోకి వస్తే, కొంత సమయం వరకు అది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. ఆ తర్వాత, అది మరొక మామూలు విషయం అయిపోతుంది. ఇలాగే, విశ్వములో మిమ్మల్ని ఉత్తేజ పరిచే ఎన్నో పురుగులు మీకు తారస పడవచ్చు, ఏవయితే కొన్నాళ్ళు మిమ్మల్ని తికమక పెడతాయో, కానీ, ఆ తర్వాత అవి మామూలుగా అయిపోతాయి - ఇంకొక పురుగు లాగా.

జిజ్ఞాస పూర్వకమైన, మానవ మనస్సు, కొన్ని విషయాల మీదకు వెళ్ళవచ్చు, కానీ ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, దాని నుండి ఉపసంహరించుకునే జ్ఞానంతో ఉండి, దారి తప్పకుండ ఉండటం, ఉత్తేజాలను కోరుకోక పోవడం, కొత్త ప్రపంచాలను కోరుకోక పోవడం, ఎందుకంటే కొత్త ప్రపంచాలు ఒక బోను లాంటివి. కానీ, కొత్త ప్రపంచాలు కోరడనాకి, అసలు ఈ ప్రపంచంలో ఉన్న లోపమేమిటి?

విముక్తి అంటే కొత్త ప్రపంచాన్ని కోరడమో లేక స్వర్గానికి వెళ్లడమో కాదు. స్వర్గం అనేది ఇక్కడి కంటే, ప్రతిదీ మెరుగ్గా ఉన్న మరో కొత్త ప్రపంచం. కొద్దిగా మెరుగ్గా ఉన్నా, చాల మెరుగ్గా ఉన్నా, కొంత కాలానికి ఆ మెరుగైన దానితోనే మీరు విసుగు చెందుతారు. మారు మూల ప్రదేశాల్లో ఉన్న వారు, అమెరికా అద్భుతమైనదిగా అనుకుంటారు. కానీ అమెరికాలో ప్రజలు తెగ విసుగు చెంది ఉంటారు. కాకపోతే, అంత పెద్ద వినోద పరిశ్రమ ఎందుకు ఉంటుంది?

మీకు చురుకైన తెలివి తేటలుంటే. ఇరవై నాలుగు గంటల్లో కొత్తది, పాతదిగా మారిపోతుంది. మీరు మంద బుద్ధులయితే అది ఇరువై నాలుగు సంవత్సరాలు పట్టవచ్చు, కానీ అదీ పాతది అవుతుంది. కొత్తది ఒక వల. పాతది ఒక మురికి గుంట. మురికి గుంట నుండి దూకి కొత్త వలలో చిక్కు కోవడంలో, లాభం లేదు. ఆధ్యాత్మికత అంటే కొత్త దానికి ఎదురు చూడటం కాదు. పాత, కొత్తల నుండి విముక్తి కోరుతున్నారని అర్థం.

Editor’s Note: Find more of Sadhguru’s insights as he explores the realm of the enlightened in the ebook “Encounter the Enlightened.”

Purchase the ebook